Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mr. Perfect (2011)





చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
నటీనటులు: ప్రభాస్, కాజల్, తాప్సి
దర్శకత్వం: కె.దశరథ్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 22.04.2011



Songs List:



రావు గారి అబ్బాయి పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: టిప్పు

రావు గారి అబ్బాయి యాక్టర్ అవ్వాలన్నాడు
కానీ వాళ్ళ బాబేమో డాక్టర్నే చేశాడు
పైసలెన్నో వస్తున్నా పేషెన్ట్ లా ఉంటాడు
సూపర్ స్టార్ అవ్వాల్సినోడు
సూది మందు గుచ్చుతున్నాడు
నీకు నచ్చింది చెయ్యకుంటే
లైఫ్ లో యాడుంది కిక్కు
నిన్నే నువ్వు నమ్ముకుంటే
నీకింక ఎవడు దిక్కు

Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం

నిజమేరా ఏదో  నిన్ను ఫాలో అవ్వడం వల్ల
ఇలా ఉన్నాను గాని
లేకపోతే ఆ లక్ష్మీ గారి అమ్మాయిలా
లైఫ్ లో లైఫె లేకుండా పోయేదిరా బాబు

ఆ లక్ష్మీ గారి అమ్మాయి - బాగుంటదా
ముందు మేటర్ వినరా సన్నాసి
ఆ లక్ష్మీ గారి అమ్మాయి
డాన్సరవ్వాలనుకుంది ఓహో
కానీ వాళ్ళ అమ్మేమో
పెళ్ళి చేసి పంపేసింది
వందకోట్ల ఆస్తున్నా వంటింట్లోనే ఉంటాది
గజ్జకట్టా లనుకున్నాది గరిట పట్టుకున్నాది
ఎవడో చెప్పింది చేస్తుంటే
లైఫ్ లో యాడుంది కిక్కు
ఎపుడు నువ్వే సర్దుకుపోతే
నీకింక ఎవడు దిక్కు

Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం

మన జనరేషన్ కే కాదురా
మన ముందు జనరేషన్ కి కూడా ఇదే టార్చరు
అంతెందుకు మన శీను గాడి బాబాయి
శీను గాడి బాబాయి లీడరవ్వాలన్నాడు
కానీ వీడి తాతేమో ప్లీడర్ని చేశాడు
కేసు వాడివైపున్నా పేస్ మాడినట్టుంటాడు
జిందాబాద్ వినాల్సినోడు జడ్జ్ ముందు తల వంచాడు

నువ్వనుకున్నది చెప్పుకుంటే
లైఫ్ లో  యాడుంది కిక్కి
నీలో నువ్వే గింజుకుంటే
నీకింక ఎవడు దిక్కు

Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం

రేయ్ పెద్దవాళ్ళు చెబుతారు
పక్కనోళ్ళు చెబుతారు
తప్పులేదు బాసు వాళ్లకు తోచిందే చెబుతారు
నువ్వు కోరుకుందేంటో
నీకు ఏది సూటవుతుందో
అర్ధమయ్యేలా చెప్పకుంటే
వాళ్ళు మాత్రమేం చేస్తారో
మనమే క్లియర్ గా లేకపోతె
అక్కడే వస్తుంది చిక్కు
లేనిపోని భయాలు పెట్టుకుంటే
తర్వాత మీకు బిక్కు

Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం



హా చలిచలిగా అల్లింది పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌
గానం: శ్రేయ ఘోషల్

హా చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది
నీవైపే మళ్లిందీ మనసూ
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుందీ వయసూ
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా వూపిరైనట్టు నాలోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

హా చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది
నీవైపే మళ్లిందీ మనసూ
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుందీ వయసూ

చరణం: 1
గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీదీ నాదీ
తలపులు వేరైనా కలవని తీరైనా
బలపడిపోతుందే ఉండేకొద్దీ
లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశంపైకి వెళుతున్నట్టు
తారలన్ని తారసపడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా వూపిరైనట్టు నాలోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

చరణం: 2
నీపై కోపాన్ని ఎందరిముందైనా
బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా
తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా వూపిరైనట్టు నాలోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు




నింగి జారి పడ్డ పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మల్లికార్జున్





డోల్ డోల్ డోల్ భాజే (ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే) పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: బాలాజీ 
గానం: MLR కార్తికేయన్,అనిత కార్తికేయన్

ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే

దినక్ దిన...

