Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chantigadu (2003)




చిత్రం: చంటిగాడు (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: బాలాదిత్య , సుహాసిని
దర్శకత్వం: బి.ఏ. జయ
నిర్మాత: బి.ఏ. జయ, బి.ఏ. రాజు
విడుదల తేది: 26.11.2003



Songs List:



లవ్ మి లవ్ మి పాట సాహిత్యం

 
చిత్రం: చంటిగాడు (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: శ్రేయా ఘోషల్ 

లవ్ మి లవ్ మి 




కొక్కొరోకో పాట సాహిత్యం

 
చిత్రం: చంటిగాడు (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: శంకర మహదేవన్ 

కొక్కొరోకో 



ఒక్కసారి పిలిచావంటే పాట సాహిత్యం

 
చిత్రం: చంటిగాడు (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జిల్లెళ్ల ప్రసాద్
గానం: ఉదిత్ నారాయణ్, మహలక్ష్మి అయ్యర్ 

సాకీ:
ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా

పల్లవి:
ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా

హో...ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా

నువ్వంటే నాకిష్టమని
నిన్నే ప్రేమిస్తున్నానని అన్నావంటే
నన్నే నేను మరచిపోనా
నీలో నేను చేరుకోనా
నన్నే నేను మరచిపోనా
నీలో నేను చేరుకోనా

ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా

చరణం: 1
దేవతల్లే వచ్చి దివ్య వరములిచ్చి
నుదుటిరేఖ మార్చు నేస్తమా...
మమత రంగరించి మంచిపోతపోసి
మంచు కొండ నువ్వే సుమా 

దేవతల్లే వచ్చి దివ్య వరములిచ్చి
నుదుటిరేఖ మార్చు నేస్తమా...
మమత రంగరించి మంచిపోతపోసి
మంచు కొండ నువ్వే సుమా 

నువ్వే నా ప్రాణమవ్వగా
నీకే నా ప్రాణమివ్వనా
ఊపిరాగు వరకు వెంట నువ్వు ఉంటే
గుండె గుడిని కానుకివ్వనా
ఓ..ఎన్ని జన్మలైన నువ్వు తోడు ఉంటే
అంతే చాలు నాకు ప్రియతమా

మళ్ళి పుట్టుకంటు ఉంటే
నీకు ప్రేమ బంటునవనా
స్వర్గం అన్నదంటు ఉంటే
అది నీ గుండె వాకిలననా

ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా

చరణం: 2
సప్తవర్ణమయమై సప్తస్వరము చిలికే
రాగాల తేనె సంద్రమా
అమ్మదనములోని కమ్మదనము పంచే
పంచామృతాభిషేకమా

సప్తవర్ణమయమై సప్తస్వరము చిలికే
రాగాల తేనె సంద్రమా
అమ్మదనములోని కమ్మదనము పంచే
పంచామృతాభిషేకమా

నువ్వే నా..లోకమవ్వగా
నీలోనే..ఏకమవ్వనా
నువ్వు నా వసంతం
నేను నీకు సొంతం
నాకు నువ్వు నీకు నేనుగా
నువ్వే నా ప్రపంచం నేనే నీ సమస్తం
నీకు నేను నాకు నువ్వుగా

నీలో తీపి ప్రేమ గురుతై
చరితలో నేను నిలిచిపోన
నీ కాలి గోటిపైన నేనే కవిత
రాసుకొనా

ఒక్కసారి పిలిచావంటే
కోటిసార్లు పలుకనా
ఒక్కసారి చూశావంటే
వంద ఏళ్ళు బతకనా





చిరుగలిలా చివురాకులా పాట సాహిత్యం

 
చిత్రం: చంటిగాడు (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బి. చరణ్ , ఉష

చిరుగలిలా చివురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా
చిరుగలిలా చివురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా
నెలవంకలా నది వంపులా
మనసును మెత్తగ దోచి తెలిపేనా
మేఘమా ఆగవే... తోడుగా సాగవే...
కన్నులు రాసిన కవితలు వినిపోవే

చిరుగలిలా చివురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా

సన్నజాజి పువ్వుల్లోన కన్నెలేడి కన్నుల్లోన
చూశానే నీ రూపం
స్వాతి వాన చినుకుల్లోన 
రామ చిలక పలుకుల్లోన
విన్నాలే నీ రామం
నీకోసం వేసవి కాలం వెన్నెలగా మారింది
నీకోసం నీలాకాశం మౌనపు చర వీడింది
ఎల కోయిల నీకై తొలి తొలి పాట సిద్ధం చేసింది

