Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gorintaku (1979)




చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: శోభన్ బాబు, సావిత్రి, సుజాత
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: కె. మురారి
విడుదల తేది: 12.10.1979



Songs List:



గోరింట పూచింది పాట సాహిత్యం

 
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల

గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది

ఎంచక్కా పండిన ఎర్రని చుక్క
ఎంచక్కా పండిన ఎర్రని చుక్క
చిట్టీ పేరింటానికి శ్రీరామరక్ష
కన్నే పేరంటాలకి కలకాలం రక్ష

గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది

చరణం: 1
మామిడీ చిగురెరుపూ మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోనా మాణిక్యం ఎరుపు
మామిడీ చిగురెరుపూ మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోనా మాణిక్యం ఎరుపు
సందె వెలుగుల్లోనా దాగె మబ్బెరుపు
సందె వెలుగుల్లోనా దాగె మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోనా

గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది

చరణం: 2
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా
సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా
అందాల చందమామ అతనే దిగివస్తాడు

గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది

పడకూడదమ్మా పాపాయి మీదా
పాపిష్టీ కళ్ళు కోపిష్టీ కళ్ళు
పాపిష్టీ కళ్ళల్లో పచ్చా కామెర్లు
కోపిష్టి కళ్ళలో కొరివి మంటల్లు

గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది




కొమ్మ కొమ్మకో సన్నాయి పాట సాహిత్యం

 
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం?
ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం?

కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం

మనసు మాటకందని నాడు
మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే
పాటకు పల్లవి పుడుతుంది

మనసు మాటకందని నాడు
మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే
పాటకు పల్లవి పుడుతుంది

పల్లవించు పడుచుదనం
పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం
పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువలో
ముసురుకున్న మబ్బులు చూడు

అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి

కొంటె వయసు కోరిలాగా
గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే
పడవకున్న బందం చూడు
కొంటె వయసు కోరిలాగా
గోదారి ఉరకలు చూడు
ఉరకలేక ఊగిసలాడే
పడవకున్న బందం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడి పడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి
పడవ పయనం సాగునో మరి

అందుకే ధ్యానం అందుకే మౌనం
అందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి




ఎలా ఎలా దాచావు పాట సాహిత్యం

 
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి. సుశీల

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

చరణం: 1
పిలిచి పిలిచినా పలుకరించినా
పులకించదు కదా నీ ఎదా
ఉసురొసుమనినా గుసగుసమనినా 
ఊగదేమది నీ మది

నిదుర రాని 
నిశిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో
నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ
ఇన్నేళ్ళూ ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

చరణం 2:
తలుపులు తెరుచుకొని వాకిటనే
నిలబడతారా ఎవరైనా?
తెరిచి ఉందనీ వాకిటి తలుపు
చొరబడతారా ఎవరైనా?

దొరవో మరి దొంగవో
దొరవో మరి దొంగవో
దొరికావు ఈనాటికీ

దొంగను కానూ దొరనూ కానూ
దొంగను కానూ దొరనూ కానూ
నంగనాచినసలే కానూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ




చెప్పనా సిగ్గు విడిచి పాట సాహిత్యం

 
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ
చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి
చెప్పనా చెప్పనా చెప్పనా

అడగనా నోరు తెరిచి అడగరానివి ఈ
అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ ఈ
అడగనా అడగనా అడగనా

చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

చరణం: 1
చెప్పమనీ చెప్పకుంటే ఒప్పననీ
చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా?

అడగమనీ అడగకుంటే జగడమనీ
అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి అడగనా?

అడుగు మరి చెప్పు మరి
అడుగు మరి చెప్పు మరి

చెప్పితే అల్లరి అడిగితే తుంటరి
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

చరణం: 2
నిన్న రాత్రి వచ్చి సన్న దీప మార్పి
పక్క చేరి నిదురపోవు సోయగాన్ని
వీపుతట్టి రెచ్చగొట్టి కలలాగ వెళ్లిపోతే
పిల్ల గతి కన్నెపిల్ల గతి ఏమిటో చెప్పనా

పగటి వేళ వచ్చి పరాచకలాడి
ఊరుకొన్న పడుచువాణ్ణి ఉసిగొలిపి
పెదవి చాపి పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే
ఇవ్వమనీ ఇచ్చి చూడమని ముద్దులే అడగనా

వద్దని హద్దు దాట వద్దనీ
అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా

నేననీ వేరనేది లేదనీ అనీ అనీ ఆగమని
ఆపుతున్నదెందుకని అడగనా

అడుగు మరి చెప్పు మరి
అడుగు మరి చెప్పు మరి

చెప్పితే అల్లరి అడిగితే తుంటరి
అడగనా అడగనా అడగనా
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి



