చిత్రం: జీన్స్ (1998) సంగీతం: ఎ.ఆర్.రెహ్మాన్ నటీనటులు: ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ దర్శకత్వం: ఎస్.శంకర్ నిర్మాత: ఏ. యమ్.రత్నం విడుదల తేది: 24.04.1998
Songs List:
హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా పాట సాహిత్యం
చిత్రం: జీన్స్ (1998) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: ఏ.ఎం.రత్నం, శివగణేష్ గానం: ఎస్. పి. పల్లవి, ఉన్నికృష్ణన్ నాకే నాకా - నాకే నాకా నువు నాకే నాకా - ఉఁ నాకా మధుమిత మధుమిత మధుమిత హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫాక్స్ లొచ్చిన స్నిగ్దవిక నాకే నాకా ముద్దుల వానలో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా నిన్ను నేను కప్పుకునేనా పెదవిపైనే పవళించేనా పట్టుపువా పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వమ్మా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా కలసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రని తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం మనప్రేమనే కవి పాడగా షెల్లీకి భైరన్ కు సమాధి నిద్దర చెడగొడతాం నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే కోటి యుగాలైనా గానీ ప్రేమకు మాత్రం వయసైపోదు హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) చెర్రీ పూలను దోచేగాలీ చెవిలో చెప్పెను ఐ లవ్ యూ సైప్రస్ చెట్లలో దావుద్ పక్షి నాతో అన్నది ఐలవ్ యూ నీ ప్రేమనే నువ్వు తెలుపగా గాలులూ పక్షులూ ప్రేమ అర్ధమై కుమిలిన వేళ ఒంటి గాలిలో పూవే నిలిచెను నీ కురులలో నిలిచెందుకే పూబాలవో పువ్వెట్టగా చిందె చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా నేనూ నిన్నూ ముద్దాడనా పెదవి నవ్వుల నిలిచినను ప్రాణముండును ఒక నిముషం ప్రియా నువ్వు నన్ను వీడితే మరుక్షణముండదు నా ప్రాణం హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) పాకెట్ సైజు వెన్నెలలు నీకే నీకు ఫాక్స్ లొచ్చిన స్నిగ్దవిక నీకే నీకు నిన్ను నేను కప్పుకునేనా పెదవిపైనే పవళించేనా ముద్దుల వానలో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా పట్టుపువా పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వమ్మా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2)
కోలంబస్ కోలంబస్ పాట సాహిత్యం
చిత్రం: జీన్స్ (1998) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: ఏ.ఆర్. రెహమాన్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి... మామోయ్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి శలవు శలవు శలవు కనుగొను కొత్తదీవి నీవు (2) కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు మామోయ్ ఆనందంగా గడపడానికి కావాలొక దీవి శలవు శలవు శలవు కనుగొను కొత్తదీవి నీవు (2) శని ఆది వారాల్లేవని అన్నవి ఓ మనుషుల్ని మిషన్లు కావొద్దన్నవి చంపే సైన్యము అణు ఆయుధం ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్ పొల్యూషన్ ఏమీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా కోలంబస్ వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం వీచే గాలిగ మారి పూలను కొల్లగొట్టు మనసును చక్కబెట్టు మళ్ళీ పిల్లలవుదాం మొదలంట ఆడి పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగీ పైకెగురూ పక్షులకెన్నడూ పాస్ పోర్ట్ లేదు ఖండాలన్నీ దాటెళ్ళు నేడు విరామమేదో వద్దు అయినా విశ్రమించలేదు నేడు నిర్వాణ చేపలల్లే ఈదుదాం కోలంబస్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు కోలంబస్ ఆనందంగా గడపడానికి కావాలొక దీవి శలవు శలవు శలవు కనుగొను కొత్తదీవి నీవు (2) కోలంబస్ హైలస్సా... హైలెస్సా... (3) ఏ ఏ హైలెస్సా ఏ ఏ హైలెస్సా (4) నడిచేటి పులనకొంచెం చూడు నేడైనా మడిమణిగాను లవ్వరైతే మేలు అల నురుగులు తెచ్చి చెలి చీరే చెయ్యరారాదా నెలవంకను గుచ్చి చెలి మెడలో వెయ్యరారాదా వీకెండు ప్రేయసి ఓకె అంటే ప్రేమించు టైమ్ పాస్ంగ్ ప్రేమలా పూటైన ప్రేమించు వారం రెండునాళ్లు వర్ధిల్లగా కోలంబస్ కోలంబస్ కోలంబస్ ఇచ్చారు శలవు ఆనందంగా గడపడానికి కావాలొక దీవి కోలంబస్ శలవు శలవు శలవు కనుగొను కొత్తదీవి నీవు కోలంబస్ శలవు శలవు శలవు కనుగొను కొత్తదీవి నీవు కోలంబస్
పువ్వుల్లో దాగున్న పాట సాహిత్యం
చిత్రం: జీన్స్ (1998) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత, ఉన్నికృష్ణన్ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలె అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగ అతిశయం ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలె అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం తారార రారార తారార రారార తారార రారార రా ఓ తారార రారార తారార రారార తారార రారార రా ఓ ఏ వాసనలేని కొమ్మలకి సువాసన కలిగిన పూలున్నాయి పూలవాసనతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘంలొ ఒక చిటికెడైన ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపంలా వెలిగేటి మిణుగురులతిశయమే తనువున ప్రాణం ఏచోట నున్నదో ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగ అతిశయం ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలె అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం అల వెనెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొస్తే నీవే నా అతిశయము జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పువ్వొ నువ్ ఎనిమిదవ అతిశయము నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు తేనేలూరె అధరాలు అతిశయమే మగువ చేతి వేళ్ళు అతిశయమే మకుటాలంటి గోళ్ళు అతిశయమే కదిలే ఒంపులు అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగ అతిశయం ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలె అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం తారార రారార తారార రారార తారార రారార రా ఓ తారార రారార తారార రారార తారార రారార రా ఓ
