చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017) సంగీతం: చిత్తరంజన్ భట్ నటీనటులు: బాలకృష్ణ, శ్రేయ చరణ్ దర్శకత్వం: జాగర్లమూడి క్రిష్ నిర్మాత: వై. రాజీవ్ రెడ్డి విడుదల తేది: 12.01.2017
Songs List:
ఎకిమీడా... పాట సాహిత్యం
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017) సంగీతం: చిత్తరంజన్ భట్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్ ఎకిమీడా... ఎకిమీడా నా జత విడనని వరమిడవా తగుదోడా నా కడ కొంగున ముడిపడవా సుకుమారి నీ సొగసు సిరులు నను నిలువెల్లా పెనవేసుకుని మహారాజునని మరిపించే నీ మహత్తులోపడి బందీనయ్యానే ఎటౌతానే హుందర హుందర హుందర హురదర (3) హుందర హుందర హోయ్ హుందర హుందర హుందర హురదర (3) హుందర హుందర హోయ్ కడవై ఉంటా నడువంపుల్లో కులికే నడకా నను కాసుకో గుట్టుగా కోకా రైకా నువ్వనుకుంటా చెక్కెర తునకా చలికాసుకో వెచ్చగా చెమట చలవ చిరు చినుకు చొరవ ఈ తళ తళ తళ తళ తరుణి తనువుకిది ఎండో వానో హో ఎండో వానో ఎవరికెరుక ఏ వేళా పాలా ఎరుగమని ప్రతిరోజూన నీతో పాటే నడుస్తు గడిస్తే ఎన్నాళ్ళైతేనే ఎటైతేనే హుందర హుందర హుందర హురదర (3) హుందర హుందర హోయ్ హుందర హుందర హుందర హురదర (3) హుందర హుందర హోయ్ ఎకిమీడే నీ జత విడనని వరమిడనే - వరమిడవా సరిజోడై నీ కడ కొంగున ముడిపడనే వీరి వీరి గుమ్మడంటు వీధి వాడా చుట్టుకుంటు ఇంతలేసి కళ్ళతోటి వింతలెన్నో గిల్లుకుంటు ఒళ్లోన మువ్వాల ఇయ్యాల సయ్యాటలో సుర్రో గోటె కారు వంతెనుండే ఆడ ఈడు భగ్గుమంటే మన్ను మిన్ను చూడనట్టు మేడబారు ఉంటావుంటే మత్తెక్కి తూగాల మున్నూర్ల ముపొద్దులు సుర్రో ఎకిమీడా...
హే గణ గణ గణ గణ పాట సాహిత్యం
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017) సంగీతం: చిత్తరంజన్ భట్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సింహా, ఆనంద భాస్కర్, వంశి హే గణ గణ గణ గణ గుండెలలో జేగంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయేలా హే గణ గణ గణ గణ కన్నులలో కార్చిచ్చులు రేగెను చీక్కటి చీకటినెర్రగ రగిలించేలా ఒర దాటున నీకత్తి పగవాడి పాలు విప్పి సహనమ్మిక సరిపెట్టి గర్జించర ఎలుగెత్తి ఎవ్వడురా ఎదటకి రారా అని అనగానే అవురవురా నువు ఆపదకే ఆపదవవుదువురా వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా నీ జబ్బ చరిస్తే ఆ దెబ్బకి దెయ్యం జడిసి తడి బొబ్బొకటేస్తే దివి ఆకాశం అవిసి జేజేలే జేకొడతారంతే సింగం నువ్వై జూలిదిలిస్తే ఎంతమందైనా జింకల మందే మీసం దువ్వే రోషం చుస్తే యముడికి ఎదురుగ నిలబడినట్టే ఉసురుండదు ఉరకలు పెట్టందే పిడుగల్లే నీ అడుగే పడితే పిడికెడు పిండే కొండ నీపై దాడికి దిగితే మెడతల దండే దుండగులంతా పరవాడిని పొలిమేరలు దాటేలా తరమకుండా అలుపంటూ ఆగదు కదరా జరిగే యుద్దకాంఢ భారత జాతి భవితకు సాక్ష్యం ఇదుగోర మన జండా వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా తారార రారరా తారారా రారా రారా రా (3) వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా వీడంటే మన నీడే కదరా లెగురా లెగురా ముందుకు పదరా వేటంటే మనకాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా
