Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chinarayudu (1992)




చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: వెంకటేష్, విజయశాంతి
దర్శక్కత్వం: బి.గోపాల్
నిర్మాత: పి.ఆర్.ప్రసాద్
విడుదల తేది: 07.08.1992



Songs List:



బుల్లిపిట్ట బుజ్జిపిట్ట (Version l) పాట సాహిత్యం

 
చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, ఎస్. జానకి

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే
ఎవరో ఎవరో తెలియుందే నేనెట్టా ఎట్టా పిలిచేదే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే

చరణం: 1
కొంటె కోణంగి ఈడు కొట్టే కేరింత చూడు
ఏదో గవ్ముత్తుగుంది మావ
లేనే లేదంటు హద్దు ముద్దు ముద్దుకి పద్దు రాస్తే ఎట్టా సత్యభామా
బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు
నీకే వుంచా నేను పోకిరి
చక్కంగ ముందుకొచ్చి సందేళ విందులిస్తే
కాదంటానా జత రా మరి
వారం వర్జ్యం చూడాలి ఆపైనే నీతో వాడాలి

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే

చరణం: 2
ఇంటి తాళాలు దాచి గంట మోగించమంటే
ఎట్టాగమ్మో గౌరమ్మో
జంటా బాణాలు దూసి ఇట్టా రెట్టిస్తే నన్ను
వేగేదెట్టా మావయ్యో
గోరింక గూటిముందు చిలకమ్మ చిందులేసి
ఆడిందంటే అర్థమేవిటో
మందారపువ్వు మీద మురిపాల తుమ్మెదొచ్చి
వాలిందంటే మరిదేనికో
నీలో నేనే దాగాలి చెలరేగే తాపం తీరాలి

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే
ఎవరో ఎవరో తెలియుందే నేనెట్టా ఎట్టా పిలిచేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే





బుల్లిపిట్ట బుజ్జిపిట్ట (Version ll) పాట సాహిత్యం

 
చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, యస్. పి. బాలు

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది
అది ఎవరే ఎవరే తెలిపేది
ఎన్ని నాళ్లే ఇట్టా గడిచేది
అది ఎవరే ఎవరే తెలిపేది
ఎన్ని నాళ్లే ఇట్టా గడిచేది

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది

చరణం: 1
నిన్నే తలుచుకుంటు ప్రాణం నిలుపుకుంటు
నీకై నిలిచి ఉంది శ్వాస
కాలం కరుగుతున్నా శోకం పెరుగుతున్నా
ఏదో జరుగునన్న ఆశ
పూమాల వాడలేదు పారాణి ఆరలేదు
అయినా లోకం జాలి చూపదే
నీ గుండె చప్పుడింక నా గుండె చేరలేదు
అయినా అయినా కథ మారదే
కష్టాలన్నీ గాయాలే
అవి కాలంతోటే మానాలే

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట చెట్టుమీద పాలపిట్ట
ఊరిలోని గోరువంక ఎట్టా ఉన్నది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది

చరణం: 2
నువ్వే దేవుడివన్న ఊరే నిందిస్తూ ఉంటే
చెప్పలేని గుండె కోత
కళ్లే కలుపుకుని ఎన్నో కలలుగన్న వేళే కాటేసింది బాధ
మురిపాన కట్టుకున్న పొదరిల్లు కూలిపోతే
ఎదలో రగిలే మంటలారునా
నూరేళ్ల పంట ఇట్టా మూణ్నాళ్ల ముచ్చటైతే
మామా మామా వ్యధ తీరునా
మళ్ళి ఎట్టా కలిసేది
నా ప్రాణం ఎట్టా నిలిపేది

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట చెట్టుమీద పాలపిట్ట
ఊరిలోని గోరువంక ఎట్టా ఉన్నది
అది ఎవరే ఎవరే తెలిపేది
ఎన్ని నాళ్లే ఇట్టా గడిచేది
అది ఎవరే ఎవరే తెలిపేది
నేనెట్టా ఎట్టా బతికేది

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది




నిండు ఆకాశమంత (Male) పాట సాహిత్యం

 
చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వేసిన
దేవుడు నీవే చిన్నరాయుడు నీవే

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా

చరణం: 1
గాలిలోన తేలే పరువాల పూల కొమ్మా
నేలవాలిపోగా చివురింప చేసినావే
పసుపు తాడు మీద లోకానికున్న ప్రేమ
మనిషిమీద లేదు ఈ నీతికెవరు బ్రహ్మ
తప్పవురా హేళనలు వేదనలే నీ హితులు
గుండెకు బండకు వారధి కట్టిన
దేవుడి లీల ఇది కాకుల గోల

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా

చరణం: 2
నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుక
గూటిలోని చిలుక గుబులేదొ ఎవరికెరుక
నుదుటి మీద రాత వేరెవరు మార్చగలరు
న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు
ఒంటరిది నీ పయనం నిబ్బరమే నీకభయం
తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన
దేవుడి లీల ఇది కాకుల గోల

