చిత్రం: బ్రహ్మ (1992) సంగీతం: యమ్. యమ్. కీరవాణి నాటినటుకు: యమ్. మోహన్ బాబు, ఐశ్వర్య, శిల్పా శిరోద్కర్ దర్శకత్వం: బి.గోపాల్ నిర్మాత: యమ్. మోహన్ బాబు విడుదల తేది: 10.10.1992
Songs List:
చిక్కు చిక్కు బండి పాట సాహిత్యం
చిత్రం: బ్రహ్మ (1992) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: గురుచరణ్ గానం: చిత్ర, యస్. పి. బాలు చిక్కు చిక్కు బండి ఎంత చేసెనండి ఎత్తి కుదిపేస్తే ఎన్ను జారేనండి... హమ్మమ్మో నా గుండెల్లో గుప్పు గుప్పు లాడేనండి నట్టిల్లే అదిరేస్తే నడికొప్పె కదలాడి పోయేనండి చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి వంతెనెక్కు తుంటే దాని గంతులెక్కువండి అమ్మమ్మో ఆ ఇంజనులో డైవరికి ఇసురెక్కువా అందాల స్టేషన్లో విందారగించంగా ఆశక్కువా చిక్కు చిక్కు బండి ఎంత చేసెనండి అరె చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి డి డి డి డి పగలు రేయనక చిటపట దరువేస్తే నిద్దర పట్టేదెట్టా హా నలిగిన ఒళ్ళంతా చలివిడి ముద్దైతే పొద్దున లేచేదెట్టా హా హా ఇంజను గుంజుడుకి ఇంట్లో మంచంకి ఉయ్యాల ఊపొస్తది కుదుపుడు ఎంతైనా కుదురుగ పడుకుంటే కునుకే పట్టేస్తాది అమ్మమ్మో ఆ ఊపుల ఉయ్యాలకింక దండాలయ్యో ఈ ఉక్కిరి బిక్కిరి లేక చక్కగ ఉండే ఇంటికి పోదామయ్యో చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి ఎత్తి కుదిపేస్తే ఎన్ను జారేనండి... హా జారిన పైటంచు జండా చూపిస్తే ఆగే బండుంటాదా సిగ్గుల సింగారం సిగెనలిచ్చాక ఓపిక రాకుంటాదా హే హే హే ఓపిక ఎంతున్న రాపిడి తగ్గిస్తే హాయిగా ఉంటాదిగా దూరం ఎంతున్నా భారం లేకుండా జారుకు పోవచ్చుగా ఓలమ్మో ఆ పగడాల బండెక్కి దిగలేనమ్మో హేయ్ కలిసొచ్చే ఇంట్లోకి నడిసొచ్చే ఇల్లాలికి స్వాగతమమ్మో చిక్కు చిక్కు బండి ఎంత చేసెనండి ఎత్తి కుదిపేస్తే ఎన్ను జారేనండి... హమ్మమ్మో నా గుండెల్లో గుప్పు గుప్పు లాడేనండి నట్టిల్లే అదిరేస్తే నడికొప్పె కదలాడి పోయేనండి ఆరెరరెరే చిక్కు చిక్కు బండి - చిక్కు చిక్కు చిక్కు దాని దూకుడెక్కువండి - డి డి డి వంతెనెక్కు తుంటే - హా హా హా దాని గంతులెక్కువండి - హొయ్ హొయ్ హొయ్ అమ్మమ్మో ఆ ఇంజనులో డైవరికి ఇసురెక్కువా అందాల స్టేషన్లో విందారగించంగా ఆశక్కువా హా
చుమ్మా చుమ్మా కొమ్మా రెమ్మల్లో పాట సాహిత్యం
చిత్రం: బ్రహ్మ (1992) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: గురుచరణ్ గానం: చిత్ర, కే. జే. యేసుదాస్ చుమ్మా చుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో జుంటి తేనేకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే హో సోకులాడె ఆ రేకులిప్పుకొని తుళ్ళేపడుతుంటే చుమ్మా చుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే హోయ్ కలికి గుండెలో వణుకు సూదులై ఒల్లే తుళ్ళి ఆడే చుమ్మా చుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో రాగాలమ్మ పాట మేఘాలమ్మతోటి రాయభారమే పంపగా ఆ రాగా రాగా రేయి ఊగాడే వయ్యారం జతగాడే శృతి చేయగా సందిరంగుల సన్నగాజులే చిందులాడుకోగా కందిపోయిన కన్నెబుగ్గలే సింగారాలు ఆడ చుమ్మా చుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో నింగి నీలవేణి కొంగు చాటులోని రంగు బొంగరాలాడగా ఆ దాగుడు మూతల్లోన దాచిన అందాలన్నీ రాగలవాడికి అందించగా ఆ దొంతుమల్లెలా బంతులాటతో రేయి గడిచిపోగా గంతులాడు కౌగిళ్ళ వేడిలో ఒల్లే తుళ్ళి పాడ చుమ్మా చుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే హోయ్ కలికి గుండెలో వణుకు సూదులై ఒల్లే తుళ్ళి ఆడే చుమ్మా చుమ్మా కొమ్మా రెమ్మల్లో తుమ్మెదాడేనోయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించేనోయమ్మలో జుంటి తేనేకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే హో సోకులాడె ఆ రేకులిప్పుకొని తుళ్ళేపడుతుంటే
ముసిముసి నవ్వులలోన పాట సాహిత్యం
