Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Daana Veera Soora Karna (1977)






చిత్రం: దాన వీర శూర కర్ణ (1977)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్.టి.రామారావు, బాలకృష్ణ, హరికృష్ణ, శారద, బి.సరోజాదేవి, కాంచన, ప్రభ
దర్శకత్వం & నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 14.01.1977



Songs List:



ఏ తల్లి నిను కన్నదో పాట సాహిత్యం

 
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

పల్లవి: 
ఏ తల్లి నినుగన్నదో నేను నీ తల్లి నైనానురా
నా వరాల తొలిపంటగా నీవు నా ఇంట వెలిశావురా

చరణం: 
లలిత లలిత జలలహరుల ఊయల లూగినావు అలనాడే
తరుణ తరుణ రవి కిరణ పథమ్ముల సాగినావు తొలినాడే
అజస్ర సహస్ర నిజప్రభలతో అజేయుడవు కావలెరా
నీ శౌర్యముగని వీర కర్ణుడని
నిఖిల జగమ్ములు వినుతించవలెరా

చరణం: 
మచ్చ యెరుంగని శీలసంపదకు స్వచ్ఛమైన ప్రతిరూపమై
బలి, శిబి, దధీచి వదాన్యవరులను తలదన్ను మహా దాతవై
అడిగిన దానిని లేదన్నది ఏనాడు నీ నోట రానిదై
నీ నామము విని దాన కర్ణుడని
యుగయుగాలు నిను స్మరియించవలెరా




జయీభవ.. విజయీభవ.. పాట సాహిత్యం

 
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, జి.ఆనంద్ & కోరస్ 

పల్లవి: 
జయీభవ.. విజయీభవ.. 
జయీభవ.. విజయీభవ 
చంద్రవంశ పాదోది చంద్రమా కురుకుల సరసీ రాజహంసమా 

జయీభవ.. విజయీభవ.. 

చరణం: 1
ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా 
మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా..ఆ.. 
ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా 
మాన్య ధృతరాష్ట్ర తిమిరనయన తేజఃఫలా.. 
దిగ్గజ కుంభవిదారణచణ శతసోదరగణ పరివేష్టితా 
చతుర్ధశ భువన చమూనిర్ధళణ చటుల భుజార్గళ శోభితా 

జయీభవ.. విజయీభవ.. 

చరణం: 2
కవిగాయక నట వైతాళిక సంస్తూయమాన విభవాభరణా 
నిఖిల రాజన్యమకుటమణి ఘ్రుణీ నీరాజిత మంగళచరణా 
మేరు శిఖరి శిఖరాయమాన గంభీర..భీగుణ మానధనా 
క్షీరపయోధి తరంగ విమల విస్పార యశోధన సుయోధనా 
జగనొబ్బ గండ జయహో.. గండరగండ జయహో.. 
అహిరాజకేతనా జయహో.. ఆశ్రిత పోషణ జయహో.. 
జయహో.. జయహో.. జయహో..



చిత్రం ఆయ్ భళారే విచిత్రం పాట సాహిత్యం

 
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చిత్రం ఆయ్ భళారే విచిత్రం
చిత్రం అయ్యారే విచిత్రం
ఈ రాచనగరుకు రారాజును రప్పించుట విచిత్రం
పిలువకనే ప్రియ విభునే విచ్చేయుటే విచిత్రం 

రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో 
సదమదము మామదిలో మదనుడు సందడి సేయుట
చిత్రం ఆయ్ భళారే విచిత్రం

ఎంతటి మహరాజైన ఆ ఆ ఆ
ఎంతటి మహరాజైన ఎపుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని
చిత్రం ఆయ్ భళారే విచిత్రం

బింబాధర మధురిమలు
బిగి కౌగిలి ఘుమఘుమఘుమలు
ఆ ఆ ఆ ఆ బింబాధర
ఇన్నాళ్ళుగ మాయురే మేమెరుగక పోవుటే
చిత్రం ఆయ్ భళారే విచిత్రం

ఆఆఆ వలపెరుగని వాడననీ
వలపెరుగని వాడనని పలికిన ఈ రసికమణీ
తొలిసారే ఇన్ని కళలు కురిపించుట
అవ్వ నమ్మలేని చిత్రం అయ్యారే విచిత్రం
ఆయ్ భళారే విచిత్రం అయ్యారే విచిత్రం




