Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Josh (2009)




చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: నాగ చైతన్య, కార్తీక
దర్శకత్వం: వాసు వర్మ
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 05.09.2009



Songs List:



డీరి డీరిడీ బీ రెడీ పాట సాహిత్యం

 
చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సందీప్ చౌతా, కునాల్ గంజ్ వాలా

ఓయ్ ఓయ్ వయసుకి తోవ చెప్పకొయ్ రైటో లెఫ్టో 
ఓయ్ ఓయ్ మనసుకు తోచినట్టు చెయ్ ఓయ్ ఓయ్ 
ఓయ్ ఓయ్ వయసుకి తోవ చెప్పకొయ్ రైటో లెఫ్టో 
ఓయ్ ఓయ్ మనసుకు తోచినట్టు చెయ్ ఓయ్ ఓయ్ 

ఎన్నాళ్ళు వొళ్ళో వుంటాం పసిపాపలల్లె 
భూమ్మీద పాదం పడకుండా 
ఎన్నాళ్ళు బళ్ళో వింటాం బెంచీలమల్లే 
బూజెత్తి పోదా బ్రైనంతా

డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి 
దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి (2)

జోష్… జోష్… జోష్…. 

చరణం: 1 
కళ్ళుండేం లాభం కాలాన్నేం చూస్తాం 
క్లాస్రూంలో బ్లాకుబోర్డై చూస్తుంటే 
కాళ్ళుండేం లాభం కదలము యేమాత్రం 
కాలేజీ ఖైదీలై పడి వుంటే 
పాతికేళ్ళకీ పూర్తి కాని ఈ పుస్తకాలతో ఎదురీత 
ఎందుకంటె యెం చెప్పగలవు బేటా 
జీవితాన్నెలా దాటగలవురా సొంత అనుభవం 
లేకుండా అందుచేత ఇది మాయలేడి వేటా 
చెప్పిందెలాగా వినరు ఈ కుర్రకారు 
అయినా మరెందుకు ఈ పొరు 
ఉప్పెనను ఆపేదెవరు పారా హుషారు 
మీకే ప్రమాదం మాస్టారు 

డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి 
దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి (2)

చరణం: 2 
ఉరికే వేగంతొ ఊహాలొకం లో 
ఊరేగె ఊత్సాహం మా సొంతం 
ఆపే హద్దులతో సాగే యుధ్ధంలో 
సాధించే స్వాతంత్రం మాకిష్టం 
నరనరాలలో ఉడుకుతున్నదీ నిప్పుటేరులా యువరక్తం 
నివురు చాటుగా నిద్దరొదు నిత్యం 
నీతిగోలతో నోటిగాలితో ఆపలేరుగా ఏ మాత్రం 
తెలిసి తెలిసి అసలెందుకంత పంతం 
ఓ ఈ జొష్ సాధ్యం కాదా సుడిగాలి లాగ 
కామోష్ అవడం మర్యాదా 
మా ఫోర్సు క్రైమవుతుందా బోఫోర్సు లాగా 
శాబాషు అనుకోడం రాదా 

డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి 
దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి (2)

With josh if u not had enough 
u can get high enough 
Say josh if u not had enough 
u can get high enough 





నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నిప్పుడు చూస్తే చాలు 
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు 
మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీ లీలా
బాల్యాన్నే రప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు 
చిత్రంగా నీవైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు 
నీలాగా నలువైపులా
భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసీ
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నువ్వేం చూస్తున్నా ఎంతో వింతల్లే అన్నీ 
గమనించే ఆశ్చర్యమా
యే పనిచేస్తున్నా ఏదో ఘనకార్యం లాగే 
గర్వించే పసిప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా
చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నిప్పుడు చూస్తే చాలు 
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
కాలాన్నే తిప్పేసిందీలీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా
 
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు




జిగిజిక్క జిగిజిక్క జిక్కా (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: చంద్రబోస్
గానం: చంద్రబోస్

