Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gunturodu (2017)



చిత్రం: గుంటూరోడు (2017)
సంగీతం: DJ. వసంత్
సాహిత్యం: DJ. వసంత్
గానం: యాజిన్ నజీర్, రమ్యా బెహ్రా
నటీనటులు: మంచు మనోజ్, ప్రాగ్య జైస్వాల్
దర్శకత్వం: ఎస్. కె. సత్యం
నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి
విడుదల తేది: 03.03.2017

భూగోళం చుట్టేసినట్టు
సంద్రాన్నే దాటేసినట్టు
ఎవరెస్టే ఎక్కేసినట్టుందే...
చంద్రుడిపై చిందేసినట్టు
గెలాక్సీలో తిరిగేసినట్టు
మేఘాల్లో గంతేసినట్టుందే...

హే పదే పదే మది పద పద అని నీ వైపు నెడుతుందే
ఇదేమి వింతో తెలీదు గాని గమ్మత్తుగా ఉందే
ఓ...నీలోనే చేరి నా మనసు అసలే వెనక్కి రానందే
పతి క్షణం ఓ మహోత్సవంలా నాకెంతో నచ్చిందే
నువ్ పక్కనుంటే ఆకాశమైన అందెట్టుగా ఉందే
నీ తోడు లోన వందేళ్ల లైఫ్ పండేట్టుగా ఉందే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే

కొత్త కొత్తగుందే హాయేదో కమ్ముకుందే
నన్నిలా ఓ వెన్నెల నీడల్లే చేరుకుందే
నిన్న లేని అందం నీలాగ ఎదురయిందే
ఎప్పుడు లేనంతగా కంగారు కలుగుతుందే
పతి క్షణం నీ ఊహల్లో తేలి ఉలిక్కిపడుతున్నా
నిద్దర్లో కూడ పదే పదే నీ కలల్ని కంటున్నా
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే

ఇంతవరకు ఎపుడూ నువ్వు చంతలేనపుడు
నేనని ఉన్నానని గమనించలేదు ఎపుడు
నిన్ను కలిసినాకే మారింది గుండె చప్పుడు
నీ జతే ఉండాలని అంటోంది ప్రాణమిపుడు
నాలోని ఆశ నాలోని ధ్యాస నిరంతరం నువ్వే
నాతోనే ఉంటావనే భరోసా ఇచ్చింది నీ నవ్వే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే



**********   **********   ***********



చిత్రం: గుంటూరోడు (2017)
సంగీతం: DJ. వసంత్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి, గీతా మాధురి

డండనకా నకా నకా నకా
డనక నకా నకా నకా నకా
డండనకా నకా నకా నకా
డనక నకా నకా నకా నకా

హే రంగు రాంచిలకా నిండా హీటెక్కా
అదిరే నీ సరుకు చూశాక

డండనకా డనక నకా (4)

హే రాజా డైమండు రానా నీ వెనక
నువ్వే విజిలేసి పిలిచాక

డండనకా డనక నకా (4)

హే పక్కన నువ్వుంటే పక్కోక లెక్కా
సిద్ధం చేసేశా పువ్వుల పక్కా
అసలే మాసోడు దూసుకొచ్చాడు
దుమ్ము రేపే గుంటూరోడు
హే కన్నుపడ్డాదో కత్తెరేస్తాడు
బీ కేర్ ఫుల్ లేని కన్నెఈడు హే

వెయ్యి వోల్ట్స్ తుంటరోడు
వీడి వయసు ఒంటరోడు
కేరాఫ్ మాస్ సెంటరోడు
గుండె దమ్ము గుంటూరోడు

వెయ్యి వోల్ట్స్ తుంటరోడు
వీడి వయసు ఒంటరోడు
కేరాఫ్ మాస్ సెంటరోడు
గుండె దమ్ము గుంటూరోడు

నే ఫైర్ బ్రాండ్ పట్టాస్
పిల్లా నువ్వే మేచ్చిసు
నువ్వు నేను ఒకటైతే బ్రేకింగ్ న్యూస్
డండనకా నకా డనక నకా
హే డండనకా నకా డండా నకా
ఎయిర్ బస్సు నా వయసు
నువ్వే నాకు ఫైలెట్స్
మబ్బుల్లోన జాలిగా చేద్దాం రైడింగ్స్
డండనకా నకా డనక నకా
హే డండనకా నకా డండా నకా
హే నీతోనే నా పచ్చిమిర్చి రొమాన్స్
అయిపోతా హాట్ హాట్ కపుల్స్

అసలే మాసోడు దూసుకొచ్చాడు
దుమ్ము రేపే గుంటూరోడు
హే కన్నుపడ్డాదో కత్తెరేస్తాడు
బీ కేర్ ఫుల్ లేని కన్నెఈడు హే

వెయ్యి వోల్ట్స్ తుంటరోడు
వీడి వయసు ఒంటరోడు
కేరాఫ్ మాస్ సెంటరోడు
గుండె దమ్ము గుంటూరోడు

వెయ్యి వోల్ట్స్ తుంటరోడు
వీడి వయసు ఒంటరోడు
కేరాఫ్ మాస్ సెంటరోడు
గుండె దమ్ము గుంటూరోడు

