చిత్రం: బాబు బంగారం (2016) సంగీతం: జీబ్రాన్ నటీనటులు: వెంకటేష్ , నయనతార దర్శకత్వం: మారుతి నిర్మాతలు: యస్.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ విడుదల తేది: 12.08.2016
Songs List:
మల్లెల వానలా పాట సాహిత్యం
చిత్రం: బాబు బంగారం (2016) సంగీతం: జీబ్రాన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నరేష్ అయ్యర్ మల్లెల వానలా మంచు తుఫానులా ముంచేసిందే నీలో మంచితనం మనసే మనిషై ఇలా పుట్టేసిందే నీలా ముద్దొస్తుందే నీలో హ్యూమనిజమ్ అచ్చైపోయావే చిట్టి గుండె లోతులో నచ్చావే తొట్ట తొలి చూపులో నా కంటి కలకిపుడెన్ని రంగులో పడిపోయా నీ ప్రేమలో.. చూస్తున్నా చూస్తున్నా నను నీలో చూస్తున్నా ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా మల్లెల వానలా మంచు తుఫానులా నా కంటి కలకిపుడెన్ని రంగులో పడిపోయా నీ ప్రేమలో చూస్తున్నా చూస్తున్నా నను నీలో చూస్తున్నా ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా ఇన్నాళ్లు ఏమయ్యావో ఏ దిక్కున దాక్కున్నావో ఇవ్వాళ్లే ఇంతందంగా నా కంట్లో పడ్డావో పున్నమిలో పుట్టుoటావో వెన్నెల నీ పేరంటావో ఆల్చిప్పలో ముత్యంలాగా స్వచ్ఛంగా మెరిశావో అందానికి హుందాతనం జంట చేరనా దేవతలా నడిచోచ్చావు నేల బారునా ఆకర్షించానే కొత్త కోనే గోడుగా నే ఫిదా అయా… నాలాగా నువ్వంట నీలాగా నేనంట అనుకోకున్నా ఇలా కలిసింది మన జంట నీ ఇంటి పేరే జాలి నీ మాటే చల్ల గాలి నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి నువ్వే నా దీపావళి నువ్వే నా రంగుల హోలీ నా గుండెల్లోని కాలి నీతోనే నిండాలి సూర్యోదయాన సుబ్బలక్ష్మి భక్తి పఠన మథర్ తెరిస్స నోటి మంచి మాటలా చుట్టు ముట్టావే నన్ను అన్ని వైపులా నే ఫిదా అయా… మల్లెల వానలా మంచు తుఫానులా నా కంటి కలకిపుడెన్ని రంగులో పడిపోయా నీ ప్రేమలో చూస్తున్నా చూస్తున్నా నను నీలో చూస్తున్నా ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా
స్నేహితుడో పాట సాహిత్యం
చిత్రం: బాబు బంగారం (2016) సంగీతం: జీబ్రాన్ సాహిత్యం: శ్రీమణి గానం: రంజిత్ స్నేహితుడో
దండమే ఎత్తుకుంటం పాట సాహిత్యం
చిత్రం: బాబు బంగారం (2016) సంగీతం: జీబ్రాన్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: గోల్డ్ దేవరాజ్ దండమే ఎత్తుకుంటం
దిల్లున్న వాడే పాట సాహిత్యం
చిత్రం: బాబు బంగారం (2016) సంగీతం: జీబ్రాన్ సాహిత్యం: శ్రీమణి గానం: ధనుంజయ , రమీ దిల్లున్న వాడే
రాక రాక వచ్చింది పాట సాహిత్యం
చిత్రం: బాబు బంగారం (2016) సంగీతం: జీబ్రాన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చిన్మయి, యాజిన్ నిజార్ వాట్ ఏ ఫీలింగ్ వన్నా గో డాన్సింగ్ కలలా నిజమే కలిసింది నలుదిక్కులలో ప్రేమే ఉన్న లవ్లీ ఐలాండ్ పిలిచింది రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం ఉన్న చోటే గొడుగైయింది నన్ను చేరి ఆకాశం స్వస్తి జాజి మడుగైయింది నిండు భూమి నాకోసం తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం ఉన్న చోటే గొడుగైయింది నిన్ను చేరి ఆకాశం సన్న జాజి మడుగైయింది నిండు భూమి నీకోసం రెండు అక్షరాలా పోలిక చిన్నదే చాలదే అంతకన్నా ఎక్కువే ఇది జన్మలో తిరదే మాటల్లో అంటేనే వినిపించేయదా నీలో ఇష్టం నేనంటే నీలోని ప్రాణం ఈ పిడికెడు గుండెల్లో దాచాలంటే ఎంతో కష్టం నీ పైని అనురాగం తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు కాలమంటూ గుర్తురాదని నిన్నిలా చూడని నువ్వు తప్ప నాకు వేరొక లోకమే లేదని ఆరారు ఋతువుల్ని వస్తే రాని పోతే పోనీ నీ కలలో మునకవని ప్రాయాన్ని పరువాల వెన్నెల్లా నిన్నే చూస్తూ కేరింతవని నా ఊపిరి సంద్రాన్ని రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం ఉన్న చోటే గొడుగైయింది నన్ను చేరి ఆకాశం సన్నజాజి మడుగైయింది నిండు భూమి నాకోసం తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు
టిక్కు టిక్కంటు పాట సాహిత్యం
చిత్రం: బాబు బంగారం (2016) సంగీతం: జీబ్రాన్ సాహిత్యం: కాసర్ల శ్యాంమ్ గానం: నరేంద్ర, ఉమా టిక్కు టిక్కంటు
బాబు బంగారం (Theme Music)
చిత్రం: బాబు బంగారం (2016) సంగీతం: జీబ్రాన్ సాహిత్యం: Theme Music గానం: షబిర్ బాబు బంగారం