జిగిజిక్కా జిగిజిక్కా జిక్క జిక్క జిగిజిక్కా జిగిజిక్కా జిక్క
జిగిజిక్కా జిగిజిక్కా జిక్క జిక్క జిగిజిక్కా జిగిజిక్కా జిక్క

చూడండి కాలేజీ మేడ చుట్టూ పోరీలే ఉంటారు ఈడ
చూడండి కాలేజీ మేడ చుట్టూ పోరీలే ఉంటారు ఈడ
కాంటీన్ లో తాగొచ్చు సోడా లంచ్ పీరియడ్ లో వెయ్యోచు బీడా

కుర్చీల బెంచీల నీడ కునుకేదో తీయొచ్చు తొడ
ఇంట్లోనా పేరెంట్స్ తేడా ఈ సోట చెయ్యొచ్చు పీడా
ఘానాలకి భాజాలకి కాఫీ లకి కూపీలాకి నాకారాలకి
బకరాలకి జగడాలకి జల్సాలకి

దునియా లో ఇది మంచి అడ్డా దూము దాము చేసుకోరా బిడ్డ

జిగిజిక్కా జిగిజిక్కా జిక్క జిక్క జిగిజిక్కా జిగిజిక్కా జిక్క





ఆవారా హవా పాట సాహిత్యం

 
చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్యారావు

పల్లవి: 
నువ్వెళ్ళని చోటుంటుందా 
నువ్వెరుగని మాటుంటుందా 
గాలి నన్ను రానీ నీ వెంటా 
నువు చూసొచ్చిన ప్రతి వింతా 
నేనెవ్వరికీ చెప్పొద్దా 
నీ ఊసులనే ఊకొడుతూ వింటా 
ఒక్క చోట నిలవొద్దు అంటూ 
తెగ తరుముతున్న ఈ ఉత్సాహం 
దారి కోరి నిన్నడుగుతుంది స్నేహం 

ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా 
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా (2)

నువ్వెళ్ళని చోటుంటుందా 
నువ్వెరుగని మాటుంటుందా 
గాలి నన్ను రానీ నీ వెంటా 

చరణం: 1 
వేళాపాళా గోళీ మార్ విసిరేసా చూడు వాచీని 
అప్పుడప్పుడు నవ్వుదామా టైం టేబుల్ వేసుకుని 
దాగుడుమూత దండాకోరు ఎవ్వరికి జాడచెప్పమని 
ఇట్టే తప్పించుకోమా ఆపేసే చూపుల్నీ 
పట్టకంటు పట్టించుకోని పాటల్లె సాగనీ పొద్దంతా 
ఒద్దు అంటూ ఆపేది ఎవ్వరంటా 
కాటుకపిట్టల్లా కళ్ళెగిరి వాలిన చోటల్లా 
ఎన్ని వర్ణాలో చూడిల్లా తెలుగు పోగుల్లా

ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా 
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా 

చరణం: 2 
కిటికీ లోంచి చూడాలా కదిలెళ్ళే అన్ని ఋతువుల్ని 
చెయ్యారా తాకరాదా వేకువని వెన్నెల్ని 
గుమ్మం బయటే ఆపాలా ఎదురొచ్చే చిన్ని ఆశలని 
గుండెల్లో చోటులేదా ఊరించె ఊహలకి 
పంజరాన్ని విడిపించుకున్న బంగారు చిలకనై ఈ పూట 
ఎగిరి ఎగిరి ఆకాశమందుకుంటా 
ఎల్లలు ఆగేనా అల్లరిగ దూకే వేగేనా 
అదుపులో ఉంచె వీలేనా నన్ను నేనైనా 

ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా 
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా 

నువ్వెళ్ళని చోటుంటుందా 
నువ్వెరుగని మాటుంటుందా 
గాలి నన్ను రానీ నీ వెంటా (2)




