చిత్రం: ఖైది నెం 786 (1988) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: చిరంజీవి, భానుప్రియ, రాధ సుహాసిని దర్శకత్వం: విజయబాపినీడు నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి విడుదల తేది: 10.06.1988
Songs List:
గువ్వ గోరింకతో పాట సాహిత్యం
చిత్రం: ఖైది నెం 786 (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్. పి. బాలు, యస్. జానకి (ఈ పాటను సాయిధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015) సినిమాలో రీమిక్స్ చేశారు దీనికి సంగీతం: మిక్కీ జె మేయర్, గానం: మనో, రమ్యా బెహ్రా) గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట ఆడుకోవాలి గువ్వలాగ పాడుకుంటాను నీ జంట గోరింకనై గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు అయ్యొపాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయిగారు ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా... హెయ్ గువ్వ - హా.., గోరింకతో - హా.. ఆడిందిలే బొమ్మలాట హేయ్.. నిండు - హా.. నా గుండెలో - హా.. మ్రోగిందిలే వీణపాట హా హోయ్ హోయ్.. కొండనాగు తోడు చేరి నాగిని బుసలలో వచ్చే సంగీతం సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం పువ్వులో మకరందము ఉందే నీ కోసం తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు దూరముంటానులే దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా సర్వమూ... హేయ్... గువ్వ - హాయ్.. గోరింకతో - హాయ్.. ఆడిందిలే బొమ్మలాట అహ.. నిండు - హా.. నా గుండెలో - హ మ్రోగిందిలే వీణపాట ఆడుకోవాలి గువ్వలాగ పాడుకుంటాను నీ జంట గోరింకనై
రైటొ అటో పాట సాహిత్యం
చిత్రం: ఖైది నెం 786 (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, యస్. జానకి రైటొ అటో ఇటో లాగించుకో ఫ్లూటొ సరో గమొ పదొ వాయించుకో సాగితే పడుచు సరిగమ...ఆగదీ చిలిపి చిమ చిమ రేగితే సొగసు గుమ గుమ...రెచ్చిపోతుంది రిమ రిమ తగిలితే తపనగా మొదలురా అదిరా ఇది జంటక చేరి రైటొ అటో ఇటో లాగించుకో ఫ్లూటొ సరో గమొ పదొ వాయించుకో ఒళ్ళు ఒళ్ళు డిడి డిక్కి తుళ్ళి తుళ్ళీ తాకగానె జంట పాటా ముద్దు పెట్టి రుద్దగానె వద్దు తోణె పుట్టుకొచ్చె ఒంటి పాటా నీ చేతులకు నా లేత వయసల్లాడే అసలే నీ పట్టూనకు నా బెట్టు చెడి రేగాయి లయలే ఏమి మూలుగో ఎంత నీలుగో వింత రాగమే తీసే వేళా సిక్సు దాటితే సిగ్గు మీరితే సెక్సు కీర్తనే పుట్టే వెళల్లో రైటొ అటో ఇటో లాగించుకో ఫ్లూటొ సరో గమొ పదొ వాయించుకో లేత అందమంత నాని బాతురూములోన పుట్టె నీటి పాట టబ్బులోన జారుతుంటే సబ్బు బిళ్ళ ఆడె కొత్త ముద్దులాటా నీ ఒంపులకు నా సొంపులకు కవ్వింపు మొదలై ఆ చూపులకు ఈ మెరుపులకు రెట్టింపు కథలై కూని రాగమో గుండే తాలమో కొత్త పాటగా పుట్టే వేళా ఆడపిల్లతో వేడి పల్లవే జోరు జోరుగా సాగే వేళల్లో రైటొ అటో ఇటో లాగించుకో ఫ్లూటొ సరో గమొ పదొ వాయించుకో సాగితే పడుచు సరిగమ...ఆగదీ చిలిపి చిమ చిమ రేగితే సొగసు గుమ గుమ...రెచ్చిపోతుంది రిమ రిమ తగిలితే తపనగా మొదలురా అదిరా ఇది జంటక చేరి రైటొ అటో ఇటో లాగించుకో ఫ్లూటొ సరో గమొ పదొ వాయించుకో
అటు అమలాపురం... పాట సాహిత్యం
