చిత్రం: మాతృదేవోభవ (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి నటీనటులు: నాజర్, మాధవి దర్శకత్వం: కె. అజయ్ కుమార్ నిర్మాత: కె.యస్. రామారావు విడుదల తేది: 16.07.1993 (మాతృదేవోభవ 1993 లో విడదలై పలువురి మన్ననలు పొందిన ఒక సినిమా. విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా వేణువై వచ్చాను భువనానికి అనే పాటకు చిత్ర గారికి నంది అవార్డు వచ్చింది. అలాగే వేటూరి గారికి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. )
Songs List:
రాగం అనురాగం పాట సాహిత్యం
చిత్రం: మాతృదేవోభవ (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు చిత్ర రాగం అనురాగం
కన్నీటి కలువలు పాట సాహిత్యం
చిత్రం: మాతృదేవోభవ (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు కన్నీటి కలువలు
వేణువై వచ్చాను పాట సాహిత్యం
చిత్రం: మాతృదేవోభవ (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: చిత్ర వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్ని మౌన గానం వాంఛలన్ని వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మాతృదేవోభవ (మాతృదేవో భవ) పితృదేవోభవ (పితృదేవో భవ) ఆచార్యదేవోభవ (ఆచార్యదేవో భవ) ఏడు కొండలకైన బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే ఏడు కొండలకైన బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలత లో వెలుగునే కనక నేను మేననుకుంటే ఎద చీకటే హరీ... హరీ... హరీ... రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏ నాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారె నా గుండెలో నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారె నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ... హరీ... హరీ... రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి గాలినై పోయాను గగనానికి
రాలిపోయే పువ్వా పాట సాహిత్యం
చిత్రం: మాతృదేవోభవ (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యమ్. యమ్. కీరవాణి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే నీకిది తెల్లవారని రేయమ్మా కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా తిరిగే భూమాతవు నీవై వేకువ లో వెన్నెలవై కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడిపోయే తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే