చిత్రం: కూలీ నెం. 1 (1991) సంగీతం: ఇళయరాజా నటీనటులు: వెంకటేష్ , టబు దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: డి.సురేష్ బాబు విడుదల తేది: 12.06.1991
Songs List:
కొత్త కొత్తగా వున్నది పాట సాహిత్యం
చిత్రం: కూలీ నెం. 1 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్ పి బాలు , చిత్ర కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే... పూల ఏరులై... కోటి తారలే, పూల ఏరులై, నేల చేరగానే... కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది నా కన్ను ముద్దాడితే కన్నె కులుకాయె కనకాంబరం నా చెంప సంపెంగలో కెంపు రంగాయె తొలి సంబరం ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యాన వనమాలిగా జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోన... కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే... పూల ఏరులై... కోటి తారలే, పూల ఏరులై, నేల చేరగానే కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది నీ నవ్వు ముద్దాడితే మల్లెపువ్వాయె నా యవ్వనం నాజుకు మందారమే ముళ్ళ రోజాగ మారే క్షణం మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాల లోగిలి మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాల లోగిలి కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా తీగమల్లికి నరాల పందిరి అందించుకోన... కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే... పూల ఏరులై... కోటి తారలే, పూల ఏరులై, నేల చేరగానే కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది
కిలకిలమనె కళావరు రాణి పాట సాహిత్యం
చిత్రం: కూలీ నం - 1 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: చిత్ర , యస్ పి బాలు కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ బరువుగా విరిగెగా కాపు చూపె కద ఏపుగా గోపికా చొరవగా కరువుగా కాపువేసే కద తేపుగా కోరికా వాల్లే పరువాలె తగువేలే గనకా కాలే తమకాలే ఘమకాలై పలుకా కాంక్షలో సృతీ గతీ పెంచీ కాల్చగా చుట్టూ కట్టే కంచే ఈ మైకం ఈడులో అతీ గతీ లేనీ దేనికో దిక్కూ మొక్కో పంచే ఈ మాఘం ఆదమరచిన ఈడులో ఈదలాడనీ ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ ఒడుపుగా ఒలుచుకో ఓపలేను కద ఒంటిలో అవసరం చిలిపిగా దులుపుకో మోయలేవు కద నడుములో కలవరం తాపం తెరతీసీ తరిమేసే తరుణం కాలం తలుపేసీ విరబూసే సమయం వీలుగా గుట్టూ మట్టూ మీటీ లీలగా ఎక్కే పుట్టే వేడీ యాడాడో ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే జట్టే కట్టేయాలి ఏనీడో జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ
అబ్బని ఎంత డబ్బని పాట సాహిత్యం
చిత్రం: కూలీ నం - 1 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు అమ్మని ఫాదలు అబ్బని ఎంత డబ్బని అబ్బని ఎంత డబ్బని పిల్లతో పాటుగా ఒళ్లోకి వచ్చింది ఒక్క దెబ్బని ఫాదలు ఒహో ఫాదలు.. సన్ను - ఓయ్ అమ్మని ఎంత సొమ్మని అమ్మని ఎంత సొమ్మని నక్కతోక తొక్కినట్టు అప్పనంగా దక్కింది అందుకొమ్మని సన్ను ఒరేయ్ సన్ను పాపాయిలా ఈ లూపాయలన్నీ ఎట్టా పెంచాలి ఫాదలు అహా లోపాయికారి వ్యాపారమేదో చూద్దాం పదరా సన్ను... ఫాదలు...ఓయ్ సన్ను ఒరేయ్ సన్ను... చరణం: 1 ఆ భలే ఐడియా ఫాదలు... ఏందది ... ఏందంటే ఎలక్షన్లో పెడదామా అసెంబ్లీ కి ఎసలెడదామా ఫాదలు ఓహో ఫాదలు ప్రజలకి టోపీ వేద్దామా ఎడా పెడా దోచేద్దామా ఫాదలు.. అసెంబ్లీలో మినిస్టిరీ లో మూణ్ణాల్లేరా సన్ను అంతేనా పవర్ పోయాక పాలేరైనా పలకరించడురా నిన్ను పాలిటిక్స్ లో ఏముందిరా బంక మన్ను అమ్మో అయితే వద్దు ఫాదలు... ఇంకో బిజినెస్ చూడు ఫాదలు... లోపాయికారి వ్యాపారమేదో చూద్దాం పదరా సన్ నాకు వచ్చిందిరా ఏంటి ఫాదలు...ఐడియా ఫిలిం ఫీల్డ్లో పెడదామా ప్రొడ్యూసర్లం అవుదామా సన్ను ఒరేయ్ సన్ను లో బడ్జెట్ లో తీద్దామా సబ్సిడీలు కొట్ట్టేద్దామా సన్ను ఒరేయ్ సన్ను లో బడ్జెట్ లో ఆల్ట్ బొమ్మలు ఎవలు చూడలు ఫాదలు డబ్బా పోనీ భాలీ సినిమా తీస్తే ఫ్లాప్ అయితేనో ఫాదలు వకీలులై పడిపోమా నడీధిలో... అయితే ఇంకో బిజినెస్ చూడరా లోపాయికారి వ్యాపారమేదో చూద్దాం ఫాదలు చరణం: 2 మక్కా జూదం మించిన చిట్కా ఉంటుందా ఫాదలు మక్కెలు విరిగి బొక్కలో పడే రిస్క్ ఉంటుందిరా సన్ను పేకాట క్లబ్బును పెడితే అంతా పైకమే కద సన్ను వచ్చినోళ్ళతో మనమే ఆడి నష్ఠపోతాము ఫాదలు సాలా కొట్టో బాలో అయితే బాలో బాట్టో కాదురా...బాలు ఛి ఛి ఛి బారు. అదేలే ఫాదలు బాలు....బాలెట్టడం భలే ఐడియా ఫాదలు పీపాల సరుకు మనకే సాలదు అమ్మకమెట్టా సన్ను లక్కు తిన్నగా లేదంటే బొక్క బోర్ల పడిపోతాము పళ్ళు ఊడగొట్టుకుంటాము... అంతేనా ఫాదలు అంతేరా సన్ను ఫాదలు...