హే ఉల్లిపాయ పెసరట్టు
ఉడుకుమీద తిన్నట్టు
నోరూరిస్తూ ఉందే నీ బ్యూటీ సీక్రెట్టు
డండనకా నకా డనక నకా
హే డండనకా నకా డండా నకా
జడ్లో పూలు నలిగేట్టు
మెడ్లో దండ సనిగేట్టు
కౌగిలింత లోనే నను చేసే అరెస్ట్
డండనకా నకా డనక నకా
హే డండనకా నకా డండా నకా
హే నీ బుగ్గే నా కర కర మంచిగు
నిదరంతా వగ్గేసింది మీటింగు

అసలే మాసోడు దూసుకొచ్చాడు
దుమ్ము రేపే గుంటూరోడు
ఆ కన్నుపడ్డాదో కత్తెరేస్తాడు
బీ కేర్ ఫుల్ లేని కన్నెఈడు హే

డండనకా డనక నకా (8)



*********   **********    ***********



చిత్రం: గుంటూరోడు (2017)
సంగీతం: DJ. వసంత్
సాహిత్యం: DJ. వసంత్
గానం: రమ్యా బెహ్రా

హే పదే పదే మది పద పద అని నీ వైపు నెడుతుందే
ఇదేమి వింతో తెలీదు గాని గమ్మత్తుగా ఉందే
ఓ...నీలోనే చేరి నా మనసు అసలే వెనక్కి రానందే
పతి క్షణం ఓ మహోత్సవంలా నాకెంతో నచ్చిందే
నువ్ పక్కనుంటే ఆకాశమైన అందెట్టుగా ఉందే
నీ తోడు లోన వందేళ్ల లైఫ్ పండేట్టుగా ఉందే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే

కొత్త కొత్తగుందే హాయేదో కమ్ముకుందే
నన్నిలా ఓ వెన్నెల నీడల్లే చేరుకుందే
నిన్న లేని అందం నీలాగ ఎదురయిందే
ఎప్పుడు లేనంతగా కంగారు కలుగుతుందే
పతి క్షణం నీ ఊహల్లో తేలి ఉలిక్కిపడుతున్నా
నిద్దర్లో కూడ పదే పదే నీ కలల్ని కంటున్నా
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే

ఇంతవరకు ఎపుడూ నువ్వు చంతలేనపుడు
నేనని ఉన్నానని గమనించలేదు ఎపుడు
నిన్ను కలిసినాకే మారింది గుండె చప్పుడు
నీ జతే ఉండాలని అంటోంది ప్రాణమిపుడు
నాలోని ఆశ నాలోని ధ్యాస నిరంతరం నువ్వే
నాతోనే ఉంటావనే భరోసా ఇచ్చింది నీ నవ్వే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే
పలానా అంటూ తెలీని హాయ్ భలేగ ఉందేే
అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే


*********    *********   **********


చిత్రం: గుంటూరోడు (2017)
సంగీతం: DJ. వసంత్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విజయ్ యేసుదాసు

ఉఁ... కదిలే రంగుల విల్లురా
ఎదురై గుండెను గిల్లెరా
అరెరే వెన్నెల కూతురా
అనిపించిదా అప్సరా

తాజమహాల్ మీదోట్టు
తన మేని రంగు మెరుపు
కోహినూరు మీదోట్టు
తన మనసు అచ్చ తెలుపు
రేయిలాంటి మైమరపు
నీలాల కురుల నలుపు
పరుగు తీసే ప్రతి తలపు
ఆ రాకుమారి వైపు
అలాంటిలాంటమ్మాయ్ కాదురా
అలై వచ్చి నన్నే తాకెరా
అలా ఎలా పుట్టేసిందిరా
అమాంతంగ నచ్చేసిందిరా

బొమ్మగా తననే చేసి
బ్రహ్మ తన పనిమానేసి
బుగ్గలే గిల్లాడేమో...
అందమే తననే చూసి
ముద్దుగా దిస్టే తీసి
హారతే పడుతుందేమో
ఆ సొగసులపై ఒక కవితే రాయాలమ్మా
ఏ భాషలో పదములు అయినా సరిపోయేనా

అలాంటిలాంటమ్మాయ్ కాదురా
అలై వచ్చి నన్నే తాకెరా
ఏ అలా ఎలా పుట్టేసిందిరా
అమాంతంగ నచ్చేసిందిరా

పంజరం లేనేలేని
పావురం నేనైపోయా
జంటగా తనతో కదిలీ...
లోకమే ఏమైపోనీ
పట్టని పరుగై పోయా
నన్నలా విడిగా వదిలి
తొలి జన్మల పూజల కైనా
దొరకని భాగ్యం
కోవెలలో దేవత రూపం
ఆ సౌందర్యం

అలాంటిలాంటమ్మాయ్ కాదురా
అలై వచ్చి నన్నే తాకెరా
హే అలా ఎలా పుట్టేసిందిరా
అమాంతంగ నచ్చేసిందిరా

Most Recent

Default