Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Idiot (2002)





చిత్రం: క్రాక్ (2020)
చిత్రం: ఇడియట్ (2007)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ , రక్షిత
దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాత: పూరి జగన్నాధ్
విడుదల తేది: 22.08.2002



Songs List:



సై సర సై పాట సాహిత్యం

 
చిత్రం: ఇడియట్ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి

సై సర సై



చూపుల్తో గుచ్చి గుచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: ఇడియట్ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: శంకర్ మహదేవన్

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్
ఒలల్ల గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్

నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే
హే నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే
ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే
నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే
లైఫంతా అయిపోయింది భారమే హాయ్
నీ అందం అడవైపోను చూడవే మేరే హాయ్

ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్

నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే (2)
నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
ఛి అంటే జిందగి మొత్తం నరకమే హాయ్
నీ ఈడు బీడైపోను చూడవే మేరే హాయ్

ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్
గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్
ఒలల్ల నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్



చెలియా చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: ఇడియట్ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: రవివర్మ

చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే
మదిలో దిగులే రగిలే
సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై
కనులా నీరే నదులై

ప్రియురాలా కనవా నా ఆవేదన
ప్రియమారా వినవా ఈ ఆలాపన
వలపే విషమా మగతే చలమా ప్రణయమా

చెలియా చెలియా తెలుసా కళలే కలలై
సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై
మదిలో దిగులే రగిలే
కనులా నీరే నదులై

ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు
ఆశై ఎగసే అలనే మాయం చేసిందెవరు
వినపడుతున్నవి నా మదికి చెలి
జిలిబిలి పలుకుల గుసగుసలు
కనబడుతున్నవి కన్నులకి
నిన మొన్నల మెరిసిన ప్రియ లయలు
ఇరువురి ఎద సడి ముగిసినదా
కలవరమున చెర బిగిసినదా

చెలియా చెలియా దరి రావా
సఖియా సఖియా జత కావా
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
రెప్పల మాటున ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ

చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే
మదిలో దిగులే రగిలే
సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై
కనులా నీరే నదులై

గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు
కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదెవరు
జననం ఒకటే తెలుసు మరి
తన మరణం అన్నది ఎరుగదది
కాదని కత్తులు దూస్తున్నా
మమకారం మాత్రం మరువదది
చరితలు తెలిపిన సత్యమిదే
అంతిమ విజయం ప్రేమలదే
చెలియా చెలిమే విడువకుమా
గెలిచేదోకటే ప్రేమ సుమా
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
గుండెల గుడిలో ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ

చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే
మదిలో దిగులే రగిలే
ప్రియురాలా కనవా నా ఆవేదన
ప్రియమారా వినవా ఈ ఆలాపన
వలపే విషమా మగతే చలమా ప్రణయమా
చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే
మదిలో దిగులే రగిలే
చెలియా...



ఈ రోజే తెలిసింది పాట సాహిత్యం

 
చిత్రం: ఇడియట్ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: కౌశల్య , చక్రి

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
నా ఊపిరితో జీచించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువ నను చేరే పన్నీరువా
నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా 

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన

కన్నులులోన వెన్నెలలోన నీ రూపు తోచే 
ఊహాలలోన ఊసులులోన నీ ఆశలే నాలో నీ బాసలే
తొలిసారిగ సిగ్గేస్తోంది మొగ్గేస్తుంది తనువంతా
అపుడపుడు తడిమేస్తుంది తడిపేస్తుంది మధువుల వాన
ఆనందమై నాలో అనుభందమై నీ ప్రేమ నను చేరి ఉడికించేరా

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన

ఏయ్... ఎంటలా చూస్తున్నావ్ ?
సిగ్గేస్తుంది, దగ్గరికి రావద్దు
ప్లీజ్... చంటి నిన్నే అరే

ఉదయించే అరుణం నేనై నిను చేరుకోన
వికసించే కుసుమము నేనై నిను తాకన నీలో సడి చేయనా 
పని చేస్తూ పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే
పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై నాలో సంతోషమై
నీ ప్రేమ ఫలమేందో పండించరా

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన
నా ఊపిరితో జీచించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువ నను చేరే పన్నీరువా
నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా 

చంటి... ప్లీజ్... ఛి



లేలేత నవ్వులా పాట సాహిత్యం

 
చిత్రం: ఇడియట్ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కౌశల్య, ఉదిత్ నారాయణ్

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా 
బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా 
ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా 
కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా 
రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా 

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా 
బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా 