చిరుగలిలా చివురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా

కోడె వయసు కొంటెదనాలే
నీ చూపై నిలదీశాయన్నాదోయ్ నా పరువం
ఇంద్రధనస్సు వయ్యారాలే
నీ ఒడిలో పదకేశాయని అన్నదే రవికిరణం
నీతోనే ఉంటానంటూ అలిగింది నా ప్రాణం
నీతోనే పుట్టిందమ్మ ప్రేమ అనే తొలివేదం
నీ కలలకు నేనే కావలినైతే నా బ్రతుకే ధన్యం

చిరుగలిలా చివురాకులా
గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా




స్వాతిముత్యమై నన్నల్లుకోరా పాట సాహిత్యం

 
చిత్రం: చంటిగాడు (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భువనచంద్ర
గానం: కార్తిక్ , ఉష

స్వాతిముత్యమై నన్నల్లుకోరా
గుండె గూటిలో నువ్వుండి పోరా
స్వాతిముత్యమై నన్నల్లుకోరా
గుండె గూటిలో నువ్వుండి పోరా

నింగిలో నీలి మేఘమై శోధగా
నేలకి వాన రాగమై చేరవా
ఈ బాలగోపిక నేనోపలేనిక
వదిలేసి నన్నిలా నువ్వెల్లిపోకలా
కలా -  ఉమ్  - కలలా

స్వాతిముత్యమై నన్నల్లుకోరా
గుండె గూటిలో నువ్వుండి పోరా

బుగ్గనాది ముద్దునీది
వయసు నాది వలపు నీది
నీకై తపించి నిన్నే ప్రేమించి
నీతో వచ్చానురా

కళ్లు నావి చూపు నీది
గుండె నాది శ్వాస నీది
ఐనా వయ్యారి నాటి
మయూరి పదవే సరాసరి

ఓపలేనోయ్ ఓ రాకుమారా
నిన్ను చూస్తే పులకింతలేరా
వెయ్ కె పాప ఒళ్లోన డేరా
సొగసునిట్టా చెయ్ కే దుబారా

ఓ కన్యకామణి సరసాలు చాలు పదవే
వదిలేసి నన్నిలా నువ్వు వెళ్లిపోకలా - హుహు
కలా - హుహు - కలలా

స్వాతిముత్యమై నన్నల్లుకోరా
గుండె గూటిలో నువ్వుండి పోరా

పంచుకుంటే లిప్పు స్వీటు
పెరిగిపోదా హార్టుబాటు
మారం మానాలి దూరం తగ్గాలి
అపుడే ఆనందమే
కౌగిలిస్తా కన్నుగీటు
వెంటవస్తా వెన్నుమీటు
కాదా హుషారు చూపి
నీ జోరు ఉందోయ్ నా అందమే

వెంటపడితే నేరెచ్చిపోతా
రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా
చిచ్చికొడితే నే రెచ్చకొడతా
మిస్సు కాస్త మిస్సెస్ నవుతా

నేనాగ లేనురా నా మాట కాస్త వినరా
ఉయ్యాలలూపరా ఒడిచేరి అందగాడా
అలా అలా అలలా

స్వాతిముత్యమా నన్నల్లుకోరా
గుండె గూటిలో నువ్వుండి పోరా

నింగిలో నీలి మేఘమై శోధగా
నేలకి వాన రాగమై చేరవా
ఓ బాలగోపిక నేనోపలేనిక
వదిలేసి నన్నిలా నువ్వెల్లిపోకలా
కలా -  హా  - కలలా- ఉమ్




సీతాకోక చిలుకలు పాట సాహిత్యం

 
చిత్రం: చంటిగాడు (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: పైడిశెట్టి రామ్
గానం: యస్. పి. బాలు 

సీతాకోక చిలుకలు  




సిగ్గులొలికే సీతాల పాట సాహిత్యం

 
చిత్రం: చంటిగాడు (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: సునీతా ఉపద్రష్ట , గంగాధర్ 

సిగ్గులొలికే సీతాలు 

Most Recent

Default