చిత్రం: దిల్ (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్. పి. పట్నాయక్
నటీనటులు: నితిన్, నేహా
దర్శకత్వం: వి. వి. వినాయక్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 04.04.2003
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
ఎందుకో ఏమిటో నిదురింక రాదేమిటో
కనుపాపాలో కల కాదుగా ఈ మాయా...
ఎపుడు లేనిది నాలో అలజడి
ఎవరు చెప్పలేదే ప్రేమని
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
ప్రేమనే మాటకి అర్ధమే నాకు రాదే
ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే
నీ జతే చేరగా నా కధే మారిపోయే
లోకమే బొత్తిగా గుర్తుకే రాదులే
చినుకై చేరిన వరదై పోయెనే
ఎవరూ అపలేరే ప్రేమని
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
గాలిలో వేలితో ఆశలే రాసుకోన
నీవనే ప్రేమని శ్వాసగా పీల్చనా
నీటిలో నీడలో నిన్నిలా చూసుకోన
ఊహలో తేలుతూ ఊసులే ఆడనా
లోకం ఎంతగా మారిందే ఇలా
పగలే జాలువారే వెన్నెలా
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
********* ********* ********
చిత్రం: దిల్ (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె. కె
CM PM అవ్వాలన్నా అశే లేదు
UK US వెళ్లాలన్నా షోకే లేదు
హోటల్లోన ఉండాలన్నా రూలేంలేదు
కోటల్లోనే మునగాలన్న కోరికలేదు
హ్యాపీగా లైఫంతా గడపడానికి
కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు
కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్లుంటే చాలు
CM PM అవ్వాలన్నా అశే లేదు
UK US వెళ్లాలన్నా షోకే లేదు
డైలీ నేను తిరగడానికి ఛార్టర్డ్ ఫ్లైటే వద్దు
సింపుల్ బైకొకంటే చాలు
బీటే నేను వెయ్యడానికి మిస్ యూనివర్సే వద్దు
లోకల్ బ్యూటీ అయితే చాలు
అలసట వస్తే తాగడానికి అమృతమేమి వద్దు
చల్లని బీరొకటుంటే చాలు
ఆపదలో కాపాడటానికి పైవాడేమి వద్దు
నలుగురు ఫ్రెండ్సే ఉంటే చాలు
హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి
కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు
కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్ ఉంటే చాలు
CM PM అవ్వాలన్నా అశే లేదు
UK US వెళ్లాలన్నా షోకే లేదు
కావాల్సింది చూడటానికి కంప్యూటర్ తెరవద్దు
కమ్మని కలలే కంటే చాలు
బ్రతకాల్సింది బ్రతకడానికి ఏడు జన్మలే వద్దు
ఉన్న ఒక్క జన్మమే చాలు
పుణ్యం కాస్తా దక్కడానికి పూజలు గీజలు వద్దు
పరులకు సాయం చేస్తే చాలు
చెయ్యాల్సింది చెయ్యటానికి పంచాంగాం విప్పొద్దు
పంజా విప్పావంటే చాలు
హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి
కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు
కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్లు ఉంటే చాలు
అశే లేదు ... షోకే లేదు
రూలేం లేదు...కోరిక లేదు