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వేసిన
దేవుడు నీవే చిన్నరాయుడు నీవే

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా





నిండు ఆకాశమంత (Female) పాట సాహిత్యం

 
చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వేసిన
దేవుడు నీవే చినరాయుడు నీవే
ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా



కంటి చూపు చాలునయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు

ఊరు దిష్టి వాడ దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి
నరుల దిష్టి పరుల దిష్టి మనిషి దిష్టి మాను దిష్టి
తల్లి దిష్టి చెల్లి దిష్టి అసలు దిష్టి కొసరు దిష్టి
కాటుకలా కరగనీ హారతిలా రగలని
చీకటులే తొలగని చిరునవ్వులు విరియనీ...

కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు
కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు
కష్టమంత తీరెనయ్యా చిన్నారాయుడు
నిన్ను కన్న ఊరు గొప్పదిరా చిన్నారాయుడు హాయ్
కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు
కష్టమంత తీరెనయ్యా చిన్నారాయుడు
నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నారాయుడు
అవును

సాక్ష్యులను సెటప్ చేసే ఛాన్స్ లేదు మా ఊరిలో
వాయిదాల వకీళ్ళకి చోటు లేదు మా వాడలో
కొల్లగొట్టు కోర్టు కన్నా చక్కని తీర్పు నీదేనన్నా
అ ఆ ఇ ఈ చదువు కన్నా అన్నం పెట్టే చెయ్యే మిన్న
మాట తప్పిపోనివాడు రఘురాముడంటి మొనగాడు
చిన్నరాయుడంటి వాడు కోటికొక్కడైన లేనే లేడు
తన అండా దండా ఉంటే చాలు ఊరికి ఎంతో మేలు
ఏ ఊళ్ళోనైనా ఇట్టాంటోడు ఒక్కడు ఉంటే చాలు హా

కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు
కష్టమంత తీరేనయ్యా చిన్నారాయుడు
నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నారాయుడు

నాట్లు నాటే పిల్లగాలి పాటలలో నీవే
ఏతమేసే రైతు బిడ్డ మాటలలో నీవే
పైట వేసే కన్నెపిల్ల ఊహలలో నీవే
మా గుండెలోన పొంగిపోయే ప్రేమలన్నీ నీవే...
నాగలెత్తి పట్టుకుంటే చేను తుళ్ళిపోవునంట
కాలు పడ్డ బంజరైనా పైడి పంట పండునంట
ఉన్నోడు లేనోడనే బేధాలేవీ రానీడయ్య
కన్నెర్ర జేశాడంటే దేవుడికైనా భయమేనయ్యా
మీసమున్న ప్రతివాడు చిన్నరాయుడంటి వాడు కాడు
పేదవాడికోసమైనా తన ప్రాణమిచ్చు దొర వీడు
తన అండా దండా ఉంటే చాలు ఊరికి ఎంతో మేలు
ఏ ఊళ్ళోనైనా ఇట్టాంటోడు ఒక్కడు ఉంటే చాలు

కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు
కష్టమంత తీరేనయ్యా చిన్నారాయుడు
నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నారాయుడు
మ్మ్...కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు
కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు
కష్టమంత తీరెనయ్యా చిన్నారాయుడు
నిన్ను కన్న ఊరు గొప్పదిరా చిన్నారాయుడు...




స్వాతిముత్యమాల పాట సాహిత్యం

 
చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, యస్. పి. బాలు

స్వాతిముత్యమాల
ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది
సిగ్గుపడ్డ చీర
కట్టువీడి జారిపోయింది
కొంగు చాటు అందాలు
కన్నుకొట్టి రమ్మంటే
వయసాడమంది సయ్యాట
ఇది యవ్వనాల పూదోట
స్వాతిముత్యమాల
ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది

పెదవితో పెదవి కలిపితే
మధువులే కురియవా
తనువుతో తనువు తడిమితే
తపనలే రగలవా
తొందరెందుకంది కన్నెమనసు
పూలతీగలాగ వాటేసి
ఊయలూగమంది కోరవయసు
కోడెగిత్తలాగ మాటేసి
కవ్విస్తున్నది పట్టెమంచము
రావా రావా నారాజా

స్వాతిముత్యమాల
ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది
సిగ్గుపడ్డ చీర
కట్టువీడి జారిపోయింది

మేఘమా మెరిసి చూపవే
గడసరి తళుకులు
మోహమా కొసరి చూడవే
మగసిరి మెరుపులు
కొల్లగొట్టమంది పిల్ల సొగసు
కొంటె కళలన్ని నేర్పేసి
లెక్కపెట్టమంది సన్నరవిక
ముద్దులెన్నో మోజు తీర్చేసి
పరుపే నలగని పరువం చిలకని
మళ్ళి మళ్ళి ఈవేళ

