Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Indra (2002)





చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి , ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 24.07.2002



Songs List:



భం భం భోలే శంఖం మొగెలే పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, శంకర్ మహదేవన్

భం భం భోలే శంఖం మొగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే
భం భం భోలే శంఖం మొగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే
తద్దనకదిన దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
తద్దనకదిన దరువై సందడి రేగనీ 
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...

భం భం భోలే శంఖం మొగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే
తద్దనకదిన దరువై సందడి రేగనీ 
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...

భం భం భోలే భం భం భోలే భం భం భోలే భోలే నా
భం భం భోలే భం భం భోలే భం భం భోలే భొలే నా
భోలే నాచే చమక్ చమాచం
భోలే నాచే చమక్ చమాచం
డమరు బాజే డమరు బాజే డమరు బాజే డం ఢమా డం
భోలే నాచే చమక్ చమాచం
భోలే నాచే చమక్ చమాచం

వారణాసిని వర్ణించే నా గీతిక
నాటి శ్రీనాథుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణిక 
అల్లదే అందినాయి చిరుఘుంటిక
దమక దమకాలై ఎద లయలే తీర్ధన చేయగా
యమక ఘమకాలై పదగతులే నర్తన చేయగా
ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా

విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...

కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంతా శివలీల కాదా
ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే 
మన కష్టమే తొలగిపోదా

ధం ధమాధం ధం ధమా ధం ధమా ధం
ధం ధమాధం ధం ధమా ధం ధమా ధం
ధం ధమాధం ధం ధం ధమాధం ధం
ధం ధమాధం ధం ధమాధం ధం ధమాధం ధం ధం ధం

ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే 
చరితలకు అందనిది ఈ కైలాసమే
గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి ఆ శివమహిమ
విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...

భం భం భోలే శంఖం మొగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే
తద్దనకదిన దరువై సందడి రేగనీ 
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
తద్దనకదిన దరువై సందడి రేగనీ 
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...



అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: కల్పన ,  యస్. పి. బాలు

కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ
కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలో

అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ
అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ
బావరో బావర్చీ తినిపించవా మిర్చీ
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి
ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పించీ ఊరంతా తిప్పించి
కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ
కోరుకున్నా నమ్మా కోయంటే పలికాడమ్మ
కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ
డోలు డోలోయమ్మ ఢం డోలు డోలోయమ్మ

అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి

పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్నా
కోలు కోలోయన్న కోలన్న కోలో
మల్లెపూలు చూస్తుంటే మండి పడుతున్నా
డోలు డోలోయన్న డోలన్న డోలో
పిల్ల గాలి వీస్తుంటే చాలు పొమ్మాన్నా
మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా
ఏ రోజుకారోజు నా మోజులెన్నో మరుగుతున్నాయిలే
ఈ రోజు నా రాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలే

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి

బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే
కోలు కోలోయన్న కోలన్న కోలో
అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే
డోలు డోలోయన్న డోలన్న డోలో
బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే
అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే
ఏపూట కాపూట నీ పాట నాదై పలకరించాలిలే
ఈ పూట నీ పైట ఆ చోట వాడే వినను అన్నాదిలే

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి
ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పించీ ఊరంతా తిప్పించి
కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ
కోరుకున్నా నమ్మా కోయంటే పలికాడమ్మ
కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ
డోలు డోలోయమ్మ ఢం డోలు డోలోయమ్మ




రాధే గోవిందా ప్రేమే కుట్టిందా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కులశేఖర్
గానం: చిత్ర, ఉదిత్ నారాయణ్

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా
మృదుమదనా పతినై పరిపాలించనా
చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా

నీ కోసమే పుట్టానని ఊరించకోయ్ వాత్సాయనా
నా కోసమే వచ్చావని వాటేసినా వయ్యారమా
తొలిప్రేమ జల్లులే కురవాలంటా పరువాల పంటలే పండాలంటా
చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ళ జాతరే జరగాలంటా
అరె అకలి వేస్తే సోకులు ఇస్తా సోకులు తోటి షాకులు ఇస్తా
ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా

కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా కిస్స్ మై లిప్స్ అంటూ కవ్వించిందా
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా

అంగాంగము వ్వామోహమే నీ పోందుకై అరాటమే
వదిలేసి నీ మోమాటమే సాగించవోయ్ సల్లాపమే
రతి రాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చేయాలంటా
కసి గువ్వ రెక్కలే రెక్కిందంటా నీ కోసం పక్కలే పరిచిందంటా
అరె మెత్తగా వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా
సిరినే మగసిరితో దోచేస్తా భామా

