Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bobbili Raja (1990)





చిత్రం: బొబ్బిలి రాజా (1990)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: వెంకటేష్, దివ్య భారతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 14.09.1990



Songs List:



అయ్యో అయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి రాజా (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు , జానకి 

అయ్యో అయ్యో 




కన్యాకుమారీ పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి రాజా (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు , ఎస్.జానకి

కన్యాకుమారీ కనపడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
పాతాళం కనిపెట్టేలా  ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతి లేని సుందరి

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

గోపాలబాలా ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా
మైకంలో మయ సభ చూడు మహరాజా రాణా తోడు
సాగనీ మరి సరదాల గారడి

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

కొండలు గుట్టలు చిందులాడే తధికినతోం
వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం
తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం
ఊదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం
చూడమ్మో… హంగామా…
అడివంతా రంగేద్దాము సాగించే వెరైటీ ప్రోగ్రాం
కళ్ళ విందుగా పైత్యాల పండగ

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

ఆ.. కన్యాకుమారీ కనపడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
మైకంలో మయ సభ చూడు మహరాజా రాణా తోడు
సాగనీ మరి సరదాల గారడి

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

డేగతో ఈగలే ఫైటు చేసే చెడుగుడులో
చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో
నేలమ్మా తప్ప తాగెనో ఏ మూల తప్పిపోయనో
మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో
ఓయమ్మో… మాయమ్మో…
దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం
ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా


ఏయ్...గోపాలబాలా ఆపరా ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా
ఆ పాతాళం కనిపెట్టేలా  ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతి లేని సుందరీ

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

ఆ.. సాగనీ మరి సరదాల గారడి




చెమ్మ చెక్క.. పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి రాజా (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర 

పల్లవి:
చెమ్మ చెక్క.. చెమ్మ చెక్క.. జున్ను ముక్క చెంపనొక్క
నిమ్మ చెక్క.. నిమ్మ చెక్క.. నమ్మకంగ తిమ్మిరెక్క
కో అంది కోక ఎందుకో... కోరింది కోసి అందుకో
రాణీ...I love you..
రాజా...I love you..
చెమ్మ చెక్క.. చెమ్మ చెక్క.. జున్ను ముక్క చెంపనొక్క
నిమ్మ చెక్క.. నిమ్మ చెక్క.. నమ్మకంగ తిమ్మిరెక్క
చరణం 1:
మారుమూల సోకు చేర లేఖ రాయనా
సరసాలు కోరు సంతకాలు తాకి చూడనా
తేరిపార చూడనీ దోర ఈడునీ
చీర చూరు దాటనీ వేడి ఊహనీ
వెక్కిరించు వన్నెలన్ని కొల్లగొట్టుకోనీ
కళ్ళతోటి కత్తరించు కన్నె గజ్జెలన్నీ
రా...గారంగా.. సై రా...సారంగా..

చెమ్మ చెక్క.. చెమ్మ చెక్క.. జున్ను ముక్క చెంపనొక్క
నిమ్మ చెక్క.. నిమ్మ చెక్క.. నమ్మకంగ తిమ్మిరెక్క
కో అంది కోక ఎందుకో.. కోరింది కోసి అందుకో
రాణీ...I love you..
రాజా...I love you..
చరణం 2:
ఈటెలాంటి నాటు చూపు నాటుకున్నదీ
అలవాటులేని చాటు చోట మాటుకున్నదీ
ఈదలేను యవ్వనం ఆదరించవా
మీదవాలు మోజుతో స్వాగతించవా
రంగరంగ వైభవాల మంచమేలుకోవా
గంగపొంగు సంబరాల రంగుతేలనీవా
ఈ...ఏకంతం.. రాణీ...హహ కైలాసం..

చెమ్మ చెక్క.. చెమ్మ చెక్క.. జున్ను ముక్క చెంపనొక్క
నిమ్మ చెక్క.. నిమ్మ చెక్క.. నమ్మకంగ తిమ్మిరెక్క
కో అంది కోక ఎందుకో... కోరింది కోసి అందుకో
రాణీ...I love you.. రాజా...I love you..
రాణీ...I love you.. రాజా...I love you..



వద్దంటే వినడే పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి రాజా (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు , జానకి 


వద్దంటే వినడే




బలపం పట్టీ పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి రాజా (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర

బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్ 
కం అః ఉండేటప్పుడూ...
బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!!
సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ??

చరణం: 1
ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే?
ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే!!
ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది.
మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది!!
ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా...
నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా??
కాస్తైనా... కంగారు తగ్గాలి, కాదనను ఏం చేసినా

సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్
కం అః ఉండేటప్పుడూ... అరె రె ఓహోహోహో!!

చరణం: 2

తుప్పల్లో తుపాకీ సడి ఎట్టారేగుతుందో
రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో
కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే
కొండల్లోయ కోలే మనమెట్టా వున్నామంటే
అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే
అందాకా... అమర్రి నీఅత్తమ్మ ఈ మద్ది మమనుకో
బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ??
పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో

బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??
అం, అః అంటా అమ్మడూ... హొయ్యరే హొయ్యరే హొయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ??
తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్
తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్

Most Recent

Default