చిత్రం: చంద్రలేఖ (1998) సంగీతం: సందీప్ చౌతా నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ, ఇషాకొప్పికర్ దర్శకత్వం: కృష్ణవంశీ నిర్మాతలు: నాగార్జున, వి.రాంప్రసాద్ విడుదల తేది: 31.07.1998
Songs List:
సాహసమే చేయ్‌రా డింభకా పాట సాహిత్యం
చిత్రం: చంద్రలేఖ (1998) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం:: సిరివెన్నెల గానం: ఎస్.పి.బాలు సాహసమే చేయ్‌రా డింభకా అన్నది కదరా పాతాళభైరవి చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది ధైర్యముంటే హహ్హహ్హా దక్కుతుంది హహ్హహా రాకుమారి తెలివిగా వేయ్‌రా పాచిక కల్లో మేనక ఒళ్లోపడదా సులువుగా రాదురా కుంక బంగారు జింక వేటాడాలిగా నింగిదాకా హహ్హహ్హా నిచ్చెనేద్దాం హహ్హహ్హా ఎక్కిచూద్దాం హహ్హహ్హా ఒహ్హొహో... చందమామను అందుకొనే ఇంద్ర భవనాన్ని కడతానురా పడవంత కారులోన బజారులన్నీ షికారు చేస్తానురా సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చూడతానురా అపుడు అప్సరసలు ఎదురువచ్చి కన్ను కొడతారురా చిటికేస్తే హహ్హహ్హా సుఖమంతా హహ్హహ్హా మనదేరా సాహసమే చేయ్‌రా డింభకా అన్నది కదరా పాతాళభైరవి చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది ధైర్యముంటే హహ్హహ్హా దక్కుతుంది హహ్హహా రాకుమారి సున్ని ఉండలు కందిపొడి ఫ్యాక్టరీల్లోన వండించనీ అమెరికా ఇరాను జపాను ఇరాకు జనాలు తింటారనీ కొన్ని ఎం.పి.లను కొంటా కొత్త పి.ఎం.ను నేనేనంటా స్కాములెన్నో చేసి స్విస్‌బ్యాంకు కేసి డాలర్లలో తేలుతా సుడివుంటే హహ్హహ్హా ఎవడైనా హహ్హహ్హా సూపర్‌స్టారే సాహసమే చేయ్‌రా డింభకా అన్నది కదరా జై పాతాళభైరవి చొరవగా దూకకపోతే ఐ యామ్ వెరీ సారీ నువ్వనుకున్నది ధైర్యముంటే హహ్హహ్హా దక్కుతుంది హహ్హహా రాకుమారి
డివ్వీ డివ్వీ డివ్విట్టం పాట సాహిత్యం
చిత్రం: చంద్రలేఖ (1998) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం:: సిరివెన్నెల గానం: సౌమ్యారావు, సుజాత పల్లవి: డివ్వీ డివ్వీ డివ్విట్టం దీనికి మొగుణ్ణి తగిలిద్దాం కిల్లాడి బుల్లోణ్ణి ఒక్కణ్ణి చూడండి డాడీ తొందరగుందండీ పాపం దీన్నే ముందర తోలేద్దాం నా పెళ్లి వంకెత్తి తన సంగతి ఎత్తింది డాడీ అసలు కథ చెప్పనా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ గుట్టు బయటెట్టనా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ MTV నే చూడటం తలగళ్లను నలిపేయడం ఈ పిచ్చి పన్లన్నీ చేస్తుంది చూడండి డాడీ ఏయ్..తెగ చదివేస్తూ ఉండటం నీ ముందంతా నాటకం మిడ్ నైటు మసాలా చూసేది ఇదండి డాడీ చరణం: 1 అత్తగారు తెగ రెచ్చిపోతే అమ్మోరి డాన్సు కడతా BP షుగరు ఉందని మామకి పత్యమే పెంచుతా ఆడపడుచులను ఏడిపించి ఇంట్లోంచి వెళ్లకొడతా మొగుడికి మూతికి ముద్దుల ప్లాస్టరు వేసి జోల కొడతా కోడలంటేనే ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ కొడవలనిపిస్తా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ డివ్వీ డివ్వీ డివ్విట్టం డివి డివి డివి డివి డివ్విట్టం పెళ్లాడేందుకు మేం సిద్ధం కబాడి కబాడి కబాడి కబాడి డాడీ ఇల్లును మొత్తం పీకేద్దాం పెళ్లికి పందిరి వేసేద్దాం