Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Itlu Sravani Subramanyam (2001)




చిత్రం: ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం: చక్రి
నటీనటులు: రవితేజ, తనూరాయ్, సమ్రిన్
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: కె.వేణుగోపాల్ రెడ్డి
విడుదల తేది: 14.09.2001



Songs List:



హేపీడే హేపీడే పాట సాహిత్యం

 
చిత్రం: ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాహితి
గానం: చక్రి

హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే
హేపీడే డె డె ఎవ్రీడే
హొళెలె హొళెలె హొళెలె హొళెలె
హొళెలె హొయ్ ళేలే
అమెరికానే  ఎన్నారై లా ఏలినట్టుందే
అదిగోఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే
ఆయో ఆయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె
అదిగో ఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే
ఆయో ఆయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె
గుండెలలో పండగలే ఈనాడే

హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే
హేపీడే డె డె ఎవ్రీడే

చరణం: 1
ఇటువచ్చి హర్టును తాకి కలిగించె కలవరమే
అటువచ్చి వీనులు సోకి వినిపించె చెలిస్వరమే
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి రాచిలకై నను చేరాలే
మబ్బులు వీడి నింగిని వదిలి నెలవంకై ఇల వాలాలే
ప్రియే జుం జుంజుం జుముకు జుం జుం
పాపం నీకై వేచినదిలే పిచ్చి హృదయం
దైవం ఒక్కడే నావేదన వింటున్నాడే
కనుకే సఖియనే నావద్దకు రప్పిస్తాడే
తొందరలో వచ్చునులే హోలీడే 

హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే
హేపీడే డె డె ఎవ్రీడే

చరణం: 2
నువులేని రాత్రుల్లోన కలిగిందె చలిజ్వరమే
తుదిలేని యాత్రల్లోన కరుణించె కనికరమే
మెరుపై మెరిసి చినుకై కురిసి 
నా మనసే తడిపేసావే
వరదై ఉరికి అలలై ఎగిసి 
నురగై కనుమరుగయ్యావే
ప్రియే  భుం భుం భుం భుమకు  భుం భుం
కలలో నిన్నే దొరికినదిలె నీలినయనం
తిరిగే భూమే సూర్యుడ్ని చుట్టేస్తుందే
పొంగే ప్రణయమే ప్రియురాలిని రప్పిస్తుందే
నువ్వుంటె చిరునవ్వే ఎవ్రీడే

హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే
హేపీడే డె డె ఎవ్రీడే
హొళెలె హొళెలె హొళెలె హొళెలె
హొళెలె హొయ్ ళేలే
అమెరికానే  ఎన్నారై లా ఏలినట్టుందే
అదిగోఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే
ఆయో ఆయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె
అదిగో ఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే
ఆయో ఆయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె
గుండెలలో పండగలే ఈనాడే

హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే
హేపీడే డె డె ఎవ్రీడే...





మళ్ళి కూయవే గువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, కౌసల్య

మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా

మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
విధివరమే నీవేగా నీవేగా...
కలనిజమై పూచేగా పూచేగా..
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా
జువ్వా... జువ్వా...

మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా

సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే
స్మృతి పదమున నీ గానమే
సిరిసిరి మువ్వలా చిరుసడి వింటే
స్మృతి పదమున నీ గానమే
పొంగే పారే ఏటిలో తొంగి తొంగి చూస్తే
తోచెను ప్రియ నీ రూపమే
సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం
కోనేటి కమలం లోలో నీ అరళం
కలత నిదురలో కలలాగ
జారిపోకే జవరాలా
నీలి సంద్రమున అలలాగా
హృదయ లోగిలిలో నువ్వా..
నువ్వా..నువ్వా...

మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా

తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
క్రుంగెను ఎద నీ కోసమే
తీయనైన ఊసుతో ప్రియ విరహముతో
క్రుంగెను ఎద నీ కోసమే
సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులా
తగిలెను నీ మృదు పాదమే
ఎగిసేటి కెరటం చేరేలే తీరం
చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నదిలాగ
తడిపిపో జడివానలా
మంచుతెరలలో తడిలాగా
నయన చిత్తడిలో నువ్వా
నువ్వా..నువ్వా...

మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా
విధివరమే నీవేగా నీవేగా...
కలనిజమై పూచేగా పూచేగా..
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా
జిలిబిలి పలుకుల నువ్వా
దివిలో తారాజువ్వా
జువ్వా... జువ్వా...