ఆటెన్షన్ ఎవ్రిబడి పాట సాహిత్యం
చిత్రం: కూలీ నం - 1 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్ కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజుహ హ నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు హోలీడేకి జోలిగా హాలీవుడ్డేళ్లానంటే హాల్లో బాసు హౌ డు యు డు అంటూ డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తింటూ ఉంటారు సారి రా డైరీ కాళిలేదంటే వింటారా హ హ హ ఐ యామ్ ఏ బాటసారి మేఘాల రహదారి ఉండుండి నేల జారి హాల్టేస్తా ఒక్కసారి ఫోలెండ్లో పొద్దున్నుండి హాలెండులోన ఆఫ్టర్ నూన్ సిడ్నీ లో సాయంకాలం వాషింగ్టన్లో నైటుంటాను ఎపుడు నివాసం ఏరో ప్లైన్ ఎక్కడా స్టడిగా కూర్చోలేను సూరీడల్లే భూగోళాన్ని చుట్టేస్తూనే ఉంటా ఎవ్రిడే ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు హ హ నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్ కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు హ హ హహ ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు నేనేడుంటే ఆడే చుట్టూ ఆడోళ్లంతా అల్లేస్తారు హాల్లో డార్లింగ్ అంటూ నాతో డేటింగ్ ఔటింగ్ మీటింగ్ మేటింగ్ ఏదైనా ఓకే అంటారు పెళ్ళాడందే పోదీమేళం ఇల్లా అయితే పోదా శీలం ఐ యామ్ ఎ బ్రహ్మచారి పట్టాను పెళ్లిదారి కావాలి తగనారి నువ్వేనా ఆ చిన్నారి నచ్చాలి కన్ను ముక్కు నిక్కు టెక్కు ఉన్న బాడీ నచ్చాలి నాలో ఉన్న వాడి వేడి కన్నెలేడి మగువా మగాడ అనిపించాలి పొగరు వగైరా కనిపించాలి ఓకే అయితే చేపడతాను చూపెడతాను జతలో హనీమూను ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్ కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ నేనే మహారాజు నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు
కలయా నిజమా పాట సాహిత్యం
చిత్రం: కూలీ నెం. 1 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరి వెన్నెల గానం: ఇళయరాజా, పి. సుశీల కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా చరణం: 1 లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ ఆహా... ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నదీ కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి ముంచే మైకమో మురిపించే మొహమో కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా చరణం: 2 చేయి వేయనా సేవ చెయ్యనా ఓయ్ అనే వయ్యారమా హా హా హా పాలముంచిన నీటముంచిన నీ దయే శృంగారమా ఆహా... ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నవి కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది ఆఁ అంతా మాయగా అనిపించే కాలము కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా పాట సాహిత్యం
చిత్రం: కూలీ నెం. 1 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరి వెన్నెల గానం: యస్ పి బాలు, బృందం జై జై జై జై గణేష జై జై జై... జై జై జై జై వినాయక జై జై జై... దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ...ఓ...ఓ... దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చరణం: 1 చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం అంబారిగ ఉండగల ఇంతటి వరం అయ్యోర అయ్యా అంబాసుతా ఎందరికి లభించురా అయ్యోర అయ్యా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చరణం: 2 శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం అరె శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం త్రిమూర్తులే నిను గని తలొంచరా అయ్యోర అయ్యా నిరంతరం మహిమను కీర్తించరా అయ్యోర అయ్యా నువ్వెంతనే అహం నువ్వే దండించరా దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా - దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా - చూపించయ్యా త్రోవ అరెరెరెరెరే... పిండి వంటలారగించీ -:తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి - తోడు నీడ అందించయ్యా... ఓ...ఓ... ఓ... హే దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ హే దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ( జై జై జై జైజై జైజై జై జై జై జై వినాయక జై విజ్నేస్వర జై జై జై జైజై)