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా
మృదుమదనా పతినై పరిపాలించనా
చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ




ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, యస్. పి. బాలు

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
హరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా 
ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా

రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపనీ
అన్నెం పున్నెం ఎరగని మా సీమకి రారమ్మని
ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ
తొలిగింది ముప్పు అది నీలి మబ్బు మనసారా నవ్వనీ
చిరుజల్లు మునుపు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ
ఆ శాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా
శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈ వేళ
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా 

భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకరా
ఆకశాన్నే ఇల దించరా కురిసే వానగా
మారని యాతన తీర్చగా మాతల రాతలు మార్చగా
ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంచరా
మహారాజు కాలి సమిదల్లె మారి నిలువెల్లా వెలెగెరా
భోగాన్ని విడిచీ త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా
జనక్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హోమజ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెనురా అమృతములు ఆహ్వానించెనురా
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా 

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
హరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా




దాయి దాయి దామ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె., మహలక్ష్మి అయ్యర్

దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బోమ్మ
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
ఒహో... హో... ఒళ్ళో వాలుమా
ఒహో... హో... వయసే ఏలుమా
నిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మ
తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా

హే దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొడపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ

టక టకమంటు తలపును తట్టి తికమకపెట్టే లుకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా
నిలబడమంటూ నడుముని పట్టి కితకితపెట్టే మగసిరి పట్ట కథ ముదిరితే ఎట్టా
కేరింతలాడుతు కవ్వించలేవా కాదంటే ఇపుడు తప్పేదెలా
అరె కాదంటే ఇపుడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ అపేదెలా
అయ్యె ఏం దుడుకు బాబూ అపేదెలా
ఒహో... హో... కోరిందే కదా
ఒహో... హో... మరీ ఇందిర
మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా
వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా

హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే
పాప గమనించవే మా కొంప మునిగిపోయే

పురుషుడినిట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా సొగసుల బరువా ఓ తుంటరి మగువా
నునుపులు ఇట్ట ఎదురుగ పెట్టా ఎగబడ లేవా తగు జతకావ నా వరసై పోవా
అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియ రానీయవా
ఆ కళ్యాణ ఘడియ రానీయవా
అరె అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా
నీ హితబోధలాపి శృతిమించవా
ఒహో... హో... వాటం వారెవా
ఒహో... హో... ఒళ్లోవాలవా
అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా
సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన

హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చేరిపోయే
అయినా అది కూడా ఏదో కొత్త కొంటే హాయే




అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కార్తీక్, ఉష

( మణిశర్మ గారు అందుబాటులో లేకపోవటంతో ఈ ఒక్క పాటకి ఆర్. పి. పట్నాయక్ గారికి సంగీతం సమకూర్చమని బి.గోపాల్ గారు చెప్పారు ఎందుకంటే జూనియర్ ఎన్. టి. ఆర్ తో అల్లరి రాముడు సినిమా బి.గోపాల్ గారే దర్శకత్వం వహిస్తున్నారు దానికి ఆర్. పి. పట్నాయక్ గారు సంగీతం. ఈ రెండు సినిమాలు వారం రోజులు తేడాతో విడుదల అయ్యాయి అంటే జూలై 18 న అల్లరి రాముడు రిలీజ్ అయితే జూలై 24 న ఇంద్ర రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలకు  బి.గోపాల్ గారే దర్శకత్వం వహించారు, ఆర్తి అగర్వాల్ ఈ రెండూ సినిమాలలో హీరొయిన్)

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో
తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో

సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి
చూపుల సూదులతోటి నా కోకలు గోడలు దాటి
తుంటరి గుంటడు మారను అంటే ఎట్టా వేగేదేంటి
దీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావా చక్కెరకేళి
పైటరాగాల కోటలోకింక చేరవా బ్రహ్మచారి
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో నెరజాణ నెత్తెక్కిందయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో మోమాటం చెట్టెక్కిందయ్యో

అచ్చిక బుచ్చికలాడి నను వెచ్చని తాకిడితోటి
నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది
వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి
ఇద్దరి మద్యన దుప్పటి కడితే ఘోరం కాదా బేబి
చాటుగా వచ్చి చేతి వాటాన చేయ్యవోయ్ ఇంక వన్నెల బోణి
లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో
తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో
అయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో హోయ్

Most Recent

Default