చిత్రం: జ్యోతి (1976) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All Songs) నటీనటులు: మురళీమోహన్, జయసుధ దర్శకత్వం: కె.రాఘవేంద్ర రావు నిర్మాత: క్రాంతి కుమార్ విడుదల: 04.06.1976
Songs List:
ఏడుకొండలపైన పాట సాహిత్యం
చిత్రం: జ్యోతి (1976) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల ఏడుకొండలపైన ఏలవెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో ఏడుకొండలపైన ఏలవెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో తెలియని వారికి తెలుపర స్వామి తెలియని వారికి తెలుపర స్వామి కన్నుల పొరలను తొలగించవేమి ఏడుకొండలపైన ఏలవెలిశావు ఎవరికీ అందక ఎందుకున్నావో చరణం: 1 ఆ ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావూ ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావూ అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో ఆ అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో ఏ అర్థమున్నదో... ఏ సత్యమున్నదో తెలియని వారికి తెలుపర స్వామి కన్నుల పొరలను తొలగించవేమి ఏడుకొండలపైన ఏలవెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో చరణం: 2 పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో ఏనాటి ఋణమును తీర్చుకుంటున్నావో రెండు ప్రేమల మధ్య బండగా మారావూ స్వామి రెండు ప్రేమల మధ్య బండగా మారావూ రేపు లేని నీకు దోపిడీ ఎందుకో... తెలియని వారికి తెలుపర స్వామి కన్నుల పొరలను తొలగించవేమి ఏడుకొండలపైన ఏలవెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో
ఫస్ట్ టైం ఇది నీకు బెస్ట్ టైం పాట సాహిత్యం
చిత్రం: జ్యోతి (1976) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల పల్లవి: ఫస్ట్ టైమ్—ఇది ఫస్ట్ టైమ్ మరి ఇప్పుడేకదా నాకు బెష్ట్ టైమ్ కసుగాయల నెన్నడుఏరుకోకు కన్నెపిల్ల నెప్పుడూ కోరుకోకు తాళికట్టి పంజరాన చిక్కుకోకు—మగ నాలికన్న వీలైంది లేదునీకు ఈదారి మారకుం టే నీకు Bad Time ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ అని చెప్పుకోకు పట్టుబడిపోతానని జంకిపోకు తాగేసినసీసాలను పగులకొట్టకు నీ గుండెల్లో గుచ్చుకుంటాయి చిట్ట చివరకు నీమత్తు వదలకుం టే యిదే Last Time
నీకూ నాకూ పెళ్ళంట పాట సాహిత్యం
చిత్రం: జ్యోతి (1976) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్. పి.బాలు, సుశీల నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట ఎందుకంటా? యుగయుగాలుగా ఉంటున్నా అవి కలిసిందెపుడూ లేదంటా-అలాగా నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట ఎందుకంటా? యుగయుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడూ లేదంటా నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట నదికి కడలికి పొంగంట ప్రతి రేయి మనకొక తొలిరేయంట ఆ.. తొలిముద్దు పెదవులు విడిపోవంట ఆ.. జగతికంతటికీ మన జంటే జంట ఇరు సంధ్యలను ఒకటిగా చేస్తామంటా ఆ..నా కంట నిను చూసుకుంటా ఆ..నీ చూపు నా రేపు పంట ఆ..ఆ నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట మన కోర్కెలన్నీ పసిపాపలంట ఆ.. చిగురాకు మనసుల చిరునవ్వులంట ఆ.. వయసు లేనిది మన వలపేనంట మన జీవితము ఆటాపాటే నంటా ఆ..నాలోన నిను దాచుకుంటా ఆ..నీ ఊపిరై కాచుకుంటా ఆ..ఆ నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట యుగయుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడూ లేదంటా నీకూ నాకూ పెళ్ళంట నదికి కడలికి పొంగంట
సిరిమల్లె పువ్వల్లె నవ్వు పాట సాహిత్యం
చిత్రం: జ్యోతి (1976) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, యస్.జానకి సిరిమల్లె పువ్వల్లె నవ్వు - హ్హ...హ్హ...హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు హ్హ...హ్హ...హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ ప ని స - హ్హ...హ్హ...హ్హ స గ మ - హ్హ...హ్హ...హ్హ గ మ ప - ఆ...హ్హ...హ్హ ని ని ప మ గ గ మ ప హ్హ హ్హ హ్హ హ్హ... ఆ...ఆ...ఆ... ఆ... చిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా చిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా చిననాటి కలలల్లె తియతియ్యగా ఎన్నెన్నో రాగాలు రవళించగా రవళించగా - ఉహూ...హ్హ...హ్హ...హ్హ... సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా ఆ...ఆ... వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా ఆ...వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా తొలి నవ్వుగా సిరి మల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు హ్హ...హ్హ...హ్హ...హ్హ...హ్హ... సిరిమల్లె పువ్వల్లె నవ్వు - హ్హ..హ్హ..హ్హా.. చిన్నారి పాపల్లె నవ్వూ - హ్హ...హ్హ...హ్హ...