చిత్రం: ఖైది నెం 786 (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, యస్. జానకి అటు అమలాపురం...ఇటు పెద్దాపురం...మద్య గోధావరీ దాటేందుకు బోటున్నది రాసంతకి తస్సాదియ్యా అటు అమలాపురం...ఇటు పెద్దాపురం...మద్య గోధావరీ కోనసెమలో కూరగాయలు...గోధారిలో కుర్రమేనులు గంపలు రెండు అమ్మకానికి రెడీ రెడీ రయ్యో తోటకూర గోంగూర బచ్చలకూర కొత్తిమీర కరేపాకూ ఎండ్రొయ్లు పచ్చిరొయ్లు బొంబిడాయలు పీతలు పిత్తపరిగలూ పైజంగిడలో ఎజిటేరియను కొంటావా మావా కింది గంపలో నాన్-ఎజిరేరియను కావాలా బావా సూపరు బజారు నేనే అనుకో గంప దింపుకొని సరుకు చూసుకో సూపరు బజారు నేనే అనుకో గంప దింపుకొని సరుకు చూసుకో బేరమాడుకో తస్సాదియ్యా.... అటు అమలాపురం...ఇటు పెద్దాపురం...మద్య గోధావరీ తప్పుడు కథలా అప్పలరాజూ...జతగా ఎక్కు కోటిపల్లిలో కాకినాడకో మామిడేటకో రూటుమార్చకయ్యో తోటకూర గోంగూర బచ్చలకూర కొత్తిమీర కరేపాకూ ఎండ్రొయ్లు పచ్చిరొయ్లు బొంబిడాయలు పీతలు పిత్తపరిగలూ పెద్దాపురము సంతకేగినా కాడికి రావయ్యో గంపలోని సరుకంతా ఎంతో నాణ్యమైనదయ్యో హోలుసేలుగా బేరమాడుకో ఒకటె మాటా ఒకటే రేటూ హోలుసేలుగా బేరమాడుకో ఒకటె మాటా ఒకటే రేటూ రైటు చేసుకో తస్సాదియ్యా.... అటు అమలాపురం...ఇటు పెద్దాపురం...మద్య గోధావరీ
చలి గాలి కొట్టిందమ్మ పాట సాహిత్యం
చిత్రం: ఖైది నెం 786 (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, యస్. జానకి చలి గాలి కొట్టిందమ్మ అందిట్లో...ఎందిట్లో చెలి గాలి కుట్టిందమ్మ ఇందిట్లో...ఎందిట్లో ఎందిట్లో ఏముంటాదో అందిట్లో ఏమౌతాదో సందిట్లోకొచ్చేదాకా నేనెట్లా చెప్పెదమ్మో ఏ ముద్దు ఏ మూలున్నా కొద్దో గొప్పో పారేయ్యాలమ్మో చలి గాలి కొట్టిందమ్మ అందిట్లో...ఎందిట్లో చెలి గాలి కుట్టిందమ్మ ఇందిట్లో...ఎందిట్లో ఎందిట్లో ఏముంటాదో అందిట్లో ఏమౌతాదో సందిట్లోకొచ్చేదాకా నేనెట్లా చెప్పెదమ్మో ఏ ముద్దు ఏ మూలున్నా కొద్దో గొప్పో పారేయ్యాలమ్మో నా సలహా ఒకటే చలివేళా...ఓం నమహా ఒడిలో చదవాలా నీ తరహా తెలిసే పిలగాడా...యం యమహా కలిసే కసితీరా ఆస్తో పాస్తో చదివించుకో... కాస్తో కూస్తో కవ్వించుకో జోడూ కుంపట్లు కావాల ఈడే తంపట్లొ వెయ్యాల ఒకటే దుప్పట్లొ దూరాల నీ ముద్ద మంధార గంధాలు పుయ్యాల చలి గాలి కొట్టిందమ్మ అందిట్లో...ఎందిట్లో చెలి గాలి కుట్టిందమ్మ ఇందిట్లో...ఎందిట్లో నా నడుమే కసిగా ఊగలా...నీ నడకే ఉసిగా సాగాలా నీ రుచులే ఒడిలో చూడాలా...నా పెదవే తడిగా మారాలా పిచ్చో వెర్రో ప్రేమించనా...గిల్లో గిచ్చో వేదించనా ఊరే పొద్దూకి పోవాల ఈడె తెల్లారిపోవాల చల్లో కుంకర్లు పోవాల ఈ కొండ కోనల్లొ తుళ్ళింతలాడాల చలి గాలి కొట్టిందమ్మ అందిట్లో...ఎందిట్లో చెలి గాలి కుట్టిందమ్మ ఇందిట్లో...ఎందిట్లో ఎందిట్లో ఏముంటాదో అందిట్లో ఏమౌతాదో సందిట్లోకొచ్చేదాకా నేనెట్లా చెప్పెదమ్మో ఏ ముద్దు ఏ మూలున్నా కొద్దో గొప్పో పారేయ్యాలమ్మో
గుండమ్మా బండి దిగి రావమ్మా పాట సాహిత్యం
చిత్రం: ఖైది నెం 786 (1988) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్. పి. బాలు గుండమ్మా బండి దిగి రావమ్మా బుచ్చమ్మా పొగరు తగ్గించవమ్మా గుండమ్మా బండి దిగి రావమ్మా బుచ్చమ్మా పొగరు తగ్గించవమ్మా నీ బుజ్జి కారుకున్న నట్టు లూసు టైటు చైక వదలమ్మడూ నీ యబ్బ డబ్బులతో నా లంటి గురుడు నీకు దొరకడమ్మడూ నీకు పాఠలు నేర్పించనా...ఊళ్ళో ప్రోగ్రాములిప్పించనా గుండమ్మా బండి దిగి రావమ్మా బుచ్చమ్మా పొగరు తగ్గించవమ్మా హార్మోని అంటే నీకంత అలుసా ఎట్టా వాఇంచాలో నీకు తెలుసా ఆ చేత్తొ గాలిపిప్పి ఆడించాలీ ఈ చేత్తొ మెట్లు నొక్కి పాడించాలి తాళాల చప్పుడుకే చెవులు మూసుకుంటే నువ్ కుదరదమ్మడూ ఆ పక్క ఈ పక్క దరువుంటేనే ఆటకి అందమమ్మడూ నీకు సంగీతం నేర్పించనా...టి.వి ప్రోగ్రాములిప్పించనా గుండమ్మా బండి దిగి రావమ్మా బుచ్చమ్మా పొగరు తగ్గించవమ్మా సరసానికైనా సంసారానికైనా కోచింగు ఉండాలె చింతామణి ప్యాంటు షర్టు మిడిసిపాటు తగ్గించుకో చీరకట్టి ఆడపిల్లవనిపించుకో పాటాలకోసమొచ్చి నీ నిప్పు చూపిస్తే సాగదమ్మడూ గీరెక్కి తెగబడిదే వీరపాదు పక్క దిష్టి పెడతవమ్మడూ ఎట్ట నడవాలో నేర్పించనా...డ్యాన్సు ప్రోగ్రాములిప్పించనా గుండమ్మా బండి దిగి రావమ్మా బుచ్చమ్మా పొగరు తగ్గించవమ్మా