హో డోల్ డోల్ డోల్ భాజే
సంబరాలు సాధి రోజే
మంతనాలు పెత్తనాలు చేస్తు
పెద్ద వాళ్ళు వేసే పెళ్ళి రూట్ లే

డోల్ డోల్ డోల్ భాజే
డోలి మీద రాణి రాజే
చందనాలు కంకణాలు మారే
ఉంగరాలు చేరే పెళ్ళి పీటలే

మేడ్ ఫర్ ఈచ్ అధర్ వీళ్లు అని
నూరేళ్లు హాయిగ గడపమని
వేదాలు మంత్రాలు వాద్యాలు గానాలు
నింగి నేల ఏకం చేసి జనాలు జిగేలు మనాలిలే

ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే

ఓ కొంటె పిల్ల సిగ్గులన్ని ఓ హో హో
నేలమీద ముగ్గులాయే ఆ హా హా
టింగు రంగడల్లే బావ కొంగుపట్టు వేళ ఉంది
వేలు కాస్త పైకి ఎత్తవే

రామ సక్కనోడు లెండి ఓ హో హో
భామ వంక చూడదండి ఆ హా హా
రాయభార మెందుకండి
రాసివుంచి నాడు లెండి
గుండెలోన చోటు సీతకే
చూపులే మాటలై
మరి కవితలు రాయవ
ప్రేమ దారి పెళ్ళి లోనే
ఆటవుతుంది పాటవుతుంది
మనసులు కలిపే చోటవుతుంది

ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే

కళ్ళలోని ఆశలన్ని ఓ హో హో
నిన్ను చేరి తీరిపోయే ఆ హా హా
కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటనంటు
ఒట్టు పెట్టి చెప్పవే మరి అహ

గుండెలోనె కోట కట్టి ఓ హో హో
ఊపిరంత నీకు పోసి ఆ హా హా
అందమైన బొమ్మ చేసి
మూడు ముళ్ళు మంత్రమేసి
ఏలుకుంట నిన్ను రాణి లా
నీ జతే ఓ వరం
కోటి కళలకు కానుక
లోకమంత మాయచేసి
నువ్వు నేను మిగిలుండాలి
యుగాలు క్షణాలు అయేట్టుగా

ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే




మొర వినరా ఓ గోపికృష్ణా పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: జి. సత్యమూర్తి
గానం: ప్రియదర్శిని

మీకు నచ్చిన రంగు ?
తెలుపు
ఎదుటి మనిషిలొ మీకు నచ్చెది?
చిరునవ్వు
మీకు సంతోషమ్ వస్తే ఏమ్ చేస్తారు?
డాన్స్

మొర వినరా ఓ గోపికృష్ణా
ఈ కన్నెల వెన్నలు నీవేలేరా
నవ్వకురా ఓ మువ్వల కృష్ణ
ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా
అలిగి ఎరిగీ  వెదురు పొదలకు వెల్లమాకురా
చిగురూ పాదాలు కందీ పోవురా
మురిసే మురళి రవలి వినిపించకురా
అది విని కోయిలమ్మ మూగబోవురా
వినరా ఇ గారాల బేరాలు చాలించరా
మొర వినరా ఓ గోపికృష్ణా
ఈ కన్నెల వెన్నలు నీవేలేరా
నవ్వకురా ఓ మువ్వల కృష్ణ
ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా

ఓ కృష్ణా హో మై కృష్ణా
హెయ్ కమ్ కృష్ణా కమ్ కృష్ణా
లెట్స్ డాన్స్ కృష్ణా
ఓ కృష్ణా హో మై కృష్ణా
హెయ్ కమ్ కృష్ణా కమ్ కృష్ణా
లెట్స్ డాన్స్ కృష్ణా




ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: మేఘ, సాగర్

ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక

రై రై రై రైడ్ చేసెయ్ రాకెట్లా మనసునీ
సై సై సై సైడ్ చేసెయ్ సిగ్నల్స్తో ఏం పనీ
ఇక హైవేలైనా వన్వేలైనా కదలదే బండి తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక

పార్టీలా ఉంది నీతోటి ప్రతిక్షణం
ఎందుకంటే చెప్పలేను కారణం
టేస్టీగా ఉంది నువు చెప్పే ప్రతి పదం
బాగుందబ్బా మాటల్లోన ముంచడం
హే రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్లిస్తుందా జాణా
నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా
కార్టూన్ చానెల్లోనైనా ఈ ఫన్నుందా బోలోనా
నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా
ఇక సాల్సాలైనా సాంబాలైనా
కదలదే ఒళ్లు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
హే మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక

ఆన్లైన్లో నువ్వు హాయ్ అంటే నా మది
క్లౌడ్ నైన్లోకి నన్ను తోస్తది
ఆఫ్లైన్లో నువ్వు ఉన్నావంటే మది
కోల్ మైన్లోకి కూరేస్తది
ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్లా కనిపిస్తుంది జాణా
నాతో పాటు ఈ ఫీలింగు నీకు కొత్తేనా
ఏ రోజైనా వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైనా
నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా
ఇక డేటింగైనా ఫైటింగైనా గడవదే రోజు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
హే మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక




అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: గోపిక పూర్ణిమ

అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను - నేను
నన్ను చిన్న చూపు చూస్తె ఊరుకోను - కోనూ
ఎందులోను నీకు నేను తీసిపోనూ
నా సంగతేంటొ తెలుసుకోవా పోను పోనూ
అచ్చమైన పల్లె రాని పిల్ల నేనూ - నేనూ
పచ్చి పైరె గాలి పీల్చి పెరిగినానూ
ఏరికోరి గిల్లి కజ్జా పెట్టుకోనూ
నిన్ను చూస్తె గిల్లకుండా ఉండలేనూ
హొయ్ హొయ్ హొయ్
హెయ్ సూటు బూటు స్టైల్ సుందరా
లేని పోను డాబు మానరా
ఈ ఊరిలో పైచేయి నాదిరా
నాగొప్పలూ ఒప్పుకో తప్పులేదురా
రేవులోని తాడిచెట్టులా నీకెక్కువేమిటో
హా చుక్కల్లోని  చూపు కొద్దిగా
నేల దించుకో హొయ్



బదులు తోచని ప్రశ్నల పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, మల్లికార్జున్

ఎప్పటికి తన గుప్పెట విప్పదు
ఎవ్వరికి తన గుట్టలు చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథ

తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడడం తనకేం సరదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్న మొన్నా నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈ రోజు ఏమైందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తైనా అనిపించిందా రా

ఎప్పటికి తన గుప్పెట విప్పదు
ఎవ్వరికి తన గుట్టలు చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథ

తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడడం తనకేం సరదా

ఏదోలా చూస్తారే నిన్నొ వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా
మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా
సంబరపడి నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా

నీ తీరే మారింది నిన్నకి నేటికి
నీ దారే మల్లుతుందా కొత్త తీరానికి
మార్పేదైన వస్తుంటే నువ్వది గుర్తించక ముందే
ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా
వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీలేలేదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా



లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బాబా సెహగల్, మురళి

బావా ఎప్పుడు వచ్చితి నీవు
వచ్చి ఏమి పీకితి నీవు
ఎంటలా గుంట నక్కలా చూస్తున్నావు
ఎవడబ్బ సొమ్మని నీ భావ ఇంత తగలేసి
ఈ సంగీతు పెట్టాడనుకున్నావు
వెళ్ళి వాణ్ణి లేపు వీడ్ని లేపు
పందిట్లో పుట్టించు ఊపు...

ఓరె  ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కు పోయే
హే గల గల గల గల గలాట్ట లేక
విల విల విల విల దిల్ తరుక్కుపోయే

కంప్యూటర్లు మూసే సెల్ ఫోన్స్ తీసి దాచేయి
వెళ్ళింట్లోకివన్ని దేనికోయ్
మైండ్ బ్లాక్ చేసేయ్ ఆలోచనలు మనేయ్
మ్యారేజే ని ద్యాసేయ్
ఫస్ట్ గెస్ట్ లా నువ్వు నడుచుకో
ఏమంటాడురా ?

లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో

ఓరె  ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కు పోయే
హే గల గల గల గల గలాట్ట లేక
విల విల విల విల దిల్ తరుక్కుపోయే

బడ్లోకెళ్ళి పాఠం వింటాం
గుడ్లోకెళ్లి పూజలు చేస్తాం
ఆఫీస్ అయితే డ్యూటీ చేస్తాం
మరి పెళ్ళింట్లోనే ఎంజాయ్ చేస్తాం
అరె ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం
అన్నట్టుంటే ఎట్లా పెళ్ళిలో
సావాసం సంతోషం పంచే అవకాశం
కళ్యాణం అనుకుంటే
నిన్ను నువ్వు నలుగురితో కలుపుకో

లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో

నీతో స్నేహం అరె నాకేం లాభం
అనేంత లాగా మారింది లోకం
నువ్వు మౌనం అరె నేను మౌనం
మనసు మనసు మరింత దూరం
అక్కా పిన్ని బాబాయ్
బుజ్జి బాబా చెల్లాయ్
చుట్టూరా చుట్టాలే చూసుకో
ఇది డైలీ సీరియల్ కాదోయ్
మళ్ళి మళ్ళి రాదోయ్
ఈ ఒక్క రోజు కొంచం
నీ బిజీ కామ్ బంధువులకు ఇచ్చుకో

లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో

Most Recent

Default