పిపిపి పిపిపి సన్నాయి మేళాలు తెండి చరణం: 2 నిన్ను చూసి గుటకేస్తూ ఉన్న ఈ కోతి బావ చూడే ఈ ఫేసును పెళ్లాడేందుకు కోతైనా ఒప్పుకోదే మనని కట్టుకొను దమ్ములున్న వీరాధివీరుడెవడే మననే మించిన పెంకి ఘటం ఈ భూమ్మీదుండడే ఎవ్వడొస్తాడో ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఎక్కడున్నాడో ఎక్కడెక్కడెక్కడెక్కడా డివ్వి డివ్వి డివ్వి డివ్విటం టం డివ్వీ డివ్వీ డివ్విట్టం ఒక్కణ్ణైనా కనిపెడదాం వలేసి మెలేసి మొగుణ్ణి సాధించుకుందాం ఏయ్..బాగుందే నీ భాగోతం ఉమ్మడి మొగుడంటే కష్టం ఇద్దర్ని పెళ్ళాడి వాడేమి కావాలి పాపం సర్దుకుందామే అబ్బబ్బబ్బా సవితి కాలేనే అర్రెర్రె అర్రెర్రె అరె అరె అరె అరె డివ్వీ డివ్వీ ఐ లవ్ యు నువ్వంటేనే నాకిష్టం నువ్వేమో పెళ్ళాడి పోతుంటే నేనుండలేనే డాడీకీ సంగతి చెబుదాం ఇల్లరికాన్నే తెమ్మందాం మొగుళ్లతో చేరి ఇల్లంతా కిష్కింధ చేద్దాం
ఒక్కసారి ఒక్కసారి పాట సాహిత్యం
చిత్రం: చంద్రలేఖ (1998) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం:: సిరివెన్నెల గానం: రాజేష్ కృష్ణన్ పల్లవి: ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో పర పరప్పప్పరర పప్పరర పరప్పప్పరర పప్పరర ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో చరణం: 1 పెదవులపై విరబూసే నవ్వుపువ్వులు వాడవురా సరదాగా నవ్వేస్తే దిగులు నిన్నిక చూడదురా రాత్రిలో సొగసు ఏమిటో చూపటానికే చుక్కలు బతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు పర పరప్పప్పరర పప్పరర పరప్పప్పరర పప్పరర ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో చరణం: 2 నవ్వంటూ తోడుంటే చందమామవి నువ్వే నీ చుట్టూ చీకటికి వెండి వెన్నెల నీ నవ్వే మువ్వలా శాంతి గువ్వలా నవ్వు రవ్వలే చిందనీ గలగల నవ్వగలగడం మనిషికొకడికే తెలుసనీ పర పరప్పప్పరర పప్పరర పరప్పప్పరర పప్పరర ఒక్కటంటే ఒక్క లైఫే నవ్వుకోనీ దాన్ని ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో పర పరప్పప్పరర పప్పరర పరప్పప్పరర పప్పరర ఒక్కటంటే ఒక్క లైఫే నవ్వుకోనీ దాన్ని ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
తాజ్ మహలుని పాట సాహిత్యం
చిత్రం: చంద్రలేఖ (1998) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం:: సిరివెన్నెల గానం: రాజేష్ కృష్ణన్ , సౌమ్యారావు పల్లవి: తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా జూలియట్టుని ఇడియట్టని జాలిపడి కూర్చున్నా ఆ పిచ్చి మారాజు నేనే అయ్యాను ఈ రోజున పడ్డాను నీ మోజులోనే అంటే నేనీడియట్టునా చందమామని అందుకోమని గుండె గోల వినలేదా అందుకే మరి వెంటనే మనం జంట చేరితే పోదా జాలీగా జాబిల్లి దాకా హనీమూన్ వెడదాం పద జూలియట్టుని ఇడియట్టని జాలిపడి కూర్చున్నా తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా చరణం: 1 పాత తరం రూటు మనం వెంటనే మార్చుదాం ఫాస్ట్ యుగం కుర్రతనం ప్రేమకే నేర్పుదాం ఊసులతో స్పేస్ కల శాటిలైట్ పంపుదాం ఆశలకి ఇంటర్నెట్ పాటలే చూపుదాం ఓకే అంటోంది లేడీ అంతా రెడీ పోదాం మరి టైటానిక్ షిప్పులో ప్రయాణం గోదారిలో నడుపుదాం జూలియట్టుని