చిత్రం: ఈగ (2012) సంగీతం: యమ్.యమ్.కీరవాణి నటీనటులు: నాని, సమంత, సుదీప్ దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి నిర్మాత: సాయి కొర్రపాటి విడుదల తేది: 06.07.2012
Songs List:
నేనే నాని నే పాట సాహిత్యం
చిత్రం: ఈగ (2012) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి గానం: దీపు, జి.సాహితి నేనే నాని నే, నే నీ నాని నే పోనే పోనీనే నీడై ఉన్నానే అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి కలలకు రెక్కలు తొడిగించి అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ మాటల్లొ ముత్యాలే దాచేసినా చిరునవ్వు కాస్తైనా ఉలికించవా కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ నా భాషలో రెండే వర్ణాలనీ నాకింక నీ పేరే జపమవుననీ బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే అరె అరె అరె అరె ఓ అరె అరె అరె అరె ఓ
ఈగ ఈగ ఈగ పాట సాహిత్యం
చిత్రం: ఈగ (2012) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చిత్ర, దీపు, శ్రావణ భార్గవి దేఖ్‌లోరే సాలా ఏ రాత్ ఛా గయీ తేరే ద్వార్ పే తేరీ మాత్ ఆగయీ గయీగయీగయీగయీగయీగయీగ మై నేమ్ ఇజ్ నాని నేనీగనెతై కానీ నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిసైల్‌ని నీ రేంజ్ పెద్దదవనీ నా సైజ్ చిన్నదవనీ నీ కింగ్‌డమ్‌నే కూల్చకుంటే కానురా మగాణ్ని ఈగ ఈగ ఈగ యుముడి మెరుపుతీగ ఈజీ ఈజీ ఈజీగా తేరీ జాన్ లేగా చరణం: 1 అణువంతే ఉన్నా అగ్గిరవ్వలోన అడవినైన కాల్చే కసి నిప్పు దాగి లేదా చిటికంతే ఐనా చినుకు బొట్టులోన పుడమినైన ముంచే పెనుముప్పు పొంచి లేదా Isn't the universe an atom before the big bang ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా అని యమా కేర్ ఫ్రీగా నువ్వు ఆవులించేలోగా నీ శ్వాసలోన దూరిపోనా బయో వైరస్‌లాగ యమ అర్జెంటుగా పూర్తిచేయవలసిన పనులున్నాయ్ పదే పది పదే పది వన్ నిన్ను చంపడం టూ నిన్ను చంపడం త్రీ నిన్ను చంపడం ఫోర్ నిన్ను చంపడం ఫైవ్ నిన్ను చంపడం సిక్స్ నిన్ను చంపడం సెవెన్ నిన్ను చంపడం ఎయిట్ నిన్ను చంపడం నైన్ నిన్ను చంపడం టెన్ నిన్ను ముసిరి ముసిరి ముసిరి ముసిరి తరిమి తరిమి తరిమి తరిమి పొడిచి పొడిచి పొడిచి చంపడం చరణం: 2 రెప రెప రెప రెక్కలను విదిలిస్తాగా నీ చెవుల్లోన మరణరాగా వినిపిస్తాగా సూసైడ్ బాంబర్నై నీ పైకి దూసుకొస్తా బై హుక్ ఆర్ క్రుక్ నిన్ను చంపి మరోసారి చస్తా ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్కా ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా అని ఆలోచించేలోగా నీ ఆయువున్న జాగా తగలబెట్టి ఎగిరిపోనా తారాజువ్వులాగా
కొంచెము అర్థమైనా పాట సాహిత్యం
చిత్రం: ఈగ (2012) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: విజయ్ ప్రకాశ్ కొంచెము అర్థమైనా కొంచెము కొంచెము కాకపోయినా కొంచెము బెట్టు చూపినా కొంచె ము కొంచెము గుట్టువిప్పినా కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా... ఓ... నీ గుండెలోతున భూతద్దం వేయనా ఏదో మూలనా నన్నే చూడనా నీ గుండెలోతున భూతద్దం వేయనా ఏదో మూలనా నన్నే చూడనా చరణం: 1 కొంచెము చూడవచ్చుగా కొంతైనా మాటాడవచ్చుగా పోనీ అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా నీకై మెల్లమెల్లగా పిచ్చోడినౌతున్నా జాలి పడవుగా... ఓ... పిసినారి నారివే పిసరంత పలకవే ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా నొ నొ నో వాట్ సో... (2) చరణం: 2 కాకితో కబురు పంపినా కాదనకుండా వచ్చి వాలనా రెక్కలు లేకపోయినా చుక్కలకే నిను తీసుకెళ్లనా జన్మలు ఎన్ని మారినా ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా... వాట్ డిడ్ యూ సే? నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా...
లావా లావా లావా పాట సాహిత్యం
చిత్రం: ఈగ (2012) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: యమ్.యమ్.కీరవాణి, అనుజ్ గురువా, శివాని లావా లావా లావా