ఇలాగ వచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పి. సుశీల, యస్. పి. బాలు

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి
ఎన్నో వరాల మాలలు గుచ్చి
నా మెడ నిండా వేశావు
నన్నో మనిషిని చేశావు
ఎలాగా తీరాలి నీ ఋణమెలాగ తీరాలి

తీరాలంటే దారులు లేవా
కడలి కూడా తీరం లేదా
అడిగినవన్నీ ఇవ్వాలీ
అడిగినప్పుడే ఇవ్వాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలి

చరణం: 1
అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతలు
అడగముందే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలీ
నిన్నే తీరున కొలవాలీ

అసలు పేరుతో నను పిలవద్దు
అసలు కన్నా వడ్డీ ముద్దు
ముద్దు ముద్దుగా ముచ్చట తీర
పిలవాలీ నను కొలవాలీ

అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలీ

చరణం: 2
కన్నులకెన్నడూ కనగరానిది
కానుకగా నేనడిగేదీ

అరుదైనది నీవడిగేది
అది నిరుపేదకెలా దొరికేది
ఈ నిరుపేదకెలా దొరికేది

నీలో ఉన్నది నీకే తెలియదు
నీ మనసే నే కోరుకున్నది

అది నీకెపుడో ఇచ్చేశానే
నీ మదిలో అది చేరుకున్నదీ
ఇంకేం?
ఇలాగ తీరిందీ మన ఋణమిలాగ తీరింది
ఇలాగ తీరిందీ మన ఋణమిలాగ తీరింది




పాడితే శిలలైన కరగాలి పాట సాహిత్యం

 
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

పల్లవి: 
పాడితే శిలలైన కరగాలి
పాడితే శిలలైన కరగాలి జీవిత  గతులైన మారాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో పాడిన పిదపే తెలియాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో  పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి

చరణం: 1 
నీ పాటతోటి నే పగిలిపోవలే పాడమన్నది హృదయం
నీ పాటతోటి నే పగిలిపోవలే పాడమన్నది హృదయం
పెగలిరాక నా పాట జీరగా పెనుగులాడినది కంఠం
పెగలిరాక నా పాట జీరగా పెనుగులాడినది కంఠం
గొంతుకు గుండెకు ఎంత దూరం
గొంతుకు గుండెకు ఎంత దూరం ఆశనిరాశకు అంతే దూరం
ఆశనిరాశకు అంతే దూరం

పాడితే శిలలైన కరగాలి జీవిత గతులైన మారాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి

చరణం: 2 
తాళి కట్టెడి వేళ కోసమే వేచి చూసినది విరిమాలా
కట్టే వేళకు కట్టని తాళిని కత్తిరించినది విధిలీలా
వేచిన కళ్ళకు కన్నీళ్ళా  వేయని ముడులకు నూరేళ్ళా
నా పాటకు పల్లవి మారేనా ఈ పగిలిన గుండె అతికేనా
ఈ చితికిన బ్రతుకిక బ్రతికేనా





యేటంతావు పాట సాహిత్యం

 
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, యస్. పి. బాలు

ఏటంతపు ఏటంతవూ
ఇంతకంటె నన్నేటి సెయ్యమంతవూ
ఏటంతవు - ఏటంతవూ
ఒళ్ళుమంట యిప్పిప్పి సెప్పమంతవూ
పిల్ల పీచులేదని అల్లాడక -
పిల్లా నను సూసుకో పిల్ల దానిగ

పెళ్ళాం పెళ్లాం అని అల్లాడక
పిల్లగా నన్ను సూడు పిల్లదానిగ
ఒకర్నొకరు రకరకాల చూసుకున్నం.
ఇంకెవరిని యీ వయసులో చూసుకుందం
పాయ పాయ సిక్కుదీసి పాపిట సక్కదీసి
ఎయ్యి ఎయ్యి ఎయ్యి ఎయ్యి ఎయ్యమంటే
జడ ఏసినాను
సబ్బంత కరగదీసి - ఈ పంత అరగదోమి
పొయ్యి పొయ్యి పొయ్యి పొయ్యి
పొయ్యమంటే నీళ్ళోసినాను
మల్లయ్య నువు నీళ్ళోసుకుంటవని సూసినాను
నువు జడ ఏసుకుంటవని ఆగినాను.
సింగపూరులో మందు సిక్కుతుందంట
టీసుకొచ్చి నట్టుంది తెచ్చుకోమంట
రంగూనులో ఆపరేసనుందంట
ఎల్లిపోయి సేసుకుందు రమ్మంట
లోకెవరిదో ముందు తేల్చమంట
మనలో  గుట్టు పెరుమాళ్ళు కెరుకంట




మందారంలా పూస్తే పాట సాహిత్యం

 
చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

మందారంలా పూస్తే 

Most Recent

Default