తెలిసెనులే ప్రియ రసికా పాట సాహిత్యం

 
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.జానకి 

పల్లవి: 
తెలిసెనులే ప్రియ రసికా 
నీ నులి వేడి కౌగిలి అలరింతలు 
నీ నును వాడి చూపుల చమరింతలు 
తెలిసెనులే ప్రియ రసికా...
తెలిసెనులే ప్రియ రసికా

చరణం: 1
ముసుగెంతుకే.. చంద్రముఖి అన్నావు 
జాగెందుకే.. ప్రాణసఖీ అన్నావు 
చెంపలు వలదన్నా .... అధరం..  ఆ... అన్నా 
చెంపలు వలదన్నా .... అధరం..  ఆ... అన్నా 
చెంగుమాటున చేరి ... 
చెంగుమాటున చేరి... చిలిపిగ నవ్వేవు 
తెలిసెనులే ప్రియ రసికా...
తెలిసెనులే ప్రియ రసికా

చరణం: 2
తెలిసెనులే ప్రియ రసికా 
నీ నులి వేడి కౌగిలి అలరింతలు 
నీ నును వాడి చూపుల చమరింతలు 
తెలిసెనులే ప్రియ రసికా...
వెన్నముద్దల రుచి ఎగిరి రేపల్లెలో పెరిగితివంట 
కన్నెముద్దుల రుచి మరిగి బృందావనిలో తిరిగితివంట 
చేరని గోపిక లేదంటా ... దూరని లోగిలి లేదంటా 
చెలువుల పైనే కాదమ్మా.. వలవల పైన మోజంటా 
ఆ ఈ పరమాతుని లీలా రూపం ఎరిగినవారు ఎవరంటా 

తెలిసెనులే ప్రియ రసికా 
నీ నులి వేడి కౌగిలి అలరింతలు 
నీ నును వాడి చూపుల చమరింతలు 
తెలిసెనులే ప్రియ రసికా...



రారా ఇటు రారా పాట సాహిత్యం

 
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. జానకి 

సాకి: 
ఓ కురుసార్వభౌమా 

పల్లవి: 
రారా ఇటు రారా రసిక రాజ్మాళీ
కొసరి తేలించరా కుసుమ శరకేళి

చరణం: 
ఆ చుక్కలదొర సోయగమ్మునే ధిక్కరించు జిగికాడా
చక్కెరవింటి జోడునే వెక్కిరించు ఎగకాడా
హైసరే నీ మైసిరి, మాయురే నీ మగసిరి
మొలక మీసమున లలితహాసమును మలచుకున్న రారేడా

చరణం: 
నిద్ధపు టద్దపు ముద్దుల చెక్కిట నిలుపరా నెలవంకలు
కెంపుల సొంపులు గిఱుకుమోవి ముద్రింపరా మధురేఖలు
ఎల నిగారపున్నడలతో కళలొలకరించు పొన్నాడలితో
విను వరించి కలవరించి వేచిన ప్రణయపల్లరినిరా




అన్నా దేవుడు లేడన్నా పాట సాహిత్యం

 
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.జానకి 

సాకి:
అన్నా దేవుడు లేడన్నా, దేవుడు లేనేలేడన్నా

పల్లవి: 
నీకన్నా వాకిక దేవుడు లేనే లేడన్నా

చరణం: 
నిండు సభలో పాంచాలి వస్త్రాపహరణం
నీతికి భరత జాతికి మానహరణం
ఇక కురు వంశానికి తప్పదు సర్వవినాశం
ఇది కులసతి రగిలే కన్నీరిచ్చిన శాపం
అన్నా నీ కన్నా నాకిక దేవుడు లేనేలేడన్నా

చరణం: 
దుర్మదాంధుల గుప్పిటిలో కర్మభూమి కనుమూసిందా?
ధర్మానికి తాకట్టువడీ శౌర్యం తల వాల్చిందా?
నా అన్నవనీ చేతులుసాచీ అడుగుతున్నా నన్నా
చీరనిచ్చి నీ చెల్లెలి మానం కాపాడుమన్నా
అన్నా నీ చెల్లెలి మానం కాపాడుమన్నా