కన్నులతో చూసేవీ పాట సాహిత్యం
చిత్రం: జీన్స్ (1998) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: నిత్యశ్రీ పాపమ పనిపమ పనిపమ గమపా సగసని పనిపమ గమగసగమపా పాపమ పనిపమ పనిపమ గమపా సగసని పనిపమ గమగసగమపా తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తక ఝం తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తక ఝం కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ ఇక నన్ను విడిపోలేవూ తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తక ఝం తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తక ఝం చరణం: 1 జలజల జలజల జంట పదాలు గలగల గలగల జంట పెదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్‌తాని తొందిరతాని దినతోం (2) రేయీ పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్లు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తక ఝం తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్ తకడ తకడ తకధిమ్ తక ఝం చరణం: 2 క్రౌంచ పక్షులు జంటగ పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును విడలేవూ వీడిమనలేవూ కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రెండోదేడ్చును పొంగేనా ప్రేమే చిందేనా ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్‌తాని తొందిరతాని దినతోం (2) ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను కంటున్నాం ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం తాళికొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం కన్నులతో చూసేవీ గురువా మమగగ మమసస గగసస గగనిని సగగ సమమ సగగ సపప సగగ సనిని సగసస సానిదపమగా గమపని సగా రిసా సానిదపామగరి సగమ కన్నులతో చూసేవీ గురువా పపనినిసాస గగమమ పపనిని సాస నిసగమపని దపమా గామ పని సగరిద నిసమగరిసనిద కన్నులతో చూసేవీ గురువా... రీరీ సనిస రిరిస సరిరినిని సాస గరిస నిసగరిసని దప పాప నిదప మగసరి నిసగా సగమ గమపా నిదపప మపనీ పపని సగరిస గరిసని సానిదపామా గమపమ కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ ఇక నను విడిపోలేవూ
రావేనా చెలియా పాట సాహిత్యం
చిత్రం: జీన్స్ (1998) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: హరిణి, సోను నిగమ్ మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే | పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి మమతకు నువ్వు ప్రతిబింబం తల్లికన్నా గారాబం చిననాటి అనురాగం వయసైతే అనుబంధం ఏ అవ్వా నా గువ్వా నువ్వింకా అందం దోచెయ్యి రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి జీన్స్ పాంటు వేసుకో లిఫ్ స్టిక్కు పూసుకో నిజమైన తలనెరుపు డై వేసి మార్చుకో... యే... ఓలమ్మో ఏమి చోద్యం నా వయసే సగమాయే క్లింటన్ నంబరు చేసిస్తాను గలగమంటూ ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు మిస్ ఓల్డని చెప్పేయి - ఓయే రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి ఓ ఓ ఓ కంప్యూటర్ పాటలకు పులివేషం నువ్వాడు ఎంటీవీ చానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు టూ పీసు డ్రస్ వేసి సన్ బాతూ చెయ్ బామ్మా... డిస్నీలాండులో కళ్ళాపి జల్లి బియ్యపుపిండితో ముగ్గులు వేద్దాం రాబామ్మా రోడ్డు మద్యలో కొట్టేపెట్టి గారెలు వేసి అమ్ముదామా రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి మమతకు నువ్వు ప్రతిబింబం తల్లికన్నా గారాబం చిననాటి అనురాగం వయసైతే అనుబంధం రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి ఓయే వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి
ప్రియా ప్రియా చంపోద్దే పాట సాహిత్యం
చిత్రం: జీన్స్ (1998) సంగీతం: ఎ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: శ్రీనివాస్ ఆహా హా... ఆఆ...ఆఆఅ (2) ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోద్దే ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే చెలియా నీదు నడుమును చూశా అరెరే బ్రహ్మెంత పిసనారి తలపైకెత్తా కళ్ళు తిరిగిపోయే ఆహా అతడే చమత్కారి మెరుపును తెచ్చి కుంచెగ మలచి రవివర్మ గీసిన వదనమట నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమటా అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమటా ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే అందమైన పువ్వా పువ్వా చెలి కురుల సురభి తెలిపేవా అందమైన నదివే నదివే చెలి మేని సొగసు తెలిపేవా అందమైన గొలుసా గొలుసా కాలి సొగసు తెలిపేవా అందమైన మణివే మణివే గుండె గుబులు తెలిపేవా ఆఆ...ఆఆఅ... ఆఆ...ఆఆఅ... (2) చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకొక ఇల్లుకడతా నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా ఆహా హా... ఆఆ...ఆఆఅ మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి నిను జో కొడతా నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా పంచవన్నె చిలక జలకాలాడగ మంచుబిందువులె సేకరిస్తా దేవత జలకాలాడిన జలమును గంగా జలముగ సేవిస్తా ప్రియా ప్రియా చంపోద్దే ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోద్దే ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే... ఆహా హా... ఆఆ...ఆఆఅ (2)