చిత్రం: భద్ర (2005) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ నటీనటులు: రవితేజ, మీరాజాస్మిన్ దర్శకత్వం: బోయపాటి శ్రీను నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 12.05 2005
Songs List:
Just do it పాట సాహిత్యం
చిత్రం: భద్ర (2005) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: టిప్పు, తన్విషా Do it, just do it don't bather go and try Karthe dekho jo kuch kar na hai Take it just take it whatever comes your way Dil se lelo jo kuch milta hai ఎదురుగ వచ్చే ప్రతినిమిషం వదలకు అందే ప్రతి నిమిషం నడవాలంటే నడవాలంతే నిలబడి చూడకురా Do it, just do it don't bather go and try Karthe dekho jo kuch kar na hai Come on and take it just take it whatever comes your way Dil se lelo jo kuch milta hai హే గుండెలో కొండలెత్తే బలం చూపకుంటే మనం, దండగే యవ్వనం ఎండలో గొడుగు పట్టే గుణం గుర్తుపడితే జనం పండగే ఆ క్షణం ఓ చిలిపితనం మా సిగ్నేచర్ హే నలుపెరగదురా మా నేచర్ చీకటి తరిమే సూర్య కిరణమై చూపిస్తాం ఫ్యూచర్ Do it, just do it don't bather go and try Karthe dekho jo kuch kar na hai Come on and take it just take it whatever comes your way Dil se lelo jo kuch milta ha స్వర్గమే సొంతమౌవుతుందిరా అంత పదునైందిర ఈడనే ఆయుధం స్వప్నమై చదిరి పోనీకురా నిదుర పోనీకురా నేడు నీ యవ్వనం ఓ బ్రతకడమంటే ప్రతి పూట అడుగు అడుగున పులివేట ఎవరెస్ట్ ఇంకా కరిగించే జులుం ఉందిరా నీ కంట Do it, just do it don't bather go and try Karthe dekho jo kuch kar na hai Come on and take it just take it whatever comes your way Dil se lelo jo kuch milta hai
స స సై సైర సైరా పాట సాహిత్యం
చిత్రం: భద్ర (2005) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: కార్తిక్, చిత్ర ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు హాయ్ హాయ్ హేయ్ ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు ఆనందమొస్తే ఇంతే కాదా అందరూ ఆరాలు తీసే వింతే లేదే నమ్మరు స స సై సైర సైరా స స స సై సైర సైరా స స సై సైర సైరా సైర సైర సైరా (2) ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు చాల్లే జతులు చెడిపోవా మతులు ఇల్లాంటి కుప్పిగంతులు వేస్తారా చెప్పు నీలాంటి బుద్ధిమంతులు హే ఎన్నో పనులు వెనకబడి తరిమేటపుడు తీరిగ్గా చెమ్మ చెక్కలు ఆడేదెలాగో చెప్పందే అమ్మలక్కలు ఆహ చూసాంలే ఎంత భారం నువ్ మోసే రాచకార్యం చేస్తాంలే మేము సైతం చేతనైన సాయం స స సై సైర సైరా స స స సై సైర సైరా స స సై సైర సైరా సైర సైర సైరా ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు ఊరంతా హోరు వేసే అడుగు ఎటు వైపో అడుగు ఏ నింగి చుక్క వరకు దూరింది లాగ నీ కొంటె గాలి పరుగు తీసే పరుగు బిడియపడి ఆగే బెరుకు పెళ్లీడు ఆడ పిల్లకే ఉండాలి గాని మాలాంటి వాళ్ళకెందుకు అరెరే అబ్బాయి నీ బడాయి ఆకాశం తాకేనోయి మా తోనా నీ లడాయి చాలు ఆపావోయి అరెరే స స సై సైర సైరా స స స సై సైర సైరా స స సై సైర సైరా సైర సైర సైరా స స సై సైర సైరా స స స సై సైర సైరా స స సై సైర సైరా సైర సైర సైరా (2)
నువ్వు నాకు మనసిస్తే పాట సాహిత్యం