ఇదిరా దొరా మధిర పాట సాహిత్యం

 
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.జానకి 

ఇదిరా దొరా మదిర
అధర మానితే నెమ్మదిరా రా రా

చరణం: 
సురాధిపతినే విరాళించురా ఈ సుర ఇది
మరునికైన లేమరులు గొలుపు రసమురా
విరాగులకె న సరాగమొలికే పరమానందసారమురా
తమితీరని ఈ వారుణి నీ వానరా మా ఆనరా-రారా 

చరణం: 
ఊను ఊను చెలి చెక్కిలి" అది చెక్కిన చిక్కని జాబిలి
మీటి చూడు నును తనువు సారించిన మదన ధనువు
పొందు పొందు మా పొందు మధుర స్మృతిగా రూపొందు
కవ్వింతలో కౌగిలింతలో కరగిపోరా - రా రా 

చరణం: 
పచ్చకప్పురపు విడియము రేపే వెచ్చని కోర్కెలు దొంతరలో
విచ్చిన మల్లెల పానుపుపైన రెచ్చిన తొలిగిలిగింతలలో
జాలు జాలుగా సోకే చేలాంచలాల యెలగాలులలో
కమ్మగా కమకమ్మగా నిదురకమ్మగా కలవరించరా - రారా



ఏల సంతాపమ్ము పాట సాహిత్యం

 
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  వి.రామకృష్ణ 

ఏల సంతాపమ్ము మరి నీ
కేల సందేహమ్ము పార్థా!
మృతుల కై, జీవితుల కై పం
డితులు దుఃఖితులౌదురా!

కర్మములయందె నీకు
కలదధికారమ్ము-లేదు
కర్మఫలమునందు కాన
కర్మములు విడువరాదు

పుట్టినందుకు చావుతప్పదు
గిట్టినప్పుడు పుటక తప్పదు
పరిహరింపగలేని దానికి
పరితపింపకుమో పరంతప

ఆత్మనిత్యము ఆత్మసత్యము
అది అచింత్యము అది అగమ్యము
చీల్చలేనిది కాల్చలేనిది
చిరంతనమది సర్వగతమది

చంపెడివాడవు నీవా
చంపబడెడివారు వారా?
చేసెడివాడను నేనే
చేయించెడివాడను నేనే

ఎన్నడు ధర్మము తరుగునో
ఎపుడు అధర్మము పెరుగునో
అప్పుడు సృష్టించుకొందు
అర్జునా, నను నేనే

దుష్టుల శిక్షించుటకై
శిష్టుల రక్షించుటకై
సద్ధర్మ స్థాపనకై
సంభవింతు యుగయుగమున

అన్ని ధర్మములు త్యజించి
నన్నే శరణము పొందుము
సర్వపాప విమోచనము
జరిపి మోక్షమొసంగెద




కలగంటినో స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: దాన వీర శూర కర్ణ (1977) 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దాశరధి 
గానం:  మాదవపెద్ది రమేష్, పి.సుశీల 

కలగంటినో స్వామిః కలగంటిని
ఝల్లనీ నామదీ కలతవారంగా
కలగంటినో స్వామి | కలగంటిని

కలతపడు నీ మోము కాంచలేనే సఖీ
కలలు కల్లలు కావటే నా చెలీ 
కలలు కల్లలు కావటే

వెన్నెలలు వెదజల్లు చల్ల నీరేయిలో
నీ చెంత మైమరచి నిదురించు వేలలో
రాకాసిమబ్బేసి చీక టైనట్లుగా
పెనుగాలి నిన్నెత్తుకొని పోయినట్లుగా ॥కలగంటి॥

వీరాధి వీరుడౌ విజయునీ కొమరుడను
దేవాధి దేవుడౌ కృష్ణునీ అల్లుడను
యెంతవారలైన యెదిరించగలనే
పెనుగాలి నన్నేమి చేయగలదే చెలీ ఆకలలు కల్లలు

ఉత్తర :
నా ఊహలో నీవు ఉయ్యాల లూగగా
ముద్దుగా అందాలు దిద్దుకొను చుండగా
నా నుదుటి తిలకమ్ము రాలిపడినట్టు గా
భళ్ళుమని గాజులు బద్ధలై నట్టుగా

అభిమన్యు :
యే ఆపదలుగాని యేనాడుగానీ
నీ నాధునంటవే ఓ నీలవేణీ !
నే చిరంజీవినై నిలచివుంటినే
కలమాట మరువవే కిలకిలా నవ్వవే

Most Recent

Default