ఇడియట్టని జాలిపడి కూర్చున్నా తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా చరణం: 2 పారిస్‌కి టూరెళదాం ప్రేమ పాస్‌పోర్టుతో USని చూసొద్దాం వయసు వీసాలతో హేయ్ రివ్వుమనే పావురమై నింగిలో తేలుదాం కొంచెమలా దించు డియర్ సింగపూర్ స్టేటులో తీరా దించాక నిన్ను షాపింగ్ కోసం చంపవు కదా అబ్బబ్బా ఊహల్లో అయినా ఎకౌంట్లు మానవు కదా తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా జూలియట్టుని ఇడియట్టని జాలిపడి కూర్చున్నా ఆ పిచ్చి మారాజు నేనే అయ్యాను ఈ రోజున పడ్డాను నీ మోజులోనే అంటే నేనీడియట్టునా చందమామని అందుకోమని గుండె గోల వినలేదా అందుకే మరి వెంటనే మనం జంట చేరితే పోదా టైటానిక్ షిప్పులో ప్రయాణం గోదారిలో నడుపుదాం జూలియట్టుని ఇడియట్టని జాలిపడి కూర్చున్నా తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా జూలియట్టుని ఇడియట్టని జాలిపడి కూర్చున్నా తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా జూలియట్టుని ఇడియట్టని జాలిపడి కూర్చున్నా తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా
మొగలి పొదలు పాట సాహిత్యం
చిత్రం: చంద్రలేఖ (1998) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం:: సిరివెన్నెల గానం: రాజేష్ కృష్ణన్ , సునీత పల్లవి: మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి అగరు పొగలు తగిలి సొగసు రగిలి జతకేళి సాగాలి తీగ మల్లి నాగై ఊగాలి వేగే ఒళ్ళే అలలై పొంగాలి మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి వేగే ఒళ్ళో నాగై ఆడాలి చరణం: 1 మదన మధురవళి మదిని మృదు మురళి పదును గాయాలు చేసె మధురిమల కడలి అధరముల కదిలి పడుచు గేయాలు రాసె అందుకో కౌగిళి కందిపో కోమలి మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి వేగే ఒళ్లే అలలై పొంగాలి చరణం: 2 చెలిమి కలగలిపి చిలిపి లిపి తెలిపి వలపు రేపావు నాలో ఉలిని ఉసిగొలపి శిలల కల కదిపి కళలు లేపావు నాలో ఆడుకో నాగిని ఆదుకో ఆశని మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి అగరు పొగలు తగిలి సొగసు రగిలి జతకేళి సాగాలి లాలి లాలి పాడే జాబిల్లి జ్వాలే మారి జంటే కోరాలి మొగలి పొదలు కదిలి సెగలు వదిలి రరరార రారారా
ఉరుములు నీ మువ్వలై పాట సాహిత్యం
చిత్రం: చంద్రలేఖ (1998) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం:: సిరివెన్నెల గానం: రాజేష్ కృష్ణన్ , సుజాత పల్లవి: ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని మెలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విందియ్యవే ఆ అందాన్ని చరణం: 1 చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూట దీపావళి మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెల మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని చరణం: 2 నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా నీ పెదవే తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నిను చేరగా మా గుండెనే శృతి చేయవా నీ వీణలా ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని