చిత్రం: మాపల్లెలో గోపాలుడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: అర్జున్ , పూర్ణిమ జయరామ్ దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: యస్. గోపాల్ రెడ్డి విడుదల తేది: 07.10.1985
Songs List:
రాణి రాణమ్మ పాట సాహిత్యం
చిత్రం: మాపల్లెలో గోపాలుడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. పి.బాలు, పి. సుశీల రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా రతనాల మేడలోన నిన్నొక రాణిగ చూడాలని నీ అడుగులు కందకుండా నా అరిచేతులు ఉంచాలని రతనాల మేడలోన నిన్నొక రాణిగ చూడాలని నీ అడుగులు కందకుండా నా అరిచేతులు ఉంచాలని ఎంతగా అనుకున్నాను... ఏమిటి చూస్తున్నాను... ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేన రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా రాణి రాణమ్మ రాణి కన్నీళ్లు రానీయమ్మా రాణి రాణమ్మ రాణి కన్నీళ్లు రానీయమ్మా సహనం తీపి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని సహనం తీపి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా రాణి రాణమ్మ రాణి కన్నీళ్లు రానీయమ్మా గుండె రగిలిపోతూవుంటే గూడు మేడ ఒకటేలే రాళ్ళు బడ్డ బావిపోతే ముళ్ళు పూలు ఒకటేలే ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలి తీరం... ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలి తీరం ఎదురీత ఆగదులే విధిరాత తప్పదులే రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా
సరిగ సరిగ పాట సాహిత్యం
చిత్రం: మాపల్లెలో గోపాలుడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. పి.బాలు, పి. సుశీల సరిగ సరిగ
కో కో కోతి పాట సాహిత్యం
చిత్రం: మాపల్లెలో గోపాలుడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. పి.బాలు, పి. సుశీల కో కో కోతి
నేను ఈల వేస్తే పాట సాహిత్యం
చిత్రం: మాపల్లెలో గోపాలుడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. పి.బాలు, పి. సుశీల పల్లవి: నేను ఈలవేస్తె గోలకొండ ఎగిరిపడతది నేను దరువు వేస్తె పడుచుగుండె అదిరిపడతది నేను దరువు వేస్తె పడుచుగుండె అదిరిపడతది నా పాటంటే ఏటి మజాకా అది పాకింది పట్నం దాకా నా పాటంటే ఏటి మజాకా అది పాకింది పట్నం దాకా విశాఖపట్నందాకా దిబికి దిబికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి దిబికి దిబికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి దిబికి దిబికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి చరణం: 1 చిచ్చుకొడితే బుజ్జిగాడిని రెచ్చగొడితే చిచ్చుపిడుగుని చిచ్చుకొడితే బుజ్జిగాడిని రెచ్చగొడితే చిచ్చుపిడుగుని పల్లెటూరి బుల్లినాయన మా పట్నంగాలి నీకు సోకెనా పల్లెటూరి బుల్లినాయన మా పట్నంగాలి నీకు సోకెనా పట్నం వోళ్ళు నాముందు తీసికట్టు మీ పట్నంవోళ్ళు నాముందు తీసికట్టు నా పట్టులో ఉందిలే ఉడుంపట్టు చరణం: 2 రామయ్య మండిపడి విల్లెత్తితే లంకంత దిమ్మతిరిగి పోయిందంట కిష్ణయ్య మోజుపడి మురళి ఊదితే రేపల్లె చిందేసి ఆడిందంట ఈ పల్లె గోపన్న ఈలవేస్తే అరెరె ఈ పల్లె గోపన్న ఈలవేస్తే అరెరె గున్నమ్మలందరికి గుమ్మెత్తుతుందంట దిబికి దిబికి దిమ్మాడి గుబుకు గుబుకు గుమ్మాడి
కం కుమ్మంటినే పాట సాహిత్యం
చిత్రం: మాపల్లెలో గోపాలుడు (1985) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. పి.బాలు, పి. సుశీల ఘుం ఘుం గుమ్మేత్తింది