చిత్రం: ఇద్దరు మిత్రులు (1999) సంగీతం: మణిశర్మ నటీనటులు: చిరంజీవి, సిమ్రాన్, ఆషిమా బల్లా, రాజేంద్రప్రసాద్ దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాతలు: కె.రాఘవేంద్రరావు, కె.కృష్ణమోహన రావు విడుదల తేది: 30.04.1999
Songs List:
హాయ్ రుక్కు రుక్కు మామ్ పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, హరిణి హాయ్ రుక్కు రుక్కు మామ్ (3) నీ గుట్ట విప్పువాసి గుట్టు చెప్పవాహే చికుబుకురుక్కుమామ్ షికారు వెళ్ళదాం - వెళ్ళాకా సినిమాలు చూద్దాం - ఆ చూశాకా షాపింగ్ చేద్దాం - ఆ చేశాకా చపాతీ తింద్దాం -ఆ తిన్నాకా తిన్నదంత అరిగేట్టు ముద్దు మీద ముద్దపెట్టు హాయ్ రుక్కు రుక్కు మామ్ (2) హాయ్ రుక్కు రుక్కు మామ్ చిలకముక్కు రుక్కుమామ్ (2) చెరుకుముక్క రుక్కుమామ్ రుక్కురుకురుక్కుమామ్ చరణం: 1 జూపార్కు వైపు పరుగుతీద్దాం చెట్టు చాటు పొదలో చొరవు చేద్దాం గోల్‌కొండ వైపు అడుగులేద్దాం పాడుబడ్డ గృహంలో ఆడుకుందాం నక్షత్రశాలకు పోదాం నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం షామీర్‌పేటకు సిద్ధం చలికోనేటి స్నానం చేసేద్దాం చరణం: 2 ఉస్మానీయలో చదువుకుందాం ప్రేమలోన డాక్టరేటు పుచ్చుకుందాం అసెంబ్లీహాల్లో హాజరవుదాం ప్రేమగుర్తు జండా ఎగురవేద్దాం ఆకాశవాణికి పోదాం మన అందాల వార్తలు చెబుదాం ఆపైన మార్కెటుకు వెళ్ళదాం అయిదు కేజీలు మల్లెలుకొని తెద్దాం
చాంగ్ చాంగ్ చాంగ్ పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, హరిణి చాంగ్ చాంగ్ చాంగ్, చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్‌రే బాపుబొమ్మ కదులుతోంది బాపురే చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్‌రే ఊపు చూపి అవుతోంది ఊపిరే ఆర్టుఫిల్మ్‌లో తనకుచోటు ఇవ్వగా నా హార్టు ఫిల్మ్‌లో తనకు చోటు ఇవ్వగా నేనౌతా కొత్త సత్యజిత్‌రే చరణం: 1 ఎంకి పిల్ల కొప్పు యక్షకన్య మెరుపు ఎలిజిబిత్ నునుపు ఎదురులేని రూపు తేనేపాత్రవే లేక క్లియోపాత్రవేతెల్లవారిని రాత్రివే గ్రీకు ఇంటివే గిటారు తంత్రివే చూపుసాక మంత్రివే ఇండియాలో నీకు సాటి వుండరే చరణం: 2 మాయలేడి హొయలు మైక్రోసాఫ్ట్ కలలు ఎంకి కడవ వగలు తేరెక్రాఫ్ట్ లయలు గుల్షగుంతల బంతిపూల సంతలా కొంగుచుట్టినకోయలా దేవకాంతుల దమయంతి రీతిలా పూట గత్తిలా వెన్నలా నిగనిగల నగల నిధికి నువు వోనరే చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్‌రే హంపి శిల్ప కళలు నాలో హాజరే చాంగ్ చాంగ్ చాంగ్ చాంగ్‌రే పాలు సరసులాంటి సొగసుకు ఆన్సరే క్యాటువాక్‌లు ఫ్యాషన్ పరేడ్‌లు యాడ్ సంస్థలు అందాల క్లబ్‌లు నాస్టైల్స్‌నే చేస్తాయి స్పాంసరే
దేఖ్‌బాబా దేఖ్‌బాబా పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి.బాలు, చిత్ర దేఖ్‌బాబా దేఖ్‌బాబా దేఖ్‌ఆలీబాబా లేక్‌లేక రాకరాక సోకు వచ్చిందమ్మ నీగాలీ నీధూళి నా పైకి మల్లించేయ్ నేపాలీ భోపాలీ మంత్రాలు వల్లించేయ్ జంతర్ మంతర్ జాదు చూపించాలోయ్ గున్‌గునాగున్ గున్‌గునాగున్ చెంతచేరాలోయ్ ధన్‌ధన్‌ధన్ ధన్‌ధన్‌ధన్ శాంతి చేయాలోయ్ గున్‌గునాగున్ గున్‌గునాగున్ చెంతచేరాలోయ్ ధన్‌ధన్‌ధన్ ధన్‌ధన్‌ధన్ శాంతి చేయాలోయ్ దేఖ్‌బేబీ దేఖ్‌బేబీ దేఖ్‌జాలీ బేబీ సోక్‌మీద స్నేక్‌లాగా దూకడం నా హాబీ హాత్తేరీ అందేరీ మోసాలు చేసేస్తా శృంగేరీ హంగేరీ దేశాలు చూపిస్తా మూడోకన్ను నేడే తెరిచేస్తాగా గున్‌గునాగున్ గున్‌గునాగున్ ధూపమేస్తాగా ధన్‌ధన్‌ధన్ ధన్‌ధన్‌ధన్ ఊపుతెస్తాగా చరణం: 1 చాకులొద్దు బాకులొద్దు పాకులాడద్దు పిట పిటలను కిటకిటను కిటుకులుచాలు చాలు చాలు చాలేద్దు మేకలొద్దు కూతలొద్దు చీకుచింతొద్దు చిటచిటమను చిటికెలువిని చటుక్కునకాలు కాలు కాలు కాలు జారొద్దు ఘరానా ఖజానా కమ్ కమాయించుకో నయానా నా భయానా భం భరాయించుకో మతిపోయే మాయాజాలం చేసిపో చరణం: 2 ఆకలేస్తు అంగలేస్తు దొంగలావస్తూ పరులెరగని పరువపుగని కనుగొని నీకు నీకు నీకు సుఖమస్తు కోకవాస్తు రైకవాస్తు అన్ని గమనిస్తూ తెర తెరవని చెరవదలని తళుకుని తాకి తాకి తాకి తరిగిస్తు బిచాన నీ ధికానా నా ఒడే చేసుకో స్వయానా నీ సుఖానా నా ముడేవేసుకో అందంతో అబ్రకదబ్రా ఆడుకో