స్వాతిముత్యమాల
ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది
సిగ్గుపడ్డ చీర
కట్టువీడి జారిపోయింది
కొంగు చాటు అందాలు
కన్నుకొట్టి రమ్మంటే
వయసాడమంది సయ్యాట
ఇది యవ్వనాల పూదోట
వయసాడమంది సయ్యాట
ఇది యవ్వనాల పూదోట





చెప్పాలనుంది సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు

చెప్పాలనుంది సుందరి
కధ విప్పిచెబుతాను సుందరి
చెప్పాలనుంది సుందరి
కధ విప్పిచెబుతాను సుందరి
పదిమంది ముందు మూగబోయిన
మనసన్న మాట చెప్పకుండునా
వెన్నెలమ్మ ఇంట చీకటుండదమ్మ
గుండెలో ప్రేమలు గట్టు దాటవమ్మా

చెప్పాలనుంది సుందరి
కధ విప్పిచెబుతాను సుందరి




చిట్టి చిట్టి నీ పైట పాట సాహిత్యం

 
చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు

రాయుడయ్యా
సుబ్రంగా ఇరుక్కుంది
ఈ పిల్లని వదలొద్దు
రెడియా... ఊఁ
రెడీ... చుప్

చిట్టి చిట్టి నీ పైట కొంచెం వడిసి పట్టాన
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టన
చిట్టి చిట్టి నీ పైట కొంచెం వడిసి పట్టాన
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టన
ఆషామాషిగ నన్ను ఆట పట్టిస్తుంటే
నేనూరుకోనే గుంతలక్కిడి
పైలా పచ్చిసు పిల్ల దెబ్బ కాసుకోవే
ఉడుకెత్తిపోద్ది చిట్టి జంగిడి

చిట్టి చిట్టి నీ పైట కొంచెం వడిసి పట్టన
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టన
చిట్టి చిట్టి నీ పైట కొంచెం వడిసి పట్టన
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టన

అవ్వాయ్ చువ్వాయ్ లా బుల్లి తువ్వాయ్ లా
గంతులేస్తే ఒప్పనమ్మడి
కొంగు ఆడించిన తోక జాడించిన
నాకాడ చల్లదమ్మడి

అవ్వాయ్ చువ్వాయ్ లా బుల్లి తువ్వాయ్ లా
గంతులేస్తే ఒప్పనమ్మడి
హోయ్ - కొంగు ఆడించిన తోక జాడించిన
నాకాడ చల్లదమ్మడి

చింతకాయ దొంగ తగ్గించు పులుపు
చుప్పనాతి మంగ మాదేలె గెలుపు
నంగనాచి బుర్ర పందేలు తగవే
మర్రిచెట్టు తొర్ర పాదాల పడవే
బొంగరాల బుచ్చి బజ్జోవె ఈడకొచ్చి
ఆడించుతాను కోతి కొమ్మచ్చి

బొంగరాల బుచ్చి బజ్జోవె ఈడకొచ్చి
ఆడించుతాను కోతి కొమ్మచ్చి

చిట్టి చిట్టి నీ పైట కొంచెం వడిసి పట్టన
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టన

తూటా దట్టించన తోటగొట్టించన
ఆ నట్టు ఫిట్ చేయనా
అట్టా తిరగెయ్యనా ఇట్టా మరగెయ్యనా
లోగుట్టు రట్టు చెయ్యనా

తూటా దట్టించన తోటగొట్టించన
ఆ నట్టు ఫిట్ చేయనా
హొయ్ హొయ్
అట్టా తిరగెయ్యనా ఇట్టా మరగెయ్యనా
లోగుట్టు రట్టు చెయ్యనా

నల్ల తుమ్మ గింజ పంతాలు విడని
తెల్ల తాటి ముంజ పగ్గాలు పడని
బుల్లి మేకపిల్ల ఆ గట్టు పదవే
పంచదార బిళ్ళ నా పట్టు విడవే
ఆడ కందిరీగ నాందేడు కుచ్చు పాగా
ఈ పోతుటీగ పవరు చూడవే

ఆడ కందిరీగ నాందేడు కుచ్చు పాగా
ఈ పోతుటీగ పవరు చూడవే

చిట్టి చిట్టి నీ పైట కొంచెం వడిసి పట్టాన
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టన
చిట్టి చిట్టి నీ పైట కొంచెం వడిసి పట్టాన
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టన
ఆషామాషిగ నన్ను ఆట పట్టిస్తుంటే
నేనూరుకోనే గుంతలక్కిడి
పైలా పచ్చిసు పిల్ల దెబ్బ కాసుకోవే
ఉడుకెత్తిపోద్ది చిట్టి జంగిడి

చిట్టి చిట్టి నీ పైట కొంచెం వడిసి పట్టన
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టన
చిట్టి చిట్టి నీ పైట కొంచెం వడిసి పట్టన
చుట్టు చుట్టుకు నా బొంగరం పదును పెట్టన


Most Recent

Default