మృగ నయనా భయమేలనే పాట సాహిత్యం
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017) సంగీతం: చిత్తరంజన్ భట్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, శ్రేయ ఘోషల్ ధిరధిర ధీం ధీం ధీం తననన ధిరధిర ధీం ధీం ధీం తననన దేన దేన దేన దేన దిందిరినా దిరనా ధిరధిర ధీం ధీం ధీం తననన ధిరధిర ధీం ధీం ధీం తననన దేన దేన దేన దేన దిందిరినా దిరనా అధరమదోల అదిరినదేలా అధరమదోల అదిరినదేలా కనుకొలకుల ఆ తడితళుకేల మృగ నయనా భయమేలనే మృగ నయనా భయమేలనే తెగ బిడియాల తెర కరిగేలా తెగ బిడియాల తెర కరిగేలా తొలి రసలీలా తొణికిన వేళా తెలిపెద నా ప్రియ కామన తెలిపెద నా ప్రియ కామన ధిరధిర ధీం ధీం ధీం తననన ధిరధిర ధీం ధీం ధీం తననన దేన దేన దేన దేన దిందిరినా దిరనా ధిరధిర ధీం ధీం ధీం తననన ధిరధిర ధీం ధీం ధీం తననన దేన దేన దేన దేన దిందిరినా దిరనా కాముని గెలిచే పతనము చేయగా సైన్యములేలా మన జత చాలుగా నీ సోయగాల సామ్రాజ్యం నా సొంతమైన ఏకాంతం ధివినే ఇలపై నిలిపింది చూడు లలనా మృగ నయనా భయమేలనే (4) నా నరనరమున ఈ వెచ్చదనం నా పౌరుషమా నీ పరిమళమా నీ శిరసులోని సంకల్పం నీ శ్వాసలోన ప్రతి స్వప్నం నేనే అవనా నీ అడుగు అడుగులోన తెలిపెద నా ప్రియ కామన తెలిపెద నా ప్రియ కామన అధరమదోల అదిరినదేలా అధరమదోల అదిరినదేలా కనుకొలకుల ఆ తడితళుకేల మృగ నయనా భయమేలనే (4)
సాహో సార్వభౌమా పాట సాహిత్యం
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017) సంగీతం: చిత్తరంజన్ భట్ సాహిత్యం: సిరివెన్నెల గానం: విజయ ప్రకాష్, కీర్తి సాగతీయ సాహో సాహో సార్వభౌమా (4) కాలవాహిని శాలివాహన శకముగా ఘనకీర్తి పొందిన సుప్రభాత సుజాతవహిని గౌతమీసుత శాతకర్ణి భాహుపరా భాహుపరా (2) కక్షల కాల రాతిరిలోన కాంతిగ రాజసూయాత్పరములే జరిపెరా కత్తులలోన చిత్రంబైన శాంతికి తానే వేదస్వరముగా పలికెరా సాహో సార్వభౌమా భాహుపరా నీ కన్న పుణ్యంకన్న ఏదీమిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడివన్న మన్నన పొందరా నీ కన్న పుణ్యంకన్న ఏదీమిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడివన్న మన్నన పొందరా స్వర్గాన్నే సాధించే విజేత నువే సాహో సార్వభౌమా సాహో స్వప్నాన్నే సృష్టించే విధాత నువే సాహో సార్వభౌమా అమృత మందన సమయమందున ప్రజ్వలించిన ప్రళయ భీఖరా గరళమును గళమందు నిలిపిన హారుడురా శుభకరుడురా భాహుపరా భాహుపరా పరపాలకుల పగపంకముతో కలుషమ్మైన ఇల నిన్ను పిలిచెరా పలకరా... దావాణలము ఊరే దాడి చేసినా దుండగీడుల తులువరా దొరా... సాహో సార్వభౌమా భాహుపరా దారుణమైన ధర్మప్రాణి ధారుణి పైన కాలూనింది తక్షనమొచ్చి రక్షణనిచ్చు భిక్షగ అవతరించర దేవరా దారుణమైన ధర్మప్రాణి ధారుణి పైన కాలూనింది తక్షనమొచ్చి రక్షణనిచ్చు భిక్షగ అవతరించర దేవరా దేవరా...