నూటొక్క జిల్లాల్లో పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: మనో , చిత్ర హేహేహేరబ్బ నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి (3) ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా మనిషే మరీ భోళాగా తనమాటే గలగలా తానేలేని వీణా ఆ ప్రాణం విలవిల చరణం: 1 గాలేనువ్వైతే తెరచాపల్లే నిలబడతా జోలాలేనువ్వైతే పసిపాపల్లే నిదరోతా రాణిలాగా కోరితే బంటులాగా వాలనా భక్తితోటివేడితే దేవతల్లే చూడనా సన్నాయి సవ్వడల్లే సంక్రాంతి సందడల్లే రోజంతా సరిక్రొత్త కేరింతలే మలినాలేవి లేని మధుగీతం మనదిలే ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి (2) చరణం: 2 మూగై నువ్వుంటే చిరునవ్వుల్లో ముంచేస్తా నువ్వు మోడలై నిలుచుంటే చిగురించేలా మంత్రిస్తా కోపమొచ్చినప్పుడు బుజ్జగించవే మేనకా కొంటెవేష మేసినప్పుడు వెక్కిరింత నాదట చప్పట్లు కొద్దిసేపు చివాట్లు కొద్దిసేపు మనమధ్య వుంటాయి పోతాయిలే ఆనందాన్ని యేలే అధికారం మనదిలే ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా మనసే మేఘమాలా తన ఉనికే వెన్నెలా తానే లేనినేలా పోతుంది విలవిలా
మనసా వాచా మనసిస్తే పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి.బాలు, సుజాత మనసా వాచా మనసిస్తే మైసూర్‌ప్యాలస్ రాసిస్తా మనసా వాచా మనసిస్తే మైసూర్‌ప్యాలస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలస్‌చదివిస్తా జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా ప్రియతమ పదవందిస్తే ఈ తుడివిరి ఎదిరిస్తా రా . . . రా . . . రా . . . రా . . . చరణం: 1 కళ్ళతోటే కావలిస్తే కాళిదాసు నవలిస్తా ఎదకు ఎదకు పడితే ఆ పెదవి పొదిగిపెడతా కంగులూరి చేరివస్తే కోహినూరు కొసరిస్తా నడక మిడిసి పడితే ఓ... నడుము మడతా ముడతా కృష్ణయ్యా వెన్నంటితే; నా చల్లని చెల్లించుతా వనిత విను చెబుతా కధా ఆ... చరణం: 2 రాజులాగా రాసుకుంటే వైజయంతిమాలిస్తా గడియగడువు పెడితే ఆ... తడిసి కడివెడౌతా సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్రా నదినిస్తా కలసి మెలసి ఫోతే ఓ...మెరిసి కురిసి వెళతా వాల్మీకిలా వేటాడితే ప్రేమాయణం వల్లించుతా లలితా ముడిపడతా పదా...
బంగారం తెచ్చి పాట సాహిత్యం
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర, పార్థసారథి బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ ఎన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఈ బొమ్మ చెంత చెదరని మురిపించే చిత్రం చూడనీ వీరివీరి గుమ్మాడీ వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ చరణం: 1 జో... లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా ఈ... మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట అమ్మాయిగారు అమ్మగా పదవిని - పొందునట ఇల్లంతా బొమ్మల కొలువు మనసంత నవ్వుల నిలవు ఓ చరణం: 2 అడగక ముందే అన్నీ చేసి సేవకుడవి అనిపిస్తావు అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు నీ స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు ఎప్పుడు నా గుండెపాడనీ మధురీమ నేర్పావు నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ ఓ...మాతృత్వానికి మగరూపానివై నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై బతుకంతా జతగా నిలిచే విధివో పతినే మించిన తోడువై బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా