Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Illarikam (1959)




చిత్రం: ఇల్లరికం (1959)
సంగీతం: టి.చలపతి రావు
నటీనటులు: అక్కినెని నాగేశ్వర రావు, జమున
దర్శకత్వం: తాతినేని ప్రకాశ రావు
నిర్మాత: ఎ.వి.సుబ్బారావు
విడుదల తేది: 01.05.1959



Songs List:



అడిగిందానికి చెప్పి పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లరికం (1959)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, పి. సుశీల

అడిగిందానికి చెప్పి 



ఎక్కడి దొంగలు అక్కడే గుప్ చప్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లరికం (1959)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: ఘంటసాల, పి. సుశీల

ఎక్కడి దొంగలు అక్కడే గుప్ చప్ 



నిలువవే వాలు కనులదానా పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లరికం (1959)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంసనడకదానా
నీ నడకలో హొయలున్నదే తానా
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే 
నిలువదే నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు
 
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంసనడకదానా
నీ నడకలో హొయలున్నదే తానా
 
ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతిపడినావో
ఎవరని ఎంచుకొనినావో  భ్రాంతిపడినావో 
సుగ్గుపడి తొలగేవో
విరహగ్నిలో నను తోసి పోయేవో
 
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే 
నిలువదే నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
 
ఒక సారి నన్ను చూడరాదా
చెంతచేరా సమయమిదికాదా
ఒక సారి నన్ను చూడరాదా 
సమయమిదికాదా చాలు నీ మర్యాదా
వగలాడి నే నీ వాడనే కాదా
 
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే 
నిలువదే నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
 
మగడంటే మోజులేనిదానా
మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజులేనిదానా
నీకు నేను లేనా కోపమా నా పైనా
నీ నోటి మాటకే నోచుకోలేనా
 
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంసనడకదానా
నీ నడకలో హొయలున్నదే తానా
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే 
నిలువదే నా మనసు
ఓ లలనా ఓ మగువా ఓ చెలియా 
అది నీకే తెలుసు




చేతులు కలిసిన చప్పట్లూ పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లరికం (1959)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, మాధవపెద్ది సత్యం , పి. సుశీల

పల్లవి:
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు (2)

ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు
రానే రావు పొరపాట్లు
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు

చరణం: 1
పాలూ తేనె కలిసిన మాదిరి
ఆలు మగలు ఉండాలి
ఓహోహో ఒహోహ్ హొఓహో
ఓహోహో ఒహోహో హొహో
పాలూ తేనె కలిసిన మాదిరి
ఆలు మగలు ఉండాలి
గువ్వల జంట కులికే రీతిగ
నవ్వుల పంట పండాలీ..
నవ్వుల పంట పండాలీ

చరణం: 2
కొత్త కుండలో నీరు తియ్యన
కోరిన మగవాడే తియ్యన (2)
కొత్త కాపురం చక్కని వరము
కోరిక తీరు రయ్ రయ్యన

చరణం: 3
వన్నెల చిన్నెల వలపు తోటలో
పూల బాటలే వెయ్యాలి
ఓహొహో ఓహో హొహో
ఓహొహో ఓహో హొహో
వన్నెల చిన్నెల వలపు తోటలో
పూల బాటలే వెయ్యాలి

అన్యోన్యంగా దంపతులెపుడు
కన్నుల పండుగ చేయాలీ
కన్నుల పండుగ చేయాలీ
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు




నేడు శ్రీవారికి మేమంటే పరాకా...పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లరికం (1959)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
నేడు శ్రీవారికి మేమంటే పరాకా...
తగని బలే చిరాకా ఎందుకో తగని బలే చిరాకా...
నేడు శ్రీవారికి మేమంటే పరాకా...

చరణం: 1
మొదలు మగవారు వేస్తారు వేషాలు
పెళ్లి కాగానే చేస్తారు మోసం...
ఆ...ఆడవాళ్ళంటే శాంత స్వరూపాలే
కోపతాపాలే రావండి పాపం
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు

నేడు శ్రీమతికి మాతోటి వివాదం
తగువే బలే వినోదం ఎందుకో తగువే బలే వినోదం...
నేడు శ్రీమతికి మాతోటి వివాదం...

చరణం: 2
వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారు
ఆ...తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు
అలుక సరదా మీకు  అదే వేడుక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే
ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే బలే వినోదం 
ఆ...నిజమే బలే వినోదం
ఆ...నిజమే బలే వినోదం
నిజమే బలే వినోదం




మధుపత్రం పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లరికం (1959)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: జిక్కీ 

మధుపత్రం 




భలే చాన్సులే... పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లరికం (1959)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: కొసరాజు
గానం: మధవపెద్ది సత్యం

పల్లవి:
భలే ఛాన్స్... భలే చాన్సులే...
భలే చాన్సులే భలే చాన్సులే
లలలాం లలలాం లక్కీఛాన్సులే
భలే చాన్సులే...
ఇల్లరికంలో ఉన్న మజా...
ఇల్లరికంలో ఉన్న మజా 
అది అనుభవించితే తెలియునులే
భలే చాన్సులే...

చరణం: 1
అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే
అత్తమామలకు ఒక్క కూతురౌ అదృష్టయోగం పడితే
బావమరదులే లేకుంటే ఇంటల్లుడిదేలే అధికారం
భలే చాన్సులే...

చరణం: 2
గంజిపోసినా అమృతంలాగా 
కమ్మగ ఉందనుకుంటే
బహుకమ్మగ ఉందనుకుంటే
చీ ఛా చీ ఛా అన్నా చిరాకు పడక
దులపరించుకు పోయేవాడికి భలేచాన్సులే

ఇల్లరికంలో ఉన్న మజా...
ఇల్లరికంలో ఉన్న మజా 
అది అనుభవించితే తెలియునులే
భలే చాన్సులే
భలే చాన్సులే భలే చాన్సులే
లలలాం లలలాం లక్కీ ఛాన్సులే
భలేచాన్సులే...

ఇల్లరికంలో ఉన్న మజా...
ఇల్లరికంలో ఉన్న మజా 
అది అనుభవించితే తెలియునులే
భలే చాన్సులే...

చరణం: 3
జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడీ
జుట్టు పట్టుకొని బయటికీడ్చినా చూరు పట్టుకొని వేలాడీ
దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలచేవాడికి...
భలేచాన్సులే...

భలే చాన్సులే భలే చాన్సులే
లలలాం లలలాం లక్కీఛాన్సులే
భలే చాన్సులే...
ఇల్లరికంలో ఉన్న మజా...
ఇల్లరికంలో ఉన్న మజా 
అది అనుభవించితే తెలియునులే
భలే చాన్సులే...

చరణం: 4
అణిగీ మణిగీ ఉన్నామంటే అంతా మనకే చిక్కేది
అణిగీ మణిగీ ఉన్నామంటే అంతా మనకే చిక్కేది
మామలోభియై కూడబెట్టితే మనకే కాదా దక్కేది
అది మనకే కాదా దక్కేది
ఇహ మనకే కాదా దక్కేది
అది మనకే ఇహ మనకే
అది మనకే మనకే మనకే మనకే మ మ మ మనకే


Most Recent

Default