I am a bad bad boy పాట సాహిత్యం

 
చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బెన్నీ దయాల్, రంజిత్

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే 
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా 
ఏ పనైనా చెయ్యాలంటే నిర్ణయం నీదవ్వాలంతే 
నిప్పు నైనా నేర్పుగ దాటే యవ్వనం నీదిరా 
బీ కేర్ ఫుల్ మాటలో అర్ధమేం వున్నా గాని 
నీలో ఫియర్ లేదనీ అందరూ చూడని 
లేలో డియర్ ఇప్పుడే ఎదురయేఅవకాశాన్ని 
నౌ ఆర్ నెవెర్ తెలుసుకో సత్యాన్ని 
I am a bad bad boy, bad bad boy 
I am a bad bad boy 
I am a bad bad boy, bad bad boy 
అని ఎవరు అనుకొనీ 

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే 
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా 

చరణం: 1 
లోకమెంతో పెద్దది కాదుర పొల్చుకుంటే చిన్నదే చూడర 
చీకటి లేని వేకువ రాని చోటసలెక్కడ వున్నది సోదరా 
ఇష్టమైతే సమ్మర్ హీట్ చల్లగ అనిపిస్తుంది 
నచ్చకుంటే చంద్రుడి లైట్ నల్లగా కనిపిస్తుంది 
ఏదో ట్రబుల్ ఉండదా స్వర్గలొకంలో ఐనా 
డైలీ స్ట్రగుల్ తప్పదే ఎక్కడున్నా 
I am a bad bad boy, bad bad boy 
I am a bad bad boy 
I am a bad bad boy, bad bad boy 
అని ఎవరు అనుకొనీ 

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే 
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా 

చరణం: 2 
లైఫనేది చిన్నది కాదుర బౌండరికి అది అందదు సోదరా 
నిన్నలాగే వుండదు నిత్యం రేపు అన్నది సరికొత్త ఉగాదిరా 
ఎప్పుడైనా గెలుపును గెలిచే చాన్సు నీకూ ఉన్నదిరా 
గాయమైనా హాయనుకుంటే సమరమైనా సరదారా 
ఏ రొజు ను అడగదా జీవితం నా సిగ్నేచర్ 
ఏ హిస్టరీ చదవదా నా చాప్టర్ 
I am a bad bad boy, bad bad boy 
I am a bad bad boy 
I am a bad bad boy, bad bad boy 
అని ఎవరు అనుకొనీ

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే 
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా 
ఏ పనైనా చెయ్యాలంటే నిర్ణయం నీదవ్వాలంతే 
నిప్పు నైనా నేర్పుగ దాటే యవ్వనం నీదిరా 




అన్నయ్యోచ్చినాడో (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: చంద్రబోస్
గానం: దిల్ రాజు

పేర పేర మీసం తోటి గర గర గర గడ్డం తోటి
పీడీ పీడీ పిడికిళ్లతోటి పొడి పొడి చేసే అడుగులతోటి

అన్నయోచినాడో యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో
అన్నయోచినాడో హుల్చల్ చిందుల్ తెచ్చినాడో

అన్నయ్య చుపెయ్ పన్నీరు అన్నయ్య మాటెయ్ దిల్దారు
అన్నయ్య మనసెయ్ బంగారు అన్నయ్య నడిచే సర్కారు

అన్నయ్య మనకై పుట్టారు అడుగు అడుగున వెన్నె తట్టారు

అన్నయోచినాడో యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో
అన్నయోచినాడో హుల్చల్ చిందులు తెచ్చినాడో
ఒహ్హ్ యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో హుల్చల్ చిందుల్ తెచ్చినాడో

ఒహ్హ్ యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో హుల్చల్ చిందుల్ తెచ్చినాడో




ఎవ్వరికీ కనపడదే పాట సాహిత్యం

 
చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాహుల్ విద్యా, ఉజ్జయిని ముఖర్జీ

పల్లవి: 
ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం 
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం 
కనకే... అపురాపం కలిగే... అనురాగం 

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం 
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం 
కనకే... అపురాపం కలిగే... అనురాగం 

అనుపల్లవి: 
ఎదలోనే కొలువున్నా ఎదురైనా పోల్చలేక 
నిజమేలే అనుకున్నా రుజువేది తేల్చలేక 
మరెలా... ఆ... ఆ... ఆ... 

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం 
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం 

చరణం: 1 
దారి అడగక పాదం నడుస్తున్నదా 
వేళ తెలుపక కాలం గడుస్తున్నదా 
తడి ఉన్నదా... ఎదలో తడిమి చూసుకో...
చెలిమిగ అడిగితే చెలి చెంత 
చిలిపిగ పలకదా వయసంతా 
జతపడు వలపులు గుడిగంట 
తలపుల తలుపులు తడుతుందా 
చూస్తూనే పసికూన ఎదిగిందా ఇంతలోన 
చెబితేనే ఇపుడైనా తెలిసిందా ఈ క్షణాన 
అవునా... ఆ... ఆ... ఆ... 

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం 
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం 

చరణం: 2 
కళ్ళు నువ్వొస్తుంటే మెరుస్తున్నవి 
వెళ్ళివస్తానంటే కురుస్తున్నవి
కొన్నాళ్ళుగా నాలో ఇన్ని వింతలు ఓహో 
గలగల కబురులు చెబుతున్నా 
వదలదు గుబులుగ ఘడియైనా 
మది అనవలసినదేదైనా పెదవుల వెనకనె అణిగేనా 
హృదయంలో వింత భావం పదమేదీ లేని కావ్యం 
ప్రణయంలో ప్రియ నాదం వింటూనే ఉంది ప్రాణం 
తెలుసా... ఆ... ఆ... ఆ... 

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం 
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం 





మే మే మేక (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: చంద్రబోస్
గానం: చంద్రబోస్

మే మే మేక (Bit Song)




కాలేజీ బుల్లోడా పాట సాహిత్యం

 
చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగంజ్

కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా
స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా

ఓయ్ కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా
స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా
ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా

ఉన్నదంతా ఓడినా పుడింగువేరా ఒరేయ్ నువ్వు పుడింగువేరా

కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా
స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా

చదువులన్ని మూల పెట్టి పుస్తకాలు మూట కట్టి
సిగరెట్ చేత పట్టి చింపాంజీ ఫోజ్ పెట్టి

రంకెలు వేస్తావు రాగ్గింగులు చేస్తావు
రోతగా చూస్తావు బూతు జోకులేస్తావు

రమేశా అరె రాధా రమేశా

నీ ఫ్యూచర్ పంక్చర్ అయినా రమేశా
ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతాది రామేషో రమేశా
కాలేజీ

కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా
స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా

అన్న అన్న అంటూ నువ్వు అన్న వెనుక ఉంటావు
అన్న ఒక్క మాట చెబితే అన్ని కానిస్తావు

బందులు చేస్తావు బస్సు లు తగలేస్తావు
కొట్టులు మూస్తావు కొట్లాటకు లేస్తావు

గణేశా గణ గణ గణేశా

నీ ఎనర్జీ అంత వేస్ట్ అయినా గణేశా
నీకు ఎక్స్పీరియన్స్ వస్తోంది గణేశా

కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా
స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా

మాదక ద్రవ్యాలలోన మాస్టర్గా మారినావు
డోపింగ్ వివాదాన డాక్టరేట్ పొందినావు

దగ్గే పెరిగేలా డ్రగ్స్ తీసుకున్నావు
లివరు పోయేలా లిక్కర్ లాగిస్తావు

సురేశా సురేశా

నీ హెల్త్ అంతా ఖరాబ్ అయినా సురేశా
స్వర్గం హెయిట్ ఎంతో తేలుస్తాది సురేషో సురేశా

క క క కకకకక

కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా
స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా

ఐ -ఫోన్ చేతిలోన ఐ -పోడ్ జేబులోన
కాలేమో బైక్ పైనా కళ్ళేమో ఆకాశాన

పార్టీ లంటావు పబ్ లో ఉంటావు
ఫాల్తూ ప్రెస్టిజికి పాకులాడుతుంటావు

ప్రకాశా అరై ప్రకాశా

నీ కన్నోళ్ల కన్నీళ్లను ప్రకాశా
పెర్ఫ్యూమ్ బాటిల్ లో కలిపేయ్
ప్రకాశో ప్రకాశా


Most Recent

Default