చిత్రం: బొమ్మరిల్లు (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కులశేఖర్, అనంత్ శ్రీరామ్
గానం: సిద్దార్ధ్
నటీనటులు: సిద్దార్థ్ , జెనీలియా
దర్శకత్వం: భాస్కర్
నిర్మాత: దిల్ రాజ్
విడుదల తేది: 09.08.2006
పనినిసస
కోరస్: నిసస నిసస నిసస గరిగమ పమగరి సని సని ప
గమపనిని
కోరస్: పనిని పనిని పనిని పప పప రిరి రిరి నిని నిని ద
గరిగమగ నిస నిగరి సనిస
నిస గరిస నిస నినిప నిస గరిస పమపమ గరిస
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కధలా మెదిలే నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ
చరణం: 1
తీపికన్న ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయికన్నా ఎంతోహాయిదైన
చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో వుందని అంటానే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ
పనినిసస పనినిసస పనినిసస గరి సరిమ
గమపనిని గమపనిని గమపనిని సని దపమ
గరిగమగ నిస నిగరి సనిస
చరణం: 2
నన్నునేనే చాలతిట్టుకుంటా
నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే
నన్నునేనే బాగామెచ్చుకుంటా
ఏదో చిన్నమాటే నువ్వునాతో మాటాడావంటే
నాతోనే నేనుంటా నీ తోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ
పనినిసస పనినిసస పనినిసస గరి సరిమ
గమపనిని గమపనిని గమపనిని సని దపమ
గరిగమగ నిస నిగరి సనిస
*********** ********** ********
చిత్రం: బొమ్మరిల్లు (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సాగర్
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఓఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా ఓఓఓ
ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన ఓఓఓ
కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే ఐనా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఓఓ
ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అలా తడికనులతో నినువెతికేది ఎలా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఓఓ
నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళ్ళైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓఓఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా ఓఓఓ
***** ***** *****
చిత్రం: బొమ్మరిల్లు (2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది
హే...హే...హే...హే...
హే...హే...హే...హే...
చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండి
పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా
యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది
అందంగా ఉంది తన వెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది
నా మనసు యెన్నో కలలే కంటుంది
బొమ్మను గీస్తే నీలా ఉంది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే
దాని మనసే నీలో ఉందంది..ఆ..ఆ..
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ..ఆ...
దాని మనసే నీలో ఉందంది...ఆ...ఆ..
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది....ఆ...ఆ..