చరణం: 1 
ఎట్టా దాచావోగాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయ్ దోరగా 
ఒళ్ళే వేడిక్కి ఉంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంతచొరవా 
ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా హో... 
నిను చూసినాక నా మనసు ఆపతరమా...
నీ కాలి మువ్వనైపోనా నువు ఊగేటి ఊయలైరానా 
నీ పూల పక్కనైపోనా తమలపాకుల్లో వక్కనై రానా 
గోదారి తీరమా మంజీరనాదమా కవ్వింతలెందుకే హాయ్ రామా 

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా 
బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా 

చరణం: 2 
లిల్లీ పూవంటి సోకు నాదేనుగా మరి గిల్లి గిచ్చెయ్ తేరగా 
అగ్గే రేగింది నాలో చూశావుగా అది చేసింది ఎంతగొడవా 
చిరు చీకటింట చేరాలి కొంటెతనమా...
దరి చేరినాక పులకించు పూలవనమా...
నీ గోటి గాటునైపోనా మరి నీగుండె గూటికే రానా 
ఆ గోరువంకనైపోనా చెలి ఈ వాగువంకనై రానా 
నాలోని భాగమా ఆ నీలిమేఘమా ఇచ్చాక ఎందుకో హైరనా 

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా 
బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా 

ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా 
కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా 
రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా 

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా 
బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా 




జై వీరాంజనేయ...పాట సాహిత్యం

 
చిత్రం: ఇడియట్ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రఘు కుంచె

జై వీరాంజనేయ... ఓ...
ఏయ్ దీని తస్సదియ్య... ఓ...

దుమ్ము రేపే దమ్ము ఉంది చూపులోనే చురుకు ఉన్నదిరో...
పంబ రేపేయ్ కుర్రోడా బెండు తీసేయ్ చిన్నోడా
చెడుగుడు ఆడేయ్ బుల్లోడా నిప్పులు చెరిగేయ్ సూరీడా

ప్రేమలో పడితే కష్టాలుంటాయ్ 
కష్టాలున్నపుడే ఈ కన్నీళ్ళోస్తాయ్
ఈ కష్టాలు కన్నీళ్ళు మనకెందుకులే అనుకోని ప్రేమించడం మానేస్తే 
గొడ్డుకి మనిషికి తేడా ఏముంటుందిరో

గుప్పెడు గుండెను తట్టిందా ఉప్పెన లాంటి ఈ ప్రేమా
ఎనకడుగేస్తే దక్కేనా వన్నెచిన్నెలా ఈ భామా
తల్లిని ప్రేమిస్తాడోకడు పిల్లిని ప్రేమిస్తాడోకడు
అక్కను ప్రేమిస్తాడోకడు కుక్కను ప్రేమిస్తాడోకడు
అలాంటపుడు నువీ పిల్లను ప్రేమిస్తే తప్పేమిటిరో

ప్రాణంగాను ప్రేమిస్తే ముందు వెనకా చూడకురో
అడ్డం వస్తే ఎవడైనా తాడో పేడో తేల్చేయ్ రో

ఓరోరి కుర్రోడో ఆ పిల్ల నీదేరో
సీమంటూ కుట్టాక సిర్రెత్తు కొస్తాది
ప్రేమంటూ పుట్టిందా ఏదేదో అవుతాది
ప్రేమేగానయ్యిందంటే చచ్చేదాక అసలే వదలదురోయి
విడదీయలనుకుంటున్న అయ్యెరామ ఇంచే కదలదు రోయి

పెద్దోళ్ళ ఏడుపు చూసి కరగొద్దు ముద్దుల కన్నా
అయ్యయ్యో అన్నావంటే నీ ప్రేమే నిండు సున్నా

ప్రేమించుకోవయ్యో తప్పేమికాదయ్యో 
నవాబు గరీబు తేడాలే లేవంటూ
ఆనాడు ఈనాడు గెలిచేదే ప్రేమంటా
లోకంలో అన్నిటికన్నా అద్దిరబన్నా ప్రేమే గొప్పదిరోయి
కుర్రోడు ముసలోడైన ఎప్పటికైనా ప్రేమలో పడతాడోయి

ప్రేమిస్తే సరిపోదన్నా  ప్రాణాలే ఇచ్చేయాలి
అదికూడా కాదంటావా ప్రాణాలే తీసేయాలి

ఇటు చూడు బ్రహ్మయ్యో ఇతగాడి జోరయ్యో
ప్రేమించే పిల్లాడు ఎదురించి నిలిచాడు 
ప్రేమిస్తే ఇట్టాగే పోరాడాలన్నాడు
సుడిగుండాలెన్నెదురైనా  బిత్తర పోక ఒడ్డుకు చేరాలోయి
బుసకొట్టే పాములు ఉన్నా తత్తరపడక బరిలో గెలవాలోయి

అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా
ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా

అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా
ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా

అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా
ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా

Most Recent

Default