చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి నటీనటులు: మనోజ్ మంచు, మోహనబాబు మంచు, తాప్సి పన్ను దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: లక్ష్మీ మంచు విడుదల తేది: 01.07.2010
Songs List:
సరిగమపదని పాట సాహిత్యం
చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేదవ్యాస్ గానం: యస్.పి.బాలు సరిగమపదని
లాలి పాడుతున్నది పాట సాహిత్యం
చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యస్.పి.బాలు, గీతమధురి, బాలాజీ, దీపు లాలి పాడుతున్నది ఈ గాలి ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి లాలి పాడుతున్నది ఈ గాలి ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి ఏలో యాలా ఏలో యాలా హైలెస్సో హైల పట్టు హైలెస్సా బల్లాకట్టు హైలెస్సా అద్దిర బాబు హైలెస్సా అక్కడ పట్టు హైలెస్సా సన్నాజాజి చీరకట్టి సిన్నాదొచ్చి హైలెస్సా కన్నూగొట్టే హైలెస్సా... తన్నానన్న తన్నన తన్నానన్నా హైలెస్సా చరణం: 1 గాలి కొసల లాలి ఆ పూల తీవెకు వేలి కొసల లాలి ఈ బోసి నవ్వుకు బుడి బుడి నడకలకు భూమాత లాలి ముద్దు ముద్దు పలుకులకు చిలకమ్మ లాలి ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మ లాలి కుహుఁ... కుహుఁ... చెంగు చెంగు గంతులకు చందమామలు దాగివున్న కుందేలమ్మ లాలి నా లాలి నీకు పూలపల్లకి అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి ఏమేమి పూవొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పూవొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి సెటు మీద ఆట చిలకల్లారా పాట చిలకల్లారా కలికి చిలకల్లారా కందుమ్మ గడ్డలు కలవారి మేడలు ముత్యప్పు గొడుగులు మురిపాల మురుగులు రంగు రుద్రాక్షలు తీరు గోరెంటలు తీరు రుద్రాక్షలు పరుగుల కట్టలు ఏమేమి పూవొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ చరణం: 2 వెన్నముద్ద లాలి చిన్నారి మేనికి గోరుముద్ద లాలి బంగారు బొమ్మకి ఓనమాలు పలికితే పలకమ్మ లాలి బాలశిక్ష చదివితే పలుకులమ్మ లాలి దినదినము ఎదుగుతుంటే దినకరుని లాలి పదుగురొచ్చి నిను మెచ్చితే కన్నులారా చూసే తల్లికి కడుపు తీపి లాలి నా లాలి నీకు పూలపల్లకి అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి లాలి పాడుతున్నది ఈ గాలి ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి
గోవిందా గోవిందా పాట సాహిత్యం
చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేదవ్యాస్ గానం: యస్.పి.బాలు గోవిందా గోవిందా
ఏం సక్కగున్నవ్ రో పాట సాహిత్యం
చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: అరుణ్ గర్వార, చైత్ర ఏలోరే.. ఏలోరే... ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో ఏం సక్కగున్నవ్ రో నా సొట్ట సెంపలోడ ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే రెక్కలు నాకుంటే నేను సుక్కలో ఉన్నట్టే ఫక్కున నువు నవ్వితే ముత్యాల్ వజ్రాల్ వైడూర్యాలు ఏరుకుంటాలే మెళ్ళో ఏసుకుంటాలే ! ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా చరణం: 1 చీర కొంగులో నన్ను కట్టుకో బొడ్డు లోపలా నన్ను దోపుకో పూల దస్తిలో నన్ను పెట్టుకో రైక లోపల నన్ను దాచుకో ఓహో ఎర్రని రిబ్బెన పువ్వల్లే చేసి నల్లని కొప్పున నన్ను చుట్టుకో కొప్పున చుట్కుంటే లోకం చూస్తదీ ఆహా రైకల పెట్కుంటే గిలిగిలైతదీ ఆహా బొడ్డుల దోప్కుంటే మోసమైతదీ అమ్మొ మోసమైతదీ ఏదో పోనీ అని వంటిగొదిలితే ఏస్కపోతరేమో నా ఈడు ఆడోళ్ళు ! సక్కగున్నవ్ రో ఏం సక్కగున్నవ్ రో నా సొట్ట సెంపలోడ ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ చరణం: 2 పచ్చనాకులా పళ్ళెం పెట్టుతా వేడి వేడిగా బువ్వ వడ్డిస్తా ఆవకాయలో నెయ్యి కల్పుతా ముద్దు పెడితె నే ముద్ద తింపిస్తా అబ్బొబ్బొ తినుకుంటా నా ఏలు కొరికితే మబ్బుల్లో సెంద్రయ్య సిగ్గు సెందాడా గోరింటా ఆకులు ముద్ద నూరుతా కాళ్ళకూ వేళ్ళకూ నేనే అద్దుతా పాదాల దగ్గరనే సేద తీరుతా ఆహా సేద తీరుతా తెల్లవారంగానే నేనే కడుగుతా నీ కాలి మెరుపులో పొద్దుపొడుపునే చూస్తా సక్కగున్నవ్ రో నా సొట్ట సెంపలోడ ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా ఏలోరే... ఏలోరే... ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో
సన్నాయి మ్రోగింది పాట సాహిత్యం
చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యస్.పి.బాలు, సునీత, మాళవిక , చైత్ర అంబడిపూడి సన్నాయి మ్రోగింది
దేశమంటే మట్టి కాదోయ్ పాట సాహిత్యం
చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి.బాలు పల్లవి: దేశమంటే మతం కాదోయ్.. గతం కాదోయ్ అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే.. చరణం: 1 గడ్డి నుండీ గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్ చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్ రాజధానుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్ అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్.. పరిథి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్ సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్.. ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్ దేశమంటే... దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ చరణం: 2 ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు హిసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు క్రోథమెందుకు కరుణపంచు స్వార్థమెందుకు సహకరించు పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు మల్లెపువ్వుల లాంటి బాలల తెల్లకాగితమంటి బ్రతుకులు రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు కొత్త బంగరు భవిత నేడే కానుకందించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమంటే... దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే... దేశమంటే మనుషులోయ్
నిగ్రహం పాట సాహిత్యం
చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: రంజిత్ నిగ్రహం
బాలామణి బాలామణి పాట సాహిత్యం
చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: కార్తీక్, శివాణి బాలామణి బాలామణి
ఎంత ఎంత ఎంత చూడనూ పాట సాహిత్యం
చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: కృష్ణ చైతన్య, సునీత ఎంత ఎంత ఎంత చూడనూ ఎడమ కుడి ఎటేపు చూడను రెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ అరెరెరెరే.. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా అరెరెరెరే... ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా ఎంత ఎంత ఎంత చూడనూ ఎడమ కుడి ఎటేపు చూడను చరణం: 1 చేతికేసి చూస్తే చెంపగారు సిద్దం నిదురు చూస్తే పెదవిగారు పలికె స్వాగతం అడుగుకేసి చూస్తే జడలు చేసె జగడం మెడను చూస్తె నడుముగారు నలిగె తక్షణం అరెరెరెరే... చూడకు తెగ చూడకు తొలి ఈడుకు దడ పెంచేయకూ అరెరెరెరే... ఆపకు నను ఆపకు కనుపాపల ముడి తెంచేయకూ ఎంత ఎంత ఎంత చూడనూ ఎడమ కుడి ఎటేపు చూడను చరణం: 2 పైన పైన కాదూ లోన తొంగి చూడూ మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం కళ్ళతోటి కాదు కౌగిళ్ళతోటి చూస్తే వయసు మనకు తెలుపుతుంది వలపు వాస్తవం అరెరెరెరే... చూపులు మునిమాపుగ మన రేపుగ ఇక మారాలిగా అరెరెరెరే... రేపటి మన కలయికలను ఇప్పటి కల చూపిందిగా