హే సింగముపై లంగించెను పాట సాహిత్యం
చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017) సంగీతం: చిత్తరంజన్ భట్ సాహిత్యం: సాయి మాధవ్ గానం: విజయ ప్రకాష్ హే సింగముపై లంగించెను బాలుడు పేరు శాతకర్ణి ధూమి కళ్లెముగ సవారి చేసెను పేరు శాతకర్ణి ముసి ముసి నగవుల పసివాడా సింగము ననచిన మొనగాడా సింగము ననచిన మొనగాడా శాతవాహనుల పరంపర పేరును నిలిపిన వారసుడా పేరును నిలిపిన వారసుడా అలా బాలుడా ? భానుడా ? అన్న చందాన శాతకర్ణి ఎదుగుతున్నాడు అమర శాతవాహనుల ఆశలు ముక్కోటి దేవతల ఆశీస్సులు తల్లి గౌతమి బాలా శ్రీదేవి ఆశయాలు కలిసి దిన దిన ప్రవర్ధమానమవుతున్నాడు గౌతమి మాత గోరుముద్దలే వీర సుద్దులాయే వీర సుద్దులాయే కత్తులు అమ్ములు శర శూలమ్ములు ఆట బొమ్మలాయే ఆట బొమ్మలాయే పదునెనిమిదేళ్ళ ప్రాయమందు పట్టాభిషిక్తుడాయే పట్టాభిషిక్తుడాయే జయహో శాతకర్ణి సార్వభౌమా జయహో జయహో శాతకర్ణి సార్వభౌమా జయహో అప్పుడే పట్టాభిషక్తుడైతే మరి పెల్లో వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఇష్ట సఖి విశిష్ట సఖి మనసిచ్చింది చూడు వాసిష్టి సఖి ఇష్ట సఖి విశిష్ట సఖి మనసిచ్చింది చూడు వాసిష్టి సఖి పాల నవ్వుల తల్లి మల్లే వెన్నెల వల్లి మనువాడ వచ్చే వాసిష్టి సఖి ఇంత చక్కని జంట పూర్వ పుణ్యాల పంట ఇంకేడా కానరాదు మన కళ్ళకి చూపు తగలకుండా కష్టం కలగకుండా దిష్టి తీయరమ్మ ఆ జంటకి ఇష్ట సఖి విశిష్ట సఖి మనసిచ్చింది చూడు వాసిష్టి సఖి ఇంత దిష్టి తీశాక కష్టం ఎందుకుంటుంది మిత్రమా లేదు లేదు ఇన్నేళ్ళకి ఇన్నాళ్ళకి ఆ జంటకి కష్టం ఎదురయింది అడుగడుగడుగో క్రూరుకు కపటుడు క్షహారాదరాసుడా మాధాందుడు అధముడు దృష్ట నికృష్ట నెహాపాణ రాజురా సాటి రాజు బెదరంగ యువరాజులు దోచే దొంగ బిడ్డల బతుకుల బెంగాటనతో యుద్ధమంటే బెదరంగ వాహ్ ఎట్టెట్టా చుట్టుపక్క రాకుమారుల్ని ఎత్తుకెళ్ళి నా మీద యుద్దనికొస్తే మీ బిడ్డల్ని చంపుతానని రాజుల్ని బెదిరిస్తున్నాడా నేహపాణుడు ఈ హెచ్చరిక శాతకర్ణుల వారిదాకా వెళ్లిందా? అమ్మాశయం తీర్చంగ ఖండాలన్ని కలుపంగా జైత్ర యాత్రలో భాగంగా దూతను పంపెను ధర్మంగా ఓ నెహాపాణా నీ కత్తిని మా దూతకిచ్చి శరణు వేడితే మాకు సామంతుడిగా బ్రతకానిస్తానన్నాడు శాతకర్ణి అప్పుడు ఆ పాపి నెహాపాణుడు ఏమన్నాడు నీ కన్నబిడ్డడు పులోమపాలుడ్ని పంపించమన్నాడు పంపించమన్నాడు కొమరుణ్ణి అర్పించి శరణు కోరమని కబురు పంపినాడు కబురు పంపినాడు శాతకర్ణి మహారాజందుకు సరేనని బదులంపినాడు శాతకర్ణి మహారాజందుకు సరేనని బదులంపినాడు ఆశ్చర్యం ఆశ్చర్యం అజేయుడు అపరాజితుడు అవక్ర పరాక్రముడైన శాతకర్ణి మహారాజు కన్న బిడ్డను శత్రువుకు అప్పగించడానికి ఒప్పుకున్నాడా మేము నమ్మం కానీ నిజం ఆ మహారాజు ఆంతర్యం ఏమిటో ఆ అంతర్యామికే తెలియాలి అయ్యో మరి ఆ తల్లి వాసిష్టి దేవి ఏమౌనో కదా అయ్యో భర్త మనసులో ఎమున్నదో బిడ్డకు ఏమికానున్నదో