చిత్రం: బ్రహ్మ (1992) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: జాలాది గానం: కే. జే. యేసుదాసు ఆ... ఆ... ఆ... ఆ... ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా అభిమానమున్న వాన్ని అవమానపరచినా ఎదలోని చీకటంతా వెన్నెలగ మార్చినా బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన అనురాగ జీవితాన పెనుగాలి రేగినా తనవారు కానరాక కనుపాప ఏడ్చినా కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాల్చినా సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
రంభాపురంలో పాట సాహిత్యం
చిత్రం: బ్రహ్మ (1992) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: గురుచరణ్ గానం: చిత్ర, యస్. పి. బాలు రంభాపురంలో అంబారి మీద కూకోరా ఎత్తు ఉంది మెత్తా ఉంది చూస్కోరా ఎత్తు ఉంది మెత్తా ఉంది చూస్కోరా లే లే లే లే లే లే జింగిరి చికా... రంభాపురంలో అంబారి మీద కూకుంటా ఎత్తు ఎక్కే సత్తా ఉంది కాస్కోవే అరె ఎత్తు ఎక్కే సత్తా ఉంది కాస్కోవే రా రా రా రా రా రా డింగిరి టికా... ఘాటు నాటు పోటు చూసి కేటుగాడివనుకున్నా రాటు నీటు గోటు చూసి రూటే వేరు అనుకున్నా గడియారం ముల్లల్లే నడిరేతిరి ఒక్కటై మొత్తంగా మోత మోగిపోవాలా గదిలోకి రాగానే గడి గడి ని లెక్కపెట్టి గంట గంట కో గంట ఠంగుమనాలా రా రా రా రా రా రా డింగిరి టికా... రంభాపురంలో అంబారి మీద కూకోరా ఎత్తు ఉంది మెత్తా ఉంది చూస్కోరా అరె ఎత్తు ఎక్కే సత్తా ఉంది కాస్కోవే లే లే లే లే లే లే జింగిరి చికా... పెటా పెటా ఒళ్ళు యమా పిచ్చెత్తి పోవాలా హొయ్ పటా పటా జటా పటా చెమటపట్టి పోవాలా తెల్లారెసరికల్లా చెమ్కిలో చెక్కులన్ని ఎదురెదురు ఏసుకొని లాగాలా లాగింది రేగింది లబ్జనకర లగారే పక్కంతా పువ్వులతో తద్దినకరి దినారే లే లే లే లే లే లే జింగిరి చికా... చికా చికా చికా రంభాపురంలో అంబారి మీద కూకుంటా ఎత్తు ఎక్కే సత్తా ఉంది కాస్కోవే కాస్కోవే ఎత్తు ఉంది మెత్తా ఉంది చూస్కోరా రా లే రా లే రా ఆ రా ఆ రా ఆ రా ఆ డింగిరి టికా... టికా టికా టికా
అరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ పాట సాహిత్యం
చిత్రం: బ్రహ్మ (1992) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: గురుచరణ్ గానం: యస్. పి. బాలు హే షిరిడి సాయి బాబా ఈ గొడవేందో చూడు బాబా ఈ సీసాలో బిరడాలకి ఆ శివుడి గరళానికి చిందుల పందేలు సాగేనయ్య అరెరరెరరెరరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ ఈ సీసాలో దాగుంది నీ గంగ దాన్ని సోడాలో కలిపెయ్యి సుబ్బరంగా అరె పెగ్గుమీద పెగ్గే జారంగా ఆ తిక్క నెత్తినెక్కి ఆడంగా ఆ చుక్కల సింగారం చూడంగా... అరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ ఈ సీసాలో దాగుంది నీ గంగ దాన్ని సోడాలో కలిపెయ్యి సుబ్బరంగా హా హా మంచుకొండ మంచినీళ్లు కలిపీ మందు మింగినోడు శివుడు అరె ఎండిపోయే గుండెకాయ తడిపీ ఇట్టా బతికినోడే ఘనుడు హే తాగినోళ్లంతా దేవుళ్ళురా రేయ్ తాగలేనోడే మనిషంటరా రాత చేతకాని బ్రహ్మిగాడు ఈ బొమ్మల్నిజేస్తే ఆ బొమ్మలకు రంగులేసేవాడు పరబ్రహ్మ దేవుడైతే ఆ బ్రహ్మ తలదన్నే దేవుడ్నిరా ఆడి రాతనే మార్చే దాదానిరా హూ హా హా అందుకే అరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ ఈ సీసాలో దాగుంది నీ గంగ దాన్ని సోడాలో కలిపెయ్యి సుబ్బరంగా హు... బంగాళఖాతంలో బార్ ఓపెన్ జేసి పసిఫిక్ ఓషన్ని విస్కీగా మార్చేసి ఇండియా కంట్రికే ఇన్కమ్ తెద్దాము లేకుంటే ఈ దేశం అప్పుల్లో పడతాది కంట్రీ అప్పుకింద బ్యాంకుల్లో బంగారం అమ్ముకున్న రాకుమార్లు అందుకే మందు కొట్టేసి దేశానికి ఇన్కమ్ తెచ్చి పెడుతున్నాము సాగరాలు తాగేసి మేఘం ఆ సారాయి కాస్తే అరె వానజల్లు వరదలయ్యి పోయి మళ్ళి సారాయి వస్తే ఆ బ్రహ్మ సృష్టంతా మునగాలిరా ఈ బ్రహ్మ చెప్పిందే జరగాలిరా అరె చిందేయ్యి చిందేయ్యి శివలింగ ఈ సీసాలో దాగుంది నీ గంగ దాన్ని సోడాలో కలిపెయ్యి సుబ్బరంగా అరె పెగ్గుమీద పెగ్గే జారంగా ఆ తిక్క నెత్తినెక్కి ఆడంగా ఆ చుక్కల సింగారం చూడంగా... హోయ్