చిత్రం: భద్ర (2005) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం: కులశేఖర్ గానం: మల్లికార్జున్, సుమంగళి హే మబ్బులోన దాగి ఉన్న చందమామ నిన్ను మించే అందముంది చూడవమ్మా కళ్ళు చూసి కుళ్ళుకోదా కలువభామ ఆమె ముందు ఎవ్వరైనా నిలవరమ్మా హోయ్... హేయ్ ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది ఆనందం అంచులు దాటింది మరుమల్లెగ మారి నీకోసం పల్లవి పాడింది నా గుండెలో ఈ ఊపిరి నీ పేరులే అడిగింది నా కళ్ళలో ఈ కాంతిని నువ్వేనని తెలిపింది పరిచయమెరుగని తొలి తొలి వయసుని పిలిచి మనసుపడని నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా మరి కాస్త చనువిస్తే నీ సొంతమౌతా ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో అలజడి రేగింది పులకలు రేపింది ఎంత చెప్పినా వినకుండా ఏరులాగ నా మనసంతా గల గల పారింది ఉరకలు వేసింది నీ ఊసులే నాతో ఇలా చెప్పిందిలే చిరుగాలి నాతో మరి దోబూచులా రావే ఇలా ఒకసారి వివరములడగక ఎదురుగ నిలబడు కలల తెరలు వదిలి నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా హే.. ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది ఏలేలో ఏలేలో రామసక్కని కుర్రాడే ఏ ఊరి పిల్లాడో రాసలీలకు వచ్చాడే పచ్చని పంటల్లో ఎన్నో ముచ్చటలాడాడే చల్లని గుండెల్లో ఆడే చిచ్చునే రేపాడే నాకోసం పుట్టాడొయమ్మా ఈ అల్లరి వాడు మనసంతా దోచాడోయమ్మా.. హే.. వానవిల్లులో మెరుపంతా నీ ఒంపుసొంపులో గమనించా తళుకుల చిరునామా నువ్వేలే మైనా సంధ్య పొద్దులో ఎరుపంతా నీ పాల బుగ్గలో చిటికంతా తెలియని బిడియాలే ఒదిగెను నీలోనా నీ నవ్వుతో పున్నాగమే పూచిందిలే సుకుమారి నీ రాకతో నా జన్మకే వెలుగొచ్చనే తెలవారి ఉరుకుల పరుగుల పరువపు వయసుని చెలియ వెంటపడని నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా మరి కాస్త చనువిస్తే నీ సొంతమౌతా
తిరుమల వాసా పాట సాహిత్యం
చిత్రం: భద్ర (2005) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సుమంగళి తిరుమల వాసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా శ్రితజన పోష జయ జగదీష మా ఆర్తిని కనవయ్యా అడుగె పడని పయనాన అడుగె పడని పయనాన వెలుగై నడిపె నీ కరుణా ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకె తపములు చెసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా శ్రితజన పోష జయ జగదీష మా ఆర్తిని కనవయ్యా
ఓ మనసా ఓ మనసా పాట సాహిత్యం
చిత్రం: భద్ర (2005) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: రవి వర్మ ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు ఎగసి పడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం తపనపడి ఏం లాభం అందని జాబిలి జత కోసం కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో మిగిలే స్మృతులే వరమనుకో మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఈ పయనం వెలుగువైపు చూడనందా నిదరలేచే నా నయనం కరిగే కలలే తరిమే ఓ మనసా మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
ఎర్రకోక పచ్చ రైక పాట సాహిత్యం