మళ్ళి కూయవే గువ్వా
మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా
గుండెలో సవ్వడి నువ్వా 




నీకోసం వేచి వేచి పాట సాహిత్యం

 
చిత్రం: ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: సుధ

నీకోసం వేచి వేచి చూసెను నయనం
కనుమూస్తే కను రెప్పలపై కమ్మని  స్వప్నం
స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపం
ఆరూపం  ఆ సెలయేరై   పోసెను జీవం
వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో  అలలపై

నీ కోసం వేచి వేచి  చూసెను నయనం
కనుమూస్తే కను రెప్పలపై  కమ్మని  స్వప్నం

మండే హృది జ్వాల ఆరిపోవాలా
నన్నువడి చేర్చుకో పాపలా
మది భారంగా మారే భాష్పంగా 
నువ్వు లేకుండ నవ్వేదెలా
వస్తున్న వస్తున్న నీకై నేనేనీవై 
చేస్తున్న నీకై నే గానమె
ప్రియతమా పదిలమా కిరణమై తాకుమా

నీకోసం వేచి వేచి చూసెను నయనం
కనుమూస్తే కను రెప్పలపై  కమ్మని  స్వప్నం

ప్రేమే లోకంలా నేనో శోకంలా 
ఇంత గరళాన్ని దాచేదెలా
చేసేనే దూరం ఎదకు ఆ గాయం 
ఇంక ఎన్నాళ్ళు ఈ వేదనా
ఆ దైవం వేసిందో ఎమో నీతో బంధం 
గుండెల్లో గుప్పున ఎగసె వలపుల బంధం
మేఘమా అందుమా చినుకువై రాలుమా

నీకోసం వేచి వేచి చూసెను నయనం
కనుమూస్తే కను రెప్పలపై  కమ్మని  స్వప్నం
స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపం
ఆరూపం  ఆ సెలయేరై   పోసెను జీవం
వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో  అలలపై





రామ సక్కని బంగారుబొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: సుఖ్విందర్ సింగ్

రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి నువ్వా రూప్ తేరా మస్తానా
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి నువ్వా రూప్ తేరా మస్తానా

స్వీటు స్వీటుగా ఉందీ నాటీ
చేసుకోమరి  సెంట్రీ డ్యూటీ
వలపు కౌగిలే కాదా ఊటీ
సొగసు దాచకే తప్పదు లూటీ 
నీకు తెలియంది నాలో ఏముంది
చెప్పలేను మరి ఏదో దాగుంది

సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా

చూపులోన ఏ మేజిక్కుందో
నవ్వులోన ఏం మ్యూజిక్కుందో
బోయి  ప్లేబోయి నన్నల్లరి చేశాయి
పైటచాటు ఏం లాజిక్కుందో
ఒళ్ళు చూడు ఏం వేడెక్కిందో
బ్యూటీ  నాబ్యూటీ చేసెయ్ నా ఏదోటీ
తైక తైక తక  తైక తైక తక తైక తైక దరువ్ య్
తైక తైక తక తైక  తైక తక తైక తైక తలు పెయ్
కలేసుకుందాం రారో కులాసచేద్దాం యారో
మెలేసుకుందాం రావే సుఖాల తీరం షికారుచేద్దాం
తైర తైర  తక తైర  తైర  తక రామసక్కని

రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా

నడుము ఒంపులో మడతను చూశా
నడకలోని ఆ హొయలను చూశా
రాశి రాకాశి ఊరించకె దయచేసీ
తేనె సంపదా నీదే కాదా 
గండు తుమ్మెదా చేసెయ్ సోదా
ఆరే అజారే తెగ  నచ్చెను నీజోరే

తైకతైక  తక తైక తైక  తక తైక తైక దయచెయ్
తైక  తైక  తక తైక తైక తక తైక  తైక దులిపెయ్

గులాబి అందం భామో గుబాళించుదాం రామ్మో
మిఠాయి పొట్లం తేవే మజాల చేద్దాంరావే
వయారమంతా ఓకే యుగాలనేమో క్షణాలు చేద్దాం

తైరతైర  తక తైర  తైర తక సామిరంగా

రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి నువ్వా రూప్ తేరా మస్తానా

స్వీటు స్వీటుగా ఉంది నాటీ
చేసుకోమరి  సెంట్రీ డ్యూటి
వలపు కౌగిలే కాదా ఊటి
సొగసు దాచకే తప్పదు లూటీ 
నీకు తెలియంది నాలో ఏముంది
చెప్పలేను మరి ఏదో దాగుంది

సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా




ఏమో ఏమౌనో పాట సాహిత్యం

 
చిత్రం: ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాహితి
గానం: చక్రి

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట
ఏది ఏమైనా హొపే మనుకుంటే
ఎంతో హేపీ కాదా ఈ లైఫంతా

లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా (3)

పూచే పూగంధాలు హయి ఆనందాలు 
అన్నీ ఈ లోకంలో లేవా
ప్రేమే నీలో ఉంటే భూమే చుట్టేయ్ గలవు  
గువ్వై ఆ ఆకాశంలోన
తెలిసిందొకటే మనకీ లైఫ్ ఏఇఏ
కంకం అంటు వెల్కంచెప్పు ఏఇఏ
ఫలితం ఏమి ఐనాగాని చెయ్యాలోయ్ ప్రయత్నం
ఫెయిల్యూర్  సక్సస్ రెండూ కలిసిన పండేగా ఈ జీవితం 

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట

ఏదీ కష్టం కాదు ఏమీ నష్టం లేదు
లైఫ్ నే స్పోర్టివ్ గా ఫీలయితే
ఎంత ప్రోబ్లమ్ ఐనా ఎంతో సింపుల్ కాదా 
లైఫ్ లో ఓ గోల్ నీకుంటే
నలుసే పడితే కళ్ళల్లోన ఏఇఏ
కళ్ళేపీకితె వైద్యం ఔన ఏఇఏ
ఫెయిలైనోళ్ళు  ఫెయిలైనట్టు 
ఫేర్ వెల్ చెబితె లైఫ్ కి
అందాల ఈ లోకంలోన అడ్రస్సుండదు ఎవ్వరికీ

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట
ఏది ఏమైనా హొపే మనుకుంటే
ఎంతో హేపీ కాదా ఈ లైఫంతా

లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా
లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా
లైఫ్ ధ్రిల్ డోంట్మిస్...




పిల్లో పిసినారి పిల్లో పాట సాహిత్యం

 
చిత్రం: ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాహితి
గానం: కౌసల్య, కుమార్ సాను

పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా
పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా
పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా
ఓసారి నువ్వే ఒళ్ళోకి వస్తే 
తరుగేమి అవుతాదే నీతాత ముల్లె
బావో అయ్యెబావో ఓ బావో బద్మాషుబావో
నీ ఏషాలు నాకాడగావో
సందిస్తె వస్తావు నా ఎంట పడతావు 
సందేళ సీమల్లే కుట్టెసిపోతావు

పిల్లో ఓ పిల్లో     
బావో  బావా

పున్నాల ఎన్నెలలోన తానాలు ఆడేటి యేల
ఆ సున్ని పిండల్లే జాణా నీ ఒళ్ళు నేనంటుకోనా
జల్లల్లె సల్లంగ మొన్న రొయ్యల్లె సెయ్యెట్టి నిన్న
గిల్లితె నాబుగ్గ పైన అల్లాడిపోతిని కానా
రాగాల నావ నువ్వయితే నీకు రంగేళి తెరసాప కానా
రాకయ్యో మీద పడకయ్యో కోరమీసాల సొరచాప లాగా
వయ్యరి కడవా ఓ పూల పడవా వలయేస్తే పరిగల్లె నా ఒళ్ళో పడవా

బావో అయ్యె బావో ఓ బావో బద్మాషుబావో
నీ ఏషాలు నాకాడగావో
ఆ పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దుయ్యరాదే పిల్లా

హైలెస్సా కెరటాల మీన తెలతెల్ల నురుగల్లెరానా
లేలేత కలువాలు అయినా నీ పాదాలు ముద్దాడుకోనా
ముద్దాస ఎరవేస్తు వున్నా బుద్దింక ఎరగానిదైనా
సిన్నారి సిరపక్కెనేనా నీ గాలంకి నేచిక్కుతానా
ఎందుకే కన్నుగీటితే బెదురు పీతల్లే దూరేవు కలుగూ
ఒంటిగా సేత సిక్కితే పైడి ఒంటికి పెడతావు నలుగూ
నువ్వొప్పుకున్నా తప్పించుకున్నా 
నీ కొప్పుపూనేనే కొరమీనకూన
బావో అయ్యే బావో ఓ సింగారి బావో నీమనసే బంగారంలేవో
హెయ్ బావో సింగారి బావో నీ మనసే బంగారం  లేవో

బావొ సింగారి బావో నీ మనసే బంగారం  లేవో
ఓ తాళి కడితే  నీ దాన్ని అవుతా మనువాడి నీకే ముద్దిచ్చుకుంటా

పిల్లో - ఓ - పిల్లో
ఎయ్ బావో బావా

బావ - ఆహ
బావోయ్ - ఓహొ
బావో బావ
హ హ హా
ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల...


Most Recent

Default