Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

I (Manoharudu) (2015)



చిత్రం: ఐ ( మనోహరుడు ) (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్ , ఇస్రత్ క్వాధ్రి
నటీనటులు: విక్రమ్ , అమీ జాక్షన్
దర్శకత్వం: ఎస్.శంకర్
నిర్మాతలు: వి. రవిచంద్రన్, డి. రమేష్ బాబు
విడుదల తేది: 14.01.2015

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నేనుంటా ఊపిరిగా ...
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా
అడ్డొస్తే ఆ ప్రేమైనా చేతుల్తో నరికేయిస్తా
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా
పూల తీగల్లో పూచే బంతి భూమినై
నిత్యం నీ చుట్టూ నే తిరిగేస్తూ వుంటా
నీ కలలే కంబళై కునుకే తీస్తా
నీ తనువే నదిగా ఊపిరై పడుంటా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా



********   ********  *********


చిత్రం: ఐ ( మనోహరుడు ) (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్ , నటలే డి లూసియో

ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ మేడి ఇన్ వేన్నీలా..
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నిలా
నా చేతిలో పువ్వల్లే నిలిచే
నును లేతగా నా ముళ్లు విరిచే
నా ప్రియనేస్తం నువ్వే
నీ ముద్దుతో తెలవారుతుందే
నీ శబ్దమే నను మార్చుతుందే
నా గిలి గీతం నువ్వే
కురుల మూలమే తరచి చూడవా
పదును చూపుతో మదిని లాగవా
అధర కేశమే అపహరించవా మనసారా
నా రోమనై.....రా...
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ

ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ

ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ

కొద్ధి కొద్ది కొద్దిగా నన్నదిమి
ఐలా ఐలా ఐలా చేస్తావా
కొంటె చూపుతో కొల్లగొట్టి
మిణుగురుకు వెల్ల వేస్తావా...
మృదువుగా రుద్దతావా
ముత్యమంతా ఓయా
పువ్వేలేక ఐలా తావి ఔతా
నువ్వొక చిరునవ్వే విసిరావే
పలు నెలవంకలు గల గల దూకెనె
నేల వెలిగేనే యిలా
యిక విద్యుత్ కోతలే రావడమే కల
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నెల

మెల్ల మెల్లగా నిలువెల్లా
ఐల ఐలా పూస్తావా
ఆ కాంతి సోకి
పలు కాకులిక కళ్లు తేలవేస్తాయా
నీలి నింగిలో ఓయా లే మెరుపే ఓయా
రోజా పువులో ఐలా పసి ఎరుపే ఓయా
కలిసిన నవ వర్ణం నీ దేహం నీ అణువణువున
విరిసిన వెలుగులు పువ్వుల మేడలు కదా
యిక తోటల్లోన విసిరినవి వాటికి నీడలు కదా
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నిలా
మేఘాలనే మగ్గాలు చేసి
నీలాలనే దారాలు తీసి
నే ఓ వస్త్రం చేశా
ఆ వస్త్రమే నీపైన వేసి
అణ్వస్త్రమే అనిపింపజేసి
నీ వున్మాదం చూశా
చిలిపి రాట్నమై వలపు వడకనా
వుడుకు నూలునై దరికి జరగనా
మరొక చర్మమై మెలిక తిరగనా
పోమాకే నా జీన్ జింకా...రా


********   ********  *********


చిత్రం: ఐ ( మనోహరుడు ) (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రేయా గోషల్ ,హరిచరణ్

పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
హే..ఐ అంటే మరి నేనను అర్థము..
తెలిసోయ్ నిన్న మొన్న..
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
ఎద చెబుతుంటే విన్నా..
అయ్యో నాకెదురై ఐరావతమే..
నేలకి పంపిన తెలి కలువై..
తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
పూలనే కునుకెయ్యమంటా..
తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..

అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
కనబడునా మనిషై..
అది జరగదని ఇలా అడుగు వేసిన..
నిన్ను వలచిన మనసై..
ప్రతి క్షణము క్షణము..
నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
ఇన్ని కలల ఫలితమున..
కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
నా చేతిని వీడని గీత నువై ..
నా గొంతుని వీడని పేరు నువై ..
తడి పెదవులు తళుకవనా..
నవ్వునవ్వనా.. ఎంత మధురము..
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..

హే..ఐ అంటే మరి నేనను అర్థము..
తెలిసోయ్ నిన్న మొన్న..
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
ఎద చెబుతుంటే విన్నా..
అయ్యో నాకెదురై ఐరావతమే..
నేలకి పంపిన తెలి కలువై..
తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..

నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
నా రాతి గుండెని తాకుతూ..
శిల్పం లాగా మార్చేసిందా..
యుగములకైనా మగనిగా వీణ్ణే..
పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
ప్రతి ఉదయాన తన వదనాన్నే..
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..

హే..ఐ అంటే మరి నేనను అర్థము..
తెలిసోయ్ నిన్న మొన్న..
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
ఎద చెబుతుంటే విన్నా..
అయ్యో నాకెదురై ఐరావతమే..
నేలకి పంపిన తెలి కలువై..
తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
పూలనే కునుకెయ్యమంటా..
తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..


********   ********  *********


చిత్రం: ఐ ( మనోహరుడు ) (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్ , ఇస్రత్ క్వాధ్రి

వీచే చిరుగాలిని వెలివేస్తా..
హో పారే నదినావిరి చేస్తా..
నేనున్న నేలంతా మాయం చేస్తా...
లేనే లేదే అవసరమే..
నువ్వే నాకు ప్రియవరమే..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..ఊపిరిగా..ఊపిరిగా..
నువ్వుంటే నా జతగా..నా జతగా..
నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా..నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..

నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ..
ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ..
నీ కోసం ఈలోకం బహుమానం చేసేస్తా..
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా..
నువ్వుంటే నా జతగా...
ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా..
అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా..
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా..
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా..
అగ్గిపుల్ల అంచున రోజా పూయునా..
పువ్వుల్లోని తేనె పురుగులకందునా..
మొసళ్లే తగిలే మొగ్గనై మొలిచా..
బూచినే చూసిన పాపనై బెదిరా..

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ...
నేనుంటా ఊపిరిగా..
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ..
నువ్ లేని లోకంలో నే బ్రతక లేనే ..
నువ్వుంటే నా జతగా...

Most Recent

Default