చిత్రం: భద్ర (2005) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: పుస్పవనం కుప్పుస్వామి, ఉషా ఏలే ఏలే ఏలేలేలే అరె ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే అరె ఏలే ఏలే ఏలేలేలే ఎర్రకోక పచ్చ రైక చుట్టుకొచ్చిందిరో చిన్నపాప అయ్యబాబోయ్ ఆగలేక కన్నే కొట్టిందిరో కంటి పాప హే కౌగలే ఇచ్చుకో కందిచేనుకాడ హే చేతులే వేసుకో చెరుకుతోటకాడ సోదాచేసి ఆరాతీసి చేసిపోనా తీపి ముద్దు గాయం దాచుకున్న సిగ్గులన్ని మాయం రాజుకుంది చిన్నదాని ప్రాయం అడుగుతుంది అయ్యగారి సాయం ఎర్రకోక పచ్చ రైక చుట్టుకొచ్చిందిరో చిన్నపాప అయ్యబాబోయ్ ఆగలేక కన్నే కొట్టిందిరో కంటి పాప హే వాలు కళ్ళు చూడగానే నారాయణ ఆ ఆహా గుండెలోని చెప్పలేని భాదాయేనా ఆ ఆహా హే ఒట్టు తీసి గట్టు మీద పెట్టేయనా ఉట్టి మీద ఉన్నదంత ఇచ్చేయన చెమ్మా చెక్కాటలో గెలిపించవా సరే సయ్యాటలో నన్ను ఒడించవా మోహం చూసి దాహం వేసి కిర్రుమందే కుర్ర ఈడు తాపం చుర్రుమందే వంటిలోని తాపం మొయ్యలేను సోయగాల భారం తప్పదయ్యో కోకచాటు నేరం ఎర్రకోక పచ్చ రైక ఏలే ఏలే ఏలేలేలే అరె ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే అరె ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే.... అరె ఏలే ఏలే.... ఊయలల్లే మారిపోయి ఊగించనా వయసుతోటి వయసునేమో భాగించనా సందేవేళ సందుచూసి మోగించనా ఏలే ఏలే అందినంత అప్పనంగా లాగించనా ఏలేలెలే నువ్వే నా రాజువై పాలించవా సుఖ తీరాలలో నను తేలించవా ధూపం వేసి దీపం తీసి చేరుకుంటే అందమైన లోకం చుట్టుకోదా చెప్పలేని మైకం చేరుకుంటే అందమైన లోకం చుట్టుకోదా చెప్పలేని మైకం ఎర్రకోక పచ్చ రైక చుట్టుకొచ్చిందిరో చిన్నపాప అయ్యబాబోయ్ ఆగలేక కన్నే కొట్టిందిరో కంటి పాప ఏలే ఏలే ఏలేలేలే అరె ఏలే ఏలే ఏలేలేలే ఏలే ఏలే ఏలేలేలే అరె ఏలే ఏలే ఏలేలేలే
ఏ ఊరే చిన్నదాన పాట సాహిత్యం
చిత్రం: భద్ర (2005) సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం: విశ్వా గానం: టిప్పు, కల్పన హేయ్ ఏ ఊరే... ఏ ఊరే... హే ఏ ఊరే చిన్నదాన చూపుల్తో మత్తెక్కించే మైనా హే ముంబాయి బాబల్లేవున్నా తెలుగోడి తెగువే ఉంది చానా హేయ్ మేచ్చానే నీ తీరూ అరె చెప్పై ఊరి పేరు హేయ్ టైరో బాబు టైరో జల్ది క్యా హై యారో హే తస్సాదియ మామమియ్య క్యా జానా ఎవరికి ఎవరెవరో రయ్యో రయ్యోరే ఆ రయ్యో రయ్యోరే రయ్యో రయ్యో నాచోరే నాతో డిస్కో సైయ్యో సైయ్యా నే సిద్దంగున్నా చూసుకో బల్లె బల్లె బరిలోన సత్తా కాస్కో రైయో రైయో తయారేనయ్యో తీస్కో తీస్కో ఏ ఊరే చిన్నదాన చూపులల్తో మత్తెక్కించే మైనా హే ముంబాయి బాబల్లేవున్నా తెలుగోడి తెగువే ఉంది చానా హేయ్ క్యా నషా నీలో చూశా కొత్త కోణం హేయ్ చాల్ ఇక రేపొద్దయ్యో నాలో తాపం అరే కం కం కం కత్తిరో ఇదిసుర సుర సుర కొవ్వొత్తిరో ఈ గడసరి గం గం గమ్మత్తురో ఈ సోగసే నచ్చెనురో హేయ్ నవ నవ నవ రసికుడు బాపురే నా తనువును తడిమిన పోకిరి ఇక ఎగసిన మనసుల లాహిరి తు దేనా మత్ తుమ్ కో హి చాహియే రయ్యో రయ్యోరే ఆ రయ్యో రయ్యోరే రయ్యో రయ్యో నాచోరే నాతో డిస్కో సయ్యో సైయ్యా నే సిద్దంగున్నా చూసుకో బల్లె బల్లె బరిలోన సత్తా కాస్కో రయ్యో రయ్యో తయారేనయ్యో తీస్కో తీస్కో ఏ ఊరే చిన్నదాన చూపులల్తో మత్తెక్కించే మైనా ముంబాయి బాబలేవున్నా తెలుగోడి తెగువే ఉంది చానా ప్యార్ హవా నాలో రేగే ఏదో ఊహ ఓ యే మహర్ అదరహో వింత తరహా అరె వెయ్ వెయ్ వలపుల విత్తనం చల్ చెయ్ చెయ్ చిలిపిగ పెత్తనం ఇక కుదురుగా చూపితే నిబ్బరం ఈ సొకులు నీకే రే హేయ్ సొగసరి సొగసరి సోయగం నా మనసున పెంచెను పరవసం ఈ తొలి తొలి వలపుకి వందనం అరె ప్యార్ సే సమ్జా దిల్ తుమ్ టీకే రే రయ్యో రయ్యోరే ఆ రయ్యో రయ్యోరే రయ్యో రయ్యో నాచోరే నాతో డిస్కో సయ్యో సయ్యా నే సిద్దంగున్నా చూసుకో రయ్యో రయ్యోరే తయారేనయ్యో తీస్కో బల్లె బల్లె బరిలోన సత్తా కాస్కో కాస్కో