Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kushi (2001)





చిత్రం: ఖుషి  (2001)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా
దర్శకత్వం: ఎస్. జే. సూర్య
నిర్మాత: ఏ. యమ్. రత్నం
విడుదల తేది: 27.04.2001



Songs List:



యే మేరా జహాన్ పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి  (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అబ్బాస్ టైర్ వాలా
గానం: కె.కె.

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా
కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా
చల్ తూ మస్తి మె చల్ జాయెగి మంజిల్ కహా
కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకె నిషాన్

ఇతిహాస్కి షురువాత్ ఆగ్సె హుయి
ఆగ్ షక్తి హై ఆగ్ జిందగి హై
తుం సబ్ మె ఎక్ చింగారి హై
జిసె కోయి భుజా నహి సక్త
జొ బురాయి పాస్ ఆయేగి జల్ జాయేగి 
జొ పాప్ కరీబ్ ఆయేగా జల్ జాయేగ
తుం సబ్ షొలె హొ మషాల్లెహ్ హొ
జల్తె రహొ జల్తె రహొ జల్తె రహొ

హొ హొ హొ హొ మేరా ఘర్ మేర ఆషియా
హొ హొ హొ హొ తేరా కాం క్యా హై యహా

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా సమె ఝహ్య క్యా యహా
ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా
కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా
చల్ తూ మస్తి మె చల్  చల్ చల్ జాయెగి మంజిల్ కహా
కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్

ఇతిహాస్కొ బద్లా పహియా నె 
పహియ ఘూంతా హై దునియ ఆగె బడ్తి హై
తుమ్హె భి ఎక్ దిన్ ఇతిహాస్ బదల్నా హై
దేష్ కొ ఆగె బఢాన హై
తుం సబ్ ఆనెవాలె కల్కి సాన్సె హొ 
తుం సబ్ ఆనెవాలె కల్కి ధడ్కన్ హొ
తుం రుక్ నహి సక్తె థం నహి సక్తె
చల్తె రహొ చల్తె రహొ చల్తె రహొ

హొ హొ హొ హొ మేరా ఘర్ మేర ఆషియా
హొ హొ హొ హొ తేరా కాం క్యా హై యహా

యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్
యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా
ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా
కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా
చల్ తూ మస్తి మె చల్ జాయెగి మంజిల్ కహా
కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్

హొ హొ హొ హొ లా లా లా లా
హొ హొ హొ హొ లా లా లా లా



అమ్మాయే సన్నగ పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు హో హో
ఈ చూపులు హో హో
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

చరణం: 1
ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే 
అమ్మమ్మో
ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే అమ్మమ్మో
ప్రేమే తోడుంటే పామైనా తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే
నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చే పచ్చి మిరపైనా నా నోటికి నారింజే
ఈ వయసులో హో హో
ఈ వరసలో హో హో
ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

చరణం: 2
నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం
అమ్మమ్మో
నేనొక అక్షరమైతే నీవేలే దానర్ధం
అమ్మమ్మో
ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే చేయించే తలస్నానం
ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవి కిరణం
పులకింతలే హో హో
మొలకెత్తగా హో హో
పులకింతలే మొలకెత్తగా
ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా
ఆ వాడి చూపులకి మంచైన మరిగేలే
ఆ నవ్వులు హో హో
ఈ చూపులు హో హో
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే



చెలియ చెలియా చిరు కోపమా పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ఎ. ఎమ్. రత్నం & శివగణేష్
గానం: హరిణి, జీన్స్ శ్రీనివాస్

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
కోపాలు తాపాలు మనకేలా
సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేలా
ప్రేమంటే పదిలంగా వుండాలా

చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము

రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే
గాలి తాకంగ పూచెనులే
అయితే గాలే గెలిచిందననా
లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్న
ఉలి తాకంగ వెలిసెనులే
అయితే ఉలియే గెలిచిందననా
లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంట
వ్యవహారం తీర్చేది ఎవరంట
కళ్ళల్లో కదిలేటి కలలంట
ఊహల్లో ఊగేటి ఊసంట

చెలియ చెలియా చిరు కోపమా

నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటే
మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవే అనుకోమననా
లేక నైజం అనుకోనా
మౌన రాగాలు రెండు కళ్ళను ధీకొంటే
ప్రేమ వాగల్లె పొంగునులే
దీని ప్రళయం అనుకోమననా
లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంట
వ్యవహారం తీర్చేది ఎవరంట
అధరాలు చెప్పేటి కధలంట
హృదయంలో మెదిలేటి వలపంటా

చెలియ చెలియా చిరు కోపమా



ప్రేమంటే సులువు కాదురా పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ఏ. యమ్. రత్నం
గానం: కల్పన, దేవన్ ఏకాంబరం

ప్రేమంటే సులువు కాదురా



ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: మురళీధర్

(ఈ పాటను యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మిస్సమ్మ (1955)  సినిమాలో నుండి రీమిక్స్ చేశారు, దీనికి సంగీతం సాలూరి రాజేశ్వర రావు గారు అందించారు, ఎ.ఎమ్.రాజా ఆలపించారు)

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

అర్ధాలే వేరులే  అర్ధాలే వేరులే  (2)

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే
అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే




హోళి హోళిల రంగ హోళి పాట సాహిత్యం

 
చిత్రం: ఖుషి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మనో, స్వర్ణలత

హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి
హోళి హోళి హోళి
హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి
హోళి హోళి హోళి

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో
హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళిి
హోళిల రంగ హోళి
రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు
ఆకు పచ్చాని పచ్చ రంగు
చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు
ఎగిరి దూకేటి చెంగు చెంగు

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో

ఓ పాలపిట్ట శకునం నీదేనంట
ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట
చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు
కలలు కన్న కన్నె వన్నె కోరికలు
చెరువులోన తామరకుపై ఊగే
మంచు ముత్యమేమన్నది
చిన్నదాని సొంతమైన సంపంగి 
ముక్కుపుల్ల నౌతనన్నది
హొహొ హొహొ అందమైన చెంప మీద
హొహొ హొహొ కెంపువోలె సిగ్గులొలికె
హొహొ హొహొ
కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుందిరో

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో

హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి
హోళి హోళి హోళి
హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి
హోళి హోళి హోళి

ఓ ఏకవీర తిరుగే లేదు లేర
ఓ పూలతార వగచే రోషనార
అడుగు పడితె చాలు నేల అదురునులే
పడుచు వాలు చూపు పడిన చెదరనులే
పల్లె కూనలెదురు వచ్చి యేలేలో
యెంకి పాట పడతారులె
అచ్చమైన పల్లె సీమ పాటంటే
గుండెతోనె ఆలకిస్తలె
హొహొ హొహొ పొన్న చెట్టు నీడలోన
హొహొ హొహొ పుట్ట తేనె జొన్న రొట్టె
హొహొ హొహొ 
చెంతగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో

హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళి
హోళిల రంగ హోళి
హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళి
హోళిల రంగ హోళి

రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు
ఆకు పచ్చాని పచ్చ రంగు
చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు
ఎగిరి దూకేటి చెంగు చెంగు

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో

Most Recent

Default