Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

M. Dharmaraju M.A (1994)




చిత్రం: యమ్ ధర్మరాజు M.A (1994)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: మోహన్ బాబు, రంభ, సురభి, సుజాత
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: జొన్నాడ రామమూర్తి
విడుదల తేది: 11.11.1994



Songs List:



సరసకు రా దొర మనోహర పాట సాహిత్యం

 
చిత్రం: యమ్ ధర్మరాజు M.A (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, మల్గాడి సుభ

సరసకు రా దొర మనోహర
సరసకు రా దొర మనోహర
చిటికెలు వేయగనే నే చటుకున వాలితిరా
పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా
మోతగా మోజులు తీర్చుకోను తరుణం ఇదేరా

సరసకు రా దొర మనోహర

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

సరసుడనే అహో మనోరమ
సరసుడనే అహో మనోరమ
ఎగబడు పొంగులతో తెగ నిగ నిగ లాడితివే
తకదిమి చిందులతో యమ తికమక జేసితివే
తియ్యని తిమ్మిరి తీర్చి వెయ్యగలనే ఇలా రా

నా ఒంటి చకోరి అందం
నీ ఒంటి నరాలు సొంతం
అయినపుడే హాయిరా - శభాష్...
ఊ అంటే సుఖాలు మొత్తం
నీ ముందు ఇవాళ సిద్ధం
నిలువున కమ్మేయరా
కాముడినే నా గదిలో కొలువు చేయించనా
నీ కులుకే బాటిలిలు కలిపి గుటకేయనా
వరదల తాకిడితో నువు విరుచుకు పడితే ఎలా
ఇలా...
అతి సుకుమారిని రా నీ ఊపుడు తాళనురా
కాదని ఔనని నన్ను ఆప తరమా వయ్యారి

సరసకు రా దొర మనోహర
సరసుడనే అహో మనోరమ

నీ పాటి దమ్మున్న వాడు
నీ సాటి మరో మగాడు
కనబడనే లేదురా - ఉంటేగా...
మచ్చారే మహానుభావ మొత్తంగా దోచేసుకోవా
కలబడరా దేవదా - వస్తున్నా
తారకవే ఠారుకుని తళుకు నీకున్నదే
నీ సరుకు బ్యారు మనే చురుకు నాకున్నదే
కసిగల రసికుడవై పసి మిస మిస లేలగరా
పెదవుల మధువులపై నీ పదుగును చూపగరా
నిండుగ పండుగ చేసుకోర గురుడా మాజాగా

సరసకు రా దొర మనోహర
సరసుడనే అహో మనోరమ
చిటికలు వేయగనే నే చటుకున వాలితిరా
ఎగబడు పొంగులతో తెగ నిగ నిగ లాడితివే
మోతగ మోజులు తీర్చుకోను తరుణం ఇదేరా
ఓపిక లేదు ఇంక రేపే...




ఎర్రా ఎర్రాని కుర్రాదాన పాట సాహిత్యం

 
చిత్రం: యమ్ ధర్మరాజు M.A (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర 

ఎర్రా ఎర్రాని కుర్రాదాన 



ఏం పాప బాగుందా పాట సాహిత్యం

 
చిత్రం: యమ్ ధర్మరాజు M.A (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు,  కె.యస్.చిత్ర 

ఏం పాప బాగుందా ఎంచక్కని ఈ మత్తు
అయ్యబాబోయ్ రేగింద కైపెక్కిన గమ్మత్తు
నిద్దర్ని చి చి పొమ్మంటూ ఇద్దర్ని ఏకం కమ్మంటు
సిద్ధంగ ఉన్నా రమ్మంటూ లాగింది మైకం లెమ్మంటు

ఏం పాప బాగుందా ఎంచక్కని ఈ మత్తు
అయ్యబాబోయ్ రేగింద కైపెక్కిన గమ్మత్తు

ఈ పక్కలు చప్పగుందే కళ్లార నిన్ను చూస్తుంటే
ఈ దమ్ములు మెత్తగుంది ఏకంగా నువ్వు చూస్తుంటే
మోయలేని సోయగాలు చూస్కో అంటే
దాయలేని ఉల్లి రైక మొర్రో అంది
మాయదారి హాయి గాలి ఉస్కో అంటే
కాయలేని గళ్ళ కోక వామ్మో అంది

హై లెస్సా... హై లెస్సా...

ఏం పాప బాగుందా ఎంచక్కని ఈ మత్తు
అయ్యబాబోయ్ రేగింద కైపెక్కిన గమ్మత్తు

రమ్మన్నదా నా సంపద దర్జాగా దోచే తుమ్మెద
సయ్యన్నదే నీ పై ఎద అందాలు పూసే పూపొద
కంటి గీటు తోని వేట చాలించదా
పంటి గాటు దాక రెచ్చి పోయెకదా
కొంటె ఘాటు రేపుతున్న ఓ మరదల
కన్నె గీటు దాటి దాక పోతే ఎలా

హై లెస్సా... హై లెస్సా...

ఏం పాప బాగుందా ఎంచక్కని ఈ మత్తు
అయ్యబాబోయ్ రేగింద కైపెక్కిన గమ్మత్తు
నిద్దర్ని చి చి పొమ్మంటూ ఇద్దర్ని ఏకం కమ్మంటు
సిద్ధంగా ఉన్నా రమ్మంటూ లాగింది మైకం లెమ్మంటు




వారెవ్వా వరహాల పాట సాహిత్యం

 
చిత్రం: యమ్ ధర్మరాజు M.A (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో,  కె.యస్.చిత్ర 

వారెవ్వా వరహాల



ఒప్పుకో సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: యమ్ ధర్మరాజు M.A (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో,  కె.యస్.చిత్ర 

ఒప్పుకో సుందరి ముద్దు పెట్టుకుంటా
కమ్ముకో తుంటరి కళ్ళుమూసుకుంటా
పిట పిట లాడే పిట్టా అట్టే
సతాయించకే ఎదలో ఇదే తీర్చవే
చిట పట లాడే నీ సందిట్లో
నిషా పంచరా ఆపై శృతే మించరా
కసి లేపుతోంది కైవారం
ఉసి గొలుపుతోంది సింగారం
చెయ్యలనుందిలే నేరం

అరె ఒప్పుకో సుందరి ముద్దు పెట్టుకుంటా
కమ్ముకో తుంటరి కళ్ళుమూసుకుంటా

ఓ తూనీగా నీ నడుము మడతలకు
తకిట తకిట తక తాళం వేస్తా ఠీవిగా
ఓ తేనీగా నీ చిలిపి పిలుపువిని
తళుకు బెళుకు లకు తాళం తీస్తా నాజూగ్గా
నువ్వు ఆమాత్ర మిస్తే చాలు చొరవా
ఇక చెప్పాల చూడు మా తెగువా
కొత్త ఇబ్బంది ఎక్కువాయే గురువా
కాస్త తగ్గించి పెట్టుకుంటే గొడవ
కువ కువ లాడే అవసరమేదో
గ్రహించానుగా కనుకే ఇటొచ్చానుగా
గుబ గుబ లాడే కోరిక లేవో
గుబాలించరా నిన్నే వరించానుగా
తగు చీకటిచ్చే సాయంత్రం
తెగ స్వాగతించె ఏకాంతం
ఇక సొగసుకు కియ్యు స్వాతంత్ర్యం

కమ్ముకో తుంటరి కళ్ళుమూసుకుంటా
అరె ఒప్పుకో సుందరి ముద్దు పెట్టుకుంటా

ఏం చేస్తావో చెయ్ పడుచు బరువులకు
పరువు నిలపగల సాయం చేసే ఘనకార్యం
నే చూస్తాగా నీ ఎగుడు దిగుడులకు
తగిన కౌగిలితో వంతెన గట్టే వ్యవహారం
హోయ్ మొత్తంగ ఈడు చేత బెడతా
సిగ్గు వద్దంటే దాన్ని వెల్లగొడతా
తిక్క తీరంగ అల్లి సుఖ పెడతా
హక్కు పొందంగ తాళిబొట్టు కడతా
నిగ నిగ లాడే నా సుకుమారం
తరించేట్టుగా నీకే కలలు చెయ్యనా
ఎవరెవరంటూ వెతికే ప్రాయం
మొరాలించనా మురెపం ప్రసాదించినా
నులి వెచ్చనైనా నయగారం
అర విచ్చు కున్న మందారం
అందించుకొన బహుమానం

అహ ఒప్పుకో సుందరి ముద్దు పెట్టుకుంటా
కమ్ముకో తుంటరి కళ్ళుమూసుకుంటా
పిట పిట లాడే పిట్టా అట్టే
సతాయించకే ఎదలో ఇదే తీర్చవే
చిట పట లాడే నీ సందిట్లో
నిషా పంచరా ఆపై శృతే మించరా
కసి లేపుతోంది కైవారం
ఉసి గొలుపుతోంది సింగారం
చెయ్యలనుందిలే నేరం

Most Recent

Default