చిత్రం: దృశ్యం (2014)
సంగీతం: శరత్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ ఏసుదాస్
నటీనటులు: వెంకటేష్ , మీనా
దర్శకత్వం: శ్రీప్రియ
నిర్మాతలు: డి.సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి
విడుదల తేది: 11.07.2014
నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
గడిచే సమయం నడిపింది వింతజాలం
నీకైనా... నాకైనా...
గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...
నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
నీకైనా... నాకైనా...
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...
గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది ఈ కాలమే
గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది ఈ కాలమే
తనకే లేదు ప్రేమా జాలీ కరునా మనకే పోదు మనపై మమతా తపనా
కాలసంద్రానికే ఎదురీతే కాదా బ్రతుకంటే...
నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
గడిచే సమయం నడిపింది వింతజాలం
కధ మలుపు తిప్పించేది ఈ కాలమే
కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే
కధ మలుపు తిప్పించేది ఈ కాలమే
కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే
తానే కరిగీ నిన్నే కదిపీ కుదిపీ
తానే తరిగీ నిన్నే తరిమీ తరిమీ
ఒక్క క్షణకాలమే వెంటాడేనంటా కలకాలం
నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
గడిచే సమయం నడిపింది వింతజాలం
నీకైనా... నాకైనా...
గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...
నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
నీకైనా... నాకైనా...
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...
********* ******** ********
చిత్రం: దృశ్యం (2014)
సంగీతం: శరత్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నజీమ్ అర్షద్
ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
మదిలోన ఆనందాలా మెరుపులు మొదలైతె
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె
ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
ఇంటిపేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమె
కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే
అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే
తుల్లి తుల్లి పొంగేనంట ఆటా పాటా
అల్లి బిల్లి ఆకాశంలో అమ్మా నాన్నా అక్కా చెల్లి
మల్లెపూల మొబ్బులైతే
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె
ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే
సుడిగాలికి చెడుజ్వాలకి తెగిపోదు ఈదారమే
గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిధ్యమే
గుమ్మం లోనే వాలేనంట దేవాలయం
చిన్ని చిన్ని కోపాలన్ని చిర్రు బుర్రు తాపాలన్నీ వచ్చీ పోయే ఉరుమైతే...