Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chintakayala Ravi (2008)




చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
నటీనటులు: వెంకటేష్, అనుష్క, మమతా మోహన్ దాస్
దర్శకత్వం: యోగి
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
విడుదల తేది: 02.10.2008



Songs List:



బాగుందే బాగుందే పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ ప్రకాష్, హాన్షిక

ప్రేమేనా...
హొ... ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగ నా మనసునే అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోన జరిగే ఇది

బాగుందే బాగుందే ఏదో బంధమే
సాగిందే నీతో పాదమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
ఊగిందే నీకై హృదయమే

చరణం: 1
ద్వేషమే  స్నేహమై కష్టమే ఇష్టమై
దూరమే తీరమై భారమే తేలికై
పంతాలే చిలిపిగ చదివిన పాఠాలై
భేదాలే చివరికి కలిసిన భావాలై
ఏనాడో చినుకల్లే మొదలైనది
ఈనాడే వరదైన వరమే ఇది

బాగుందే బాగుందే ఏదో బంధమే
మోగిందే నాలో మౌనమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
లాగిందే ఊహాలోకమే

ప్రేమేనా...

చరణం: 2
చూపులే చిత్రమై మాటలే మంత్రమై
ఊపిరే ఊయలై నవ్వులే వెన్నెలై
దేహాలే ప్రణయపు పూవుల దారాలై
ప్రాణాలే మమతల మల్లెల హారాలై
బ్రతుకంతా బ్రతికించే భావం ఇది
ప్రతిరోజూ జన్మించే మార్గం ఇది

బాగుందే బాగుందే ఏదో బంధమే
నువ్వంటే నా ప్రతిబింబమే
బాగుందే బాగుందే ఏదో బంధమే
నీకేలే నా సగభాగమే

ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగ నా మనసునే అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోన జరిగే ఇది

బాగుందే...




ఓ సునీత ఓ సునీత పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
తకదిమిత మొదలెడతా తికమకమక పెడతా
ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
అడుగెడతా తెగబడతా లైఫ్ ను చెడగొడతా

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

ముందు ముందు నువ్వు పోతే
వెనక వెనక నేను వస్తా
షాక్ మీద షాక్ ఇస్తా నహి చోడుంగారే
ఏడ ఏడ నువ్వు పోతే ఆడ ఆడ నేను వస్తా
బ్రేక్ మీద బ్రేక్ వేస్తా నహి చోడుంగారే
టెన్షన్ పుట్టిస్తా క్షణ క్షణం ప్రతి క్షణం
టార్చర్ పెట్టేస్తా నహి చోడుంగారే

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

పగ బట్టేస్తా ఇక భయపెట్టేస్తా
ఇలా మెంటల్ గా డిస్టర్బ్ చేస్తా
పని పట్టేస్తా ఇక శని పట్టిస్తా
ఇలా నీ బాటరీ డిశ్చార్జ్ చేస్తా
హే చలికిస్తా గిల గిల వనికిస్తా విల విల

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
ఎగగెడతా పొగబడతా లైఫ్ ను చెడగొడతా
ఇరికించేస్తా ఇలా ఇరుకున పెడతా
యమా ఇరిటేషన్ తెప్పించేస్తా
పరిగెట్టిస్తా ఎదో ప్రాబ్లెమ్ తెస్తా
ఇక సొల్యూషన్ లేదనిపిస్తా
హా పోగొడతా ఫ్రీడమే చూపెడతా నరకమే

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

కారులోన టూర్ కెళితే టైరు లోనగాలి తీస్తా
ఊపిరాడకుండ చేస్త నహి చోడుంగారే
బోర్ కొట్టి ఫిల్మ్ కెళితే స్క్రీన్ పైన నేను వస్తా
స్క్రీన్ మార్చి ఎడిపిస్తా నహి చోడుంగారే
టెన్షన్ పుట్టిస్తా క్షణ క్షణం ప్రతి క్షణం
టార్చర్ పెట్టేస్తా నహి చోడుంగారే

నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే
నహి చోడుంగా నహి చోడుంగా నహి చోడుంగారే

ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
తకదిమిత మొదలెడతా తికమకమక పెడతా
ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
నువ్వొకటి నాకిస్తే నేనిక డబలిస్తా
ఓ సునీత



సే షావా షావా పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, మహాలక్ష్మి అయ్యర్

సే షావా షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే
సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే

సరదాకే సరదా పుట్టే సమయంలో
సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో
హే సరదాకే సరదా పుట్టే సమయంలో
సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో
కిర్రెక్కి కొట్టే కేరింతల్లో

యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో
యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో

సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే
సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే

ఇన్నాళ్లు మనసు కనివిని ఎరుగని చెలిమి దొరికెనీ చోట
హే ఈ తోడు కరువై సగముగ మిగిలిన బ్రతుకు అతుకునీ చోట
నిన్నటి తలుపే మూసి నిన్నుగా కోరేదీ చోట
రేపటి తలుపే తీసి రేపుగా మారేదే చోట
ఇది అంతులేని పూబాట

యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో
యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో

ఆ వైపు చూడు అలసట తెలియక కథలు కదెలెనీ చోట
ఈ వైపు చూడు ఇరుకున నలిగిన పరుగు పరుగులిడు చోట
కొద్దిగ గందరగోళం ముద్దుగా ముదిరేనీ చోట
మందిలో మంత్రజాలం విందుగా జరిగెనీ చోట
ఇది ఆగిపోని పడుచాట

యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో
యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో

సరదాకే సరదా పుట్టే సమయంలో
సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో
హే సరదాకే సరదా పుట్టే సమయంలో
సరికొత్త దారే పట్టే పయనంలో ఈ పరువంలో
కిర్రెక్కి కొట్టే కేరింతల్లో

యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో
యమ జోర్ జోర్ జోర్ జోర్
జోరే పెరిగిందంట అందరిలో

సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే
సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే

సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే
సే షావా  షావా సే భల్లే భల్లే
షావ  షావ భల్లే భల్లే షావా వా భల్లే





మెరుపులా మెరిసే సిరివెన్నలవో పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజేష్ , శ్రేయ గోషల్

మెరుపులా మెరిసే సిరివెన్నలవో
మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి జాము రాతిరివో
కనులను కొరికిన కోరికవో
కునకును తరిమిన కలవో
వలపులు అలికిన వేదికవో
వయసులు అడిగిన వేడుకవో

మెరుపులా మెరిసే సిరివెన్నలవో
మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి రేయి జానకివో

You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన

మెరుపులా మెరిసే సిరివెన్నలవో
మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి జాము రాతిరివో

అందానికే అర్దం నువ్వు
ప్రాయానికే ప్రాణం నువ్వు
రూపానికే ఊపిరి నువ్వు నువ్వే...
హో... ఎదురుపడి పొగడకు నన్నూ
మనసుపడి కలపకు కన్ను
వెనకపడి తడమకు వెన్ను
తిరగపడి తేల్చకు మైకపు మబ్బులలో

మెరుపులా మెరిసే సిరివెన్నలవో
మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి రేయి జానకివో

కుదురుగ నిలవని నడుమును
నడిపిన చేతులు చేసెను పుణ్యం
పొదుపుగ చిలిపిగ పెదవిని చిదిమిన
పెదవుల జన్మిక ధన్యం
ముద్దులలో చక్కెరలాగ నువ్వు
నిద్దురలో చక్కిలిగింత నువ్వు
ఇద్దరిలో ఒక్కరిలాగ నువ్వు
వానగ నేడు పొంగే నువ్వు నింగిలో

మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి రేయి జానకివో
కనులను కొరికిన కోరికవో
కునుకును తరిమిన కలవో
వలపులు అలికిన వేదికవో
వయసులు అడిగిన వేడుకవో

మెరుపులా మెరిసిసే సిరివెన్నెలవో
మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివో
మరి జాబిలి జాము రాతిరివో

You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన
You make my heart go
తనననన తననననననాన




ఎందుకో తొలి తొందరెందుకో పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సోను నిగమ్, మహాలక్ష్మి అయ్యర్

ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
ఎన్నడూ తెలియంది ఎందుకో
నాలో మొదలైంది ఎందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో
సొగసులకు ఈ రోజు బరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన చూపులోన తన రూపులోన
తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన
చిరు తేనెలోన మునిగేందుకా

ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో

చరణం: 1
ఆ ఊరు ఈ ఊరు వేరైనా
ఆకాశం అంతా ఒకటేగా
ఆ నువ్వు ఈ నేను ఏడున్నా
ఆలోచనలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయబారం
ఊసులే చేరవా వేగిరం
ప్రేమలో చిన్నదే ఈ ప్రపంచం
అని తెలిసి కూడ తెగ అలజడాయె
ఆ త లపులోనే తలమునకలాయె
మరి ఎందుకో

చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన బాటలోన తన తోటలోన తన తోడులోన
తన నీడలోన నడిచేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన తనువులోన అణువణువులోన
మధువనములోన ప్రతికణములోన కలిసేందుకా

ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
సొగసులకు ఈ రోజు బరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన చూపులోన తన రూపులోన
తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా




వల్ల వల్ల వల్లా బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: చింతకాయల రవి (2008)
సంగీతం: విశాల్ - శాఖర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె. కె. సునిధి చౌహాన్

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దూసుకొచ్చేయ్ రే
కొలంబస్ చేరుకోని చోటు చూసేయ్ రే

అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దున్ని పారెయ్ రే
త్రివేండ్రస్ గేమ్ కింక గేటు తీసేయ్ రేయ్

ఇన్ని నాళ్ళుగా బాచిలర్
ఇప్పుడిప్పుడే మ్యాచ్యులర్
భామ చర్యతో బ్రహ్మ చర్యమే
హిప్పు హిప్పు హుర్రే
రెచ్చిపోతే పట్టుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

టచ్ ఇస్తే తట్టుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

లాస్ ఏంజెల్  ఏంజెల్తో
ఎంజాయ్ రా యమ జాయ్ రా
డల్లాస్ డార్లింగ్తో ఖల్లాసు రా
వాషింగ్టన్ వణితలతో రిఫ్రెష్ బోడీ వాష్ రా
సిలికాను చిలకలతో బిందాసు రా
రక రకాల మీ కలలు తీర్చనా
పలురకాల ఆ రుచులు పంచనా
కళ్యాణం లోపే కిటుకేదొ నేర్పనా
నేర్చుకుంటే అడ్డు కోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

ఒక్కటిస్తే ఓర్చుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

మియామి బీచ్ ల్లో సన్ బాత్ రా క్యా బాత్ రా
మినిమం బికినీలల్లో ఇక మోతరా...
అట్లాంటిక్ తీరం దాటి వెళ్ళరా ఒక పిల్లరా
ఇట్లాంటి సమయం మళ్ళి రాదురా...
యవ్వనానికి అలుపు లేదురా
ప్రస్తుతానికి మెరుపు నీదిరా
మొగవాడి లోని ఆ వాడి చూపరా
చూపు చూస్తే తేరుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

కం కం కం
కమ్ముకొస్తే కోలుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ

అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దూసుకొచ్చేయ్ రే
కొలంబస్ చేరుకోని చోటు చూసేయ్ రే

అరె ధూమ్ ధూమారే ధూమ్ ధూమారే దున్నిపారెయ్ రే
త్రివేండ్రస్ గేమ్ కింక గేటు తీసేయ్ రేయ్

ఇన్ని నాళ్ళుగా బాచిలర్
ఇప్పుడిప్పుడే మ్యాచ్యులర్
భామ చర్యతో బ్రహ్మ చర్యమే
హిప్పు హిప్పు హుర్రే
రెచ్చిపోతే పట్టుకోవడం
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
వల్ల వల్ల వల్లా బేబీ
నీ వల్ల కాదు బేబీ


ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్

ఏ అప్సైడ్ ఎవ్రిబడి  మూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  గ్రూవింగ్
ఏ అప్సైడ్ ఎవ్రిబడి  డూయింగ్
లైక్ దిస్ లైక్ దిస్


Most Recent

Default