చిత్రం: హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (2017)
సంగీతం: డా. వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: గీతా మాధురి
నటీనటులు: ఆర్. నారాయణ మూర్తి, జయసుధ
దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు
నిర్మాత: చదలవాడ పద్మావతి
విడుదల తేది: 14.01.2017
నాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయం
నాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయం
అది ముందెపుడో నిర్ణయం
అది ముందెపుడో నిర్ణయం...
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
చరిత్రలో ఎపుడైనా ప్రజల ఆమోదమే అజేయం
అదే అదే అదే ప్రజాస్వామ్యం...
పూటకు గతిలేని పతిని నోటుతో ఓడిస్తా
డిపాజిట్లు దక్కకుండ విజయం నాదనిపిస్తా
నీతి అవినీతి మద్య మంచి చెడు రెంటి నడుమ
సాగే ఎన్నిక రణ క్షేత్రంలో...
ఆలుమగల నడుమ జరుగుతున్నా
కని విని ఎరుగని కలియుగ కురుక్షేత్రంలో
నాది జనక్షేత్రం (4)
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
నాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయం
పల్లె పల్లె కుర్రాళ్లకు క్రికెట్ కిట్లు పంచేస్తా
ఐటీ హబ్బులతో సాఫ్ట్వేర్ యూత్ ని కూడబెడతా
దిమ్మ దిరిగి పోయేలా గూబ గుయ్యమనిపిస్తా
అశంబ్లీలో అడుగేస్తా ముఖ్యమంత్రిగ ముందుకొస్తా
హెడ్ వెంకట్రామయ్యతో సెల్యూట్ కొట్టిస్తా
తాగుడుతో చెల్లెమ్మల తాళిబొట్లు తెగనివ్వను
నల్లడబ్బు చెత్తకాగితాలు నీడ పడనివ్వను
దేశమంటే మట్టికాదు దేశమంటే యువకులని
ఆకర్షణ పథకాలకు అమ్ముడవరు నా తమ్ములు
ఓట్లు కొనాలనేవాళ్ళ మాడు పగిలిపోయేలా
ఎప్పుడెవరి కెక్కడ గుద్దాలో అక్కడ గుద్ది
గెలిపించే ప్రజలే నాకెప్పుడు దేవుళ్ళు...
నాది జనక్షేత్రం (4)
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
నాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయం
ఎన్నికలు వచ్చినపుడె దక్కినంత దండుకోండి
ఓటు మన జన్మ హక్కు నీతిని కాపాడాలి
దీపముండగానే ఇళ్ళు చక్కదిద్దుకోండి
చీకటి మూకలను తరిమే సూర్యుల్లై కదలిరండి
ఇప్పటికిప్పుడు మీరు అడిగింది ఇచ్చేస్తా
ఎవ్వరిని యాచించని వ్యక్తిత్వం నేర్పిస్తా
ఋణాలన్ని మాఫీచేసి ధన బంధం నేనౌతా
నా భార్యా నా పిల్లలు నా కుటుంభమనికాదు
ప్రజలంతా నా సొంత కుటుంభంగా భావిస్తా
నల్లధనం కాగితాలు పనికిరాని చెత్తని
ధర్మాన్ని గెలిపిస్తే ధర్మబద్ధుడై ఉంటా
నాది జనక్షేత్రం (4)
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
జనతీర్పు శిరోధార్యం...