చిత్రం: ముద్దుల ప్రియుడు (1994) సంగీతం: యమ్.యమ్.కీరవాణి నటీనటులు: వెంకటేష్, రమ్యకృష్ణ, రంభ దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: కె. కృష్ణమోహన రావు విడుదల తేది: 01.10.1994
Songs List:
వసంతంలా పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల ప్రియుడు (1994) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి.బాలు, చిత్ర పల్లవి: వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలా కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలా చరణం: 1 హాయిలో మురళి కోయిల అరకులోయలా పలుకగా వేణువై తనువు గానమై మనసు రాధనై పెదవి కలిపాలే మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసా నడిచే బృందావని నీవని తెలిసే కలిశా పూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలా చరణం: 2 మౌనమో ప్రణయ గానమో మనసు దానమో తెలుసుకో నీవులో కలిసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచే నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలా కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా వచ్చిపోవా ఇలా
సిరి చందనపు పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల ప్రియుడు (1994) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: బాలు, చిత్ర, కీరవాణి పల్లవి: సిరి చందనపు చెక్కలాంటి భామా నందివర్థనాల పక్క చేరవమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మా కొంగు తందనాలు లెక్కపెట్టు మామా ఒంటిగుంటె తోచదు ఒక్కసారి చాలదు ఒప్పుకుంటె అమ్మడు తప్పుకోడు పిల్లడు యమయమా... మామామామా... చరణం : 1 చిక్ చిక్ చిక్ చిక్ చిలకా నీ పలుకే బంగారమా సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా నీ అలకే మందారమా ఇది కోకిలమ్మ పెళ్లి మేళమా... నీ పదమా అది విశ్వనాథ ప్రేమగీతమా... నీ ప్రణయమా తుంగభద్ర కృష్ణా ఉప్పొంగుతున్నా కొంగు దాచే అందాలెన్నమ్మా ఊపులో ఉన్నాలే భామా చిక్ చిక్ చిక్ చిక్ చిలకా... సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా... చరణం : 2 పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా నీ పిలుపే సిరి వాదమా గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా నీ వలపే ఒడి వేదమా ఇది రాధ పంపు రాయబారమా... నీ స్వరమా ఇది దొంగచాటు కొంగు వాటమా... ఓ ప్రియతమా ముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ కవ్వాలటే మోతమ్మా చల్లగా చిందేసే ప్రేమా...
ఎవరో రావాలి పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల ప్రియుడు (1994) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: బాలు, చిత్ర ఎవరో రావాలి
నాకే గనక పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల ప్రియుడు (1994) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: బాలు, చిత్ర నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తతత తర్వాత ఏమి చెయ్యాలి కకక కామున్ని కాస్త అడగాలి అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్ళికొడుకా మొమొమొ మోజుల మోత మోగాలి గగగ గాజుల గోల పెరగాలి ఆహా ఓహో అంటూ ఉంటే వింటున్న వాళ్ళు వేడెక్కిపోవాలి నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తతత తర్వాత ఏమి చెయ్యాలి కకక కామున్ని కాస్త అడగాలి నచ్చావు గనక ముచ్చటైన ముద్దుల్ని పెట్టి మోమాట పెట్టి నిలువెల్లా చుట్టి కౌగిళ్ళు కట్టి మురిపాలు చెల్లించనా వచ్చావు గనక వన్నెలన్నీ ఒళ్ళోన పెట్టి నైవేద్యమెట్టి సిగ్గుల్ని చుట్టి చిలకల్ని కట్టి తాంబూలమందించనా పెదవిలోని పాఠాలు చదువుకోనా ఈనాడు అదుపులేని అందాలన్ని అడిగినాయి నీ తోడు తప్పో ఒప్పో తప్పేదెట్టా తెగించకుంటే తగ్గదు మంట మాయ మనసు మాట వినదు కదా నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తతత తర్వాత ఏమి చెయ్యాలి కకక కామున్ని కాస్త అడగాలి అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్ళికొడుకా మొమొమొ మోజుల మోత మోగాలి గగగ గాజుల గోల పెరగాలి మోమాట పడక కొద్దిసేపు ఓపిక పట్టి వీపున తట్టి గిలిగింత పెట్టి బలవంత పెట్టి జరపాలి జత పండగ వద్దన్నా వినక ఒక్కసారి చల్లంగ నవ్వి మెల్లంగ దువ్వి లయలెన్నో వేసి చొరవేదో చేసి బరువంతా దించేయనా తనువు నీకు తాకించి ఋణము తీర్చుకుంటాలే తనువు తీరిపోయే దాక తపన దించుకుంటాలే ఎగాదిగా వేగే సోకే తాకమంటే జోహారు అంటావ ఒళ్ళు నీకు విల్లు రాసి ఇస్తా నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తతత తర్వాత ఏమి చెయ్యాలి కకక కామున్ని కాస్త అడగాలి అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్ళికొడుకా మొమొమొ మోజుల మోత మోగాలి గగగ గాజుల గోల పెరగాలి
చిటపట చిటపట పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల ప్రియుడు (1994) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: బాలు, చిత్ర చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా చిలకల చిట్టెమ్మా చిదిమిన సిగ్గమ్మా చినుకుల శ్రీరంగ వణుకుతూ వాటేస్తా ఎగబడి దిగబడి మగసిరి కలబడి ఆలిగిన అందాలిక నీవే పదమంట చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా నీ జంట జంపాలా తనువులు కలబడి తపనలు ముదరగనే నీ చూపులియ్యాల పెదవుల ఎరుపుల తొలకరి చిలికెనులే తెలిమబ్బో చెలి నవ్వో చలి గిలకలతో పలికెనులే గిలిగిలిగా హరివిల్లో కనుచూపో తడి మెరుపులతో తడిమెనులే చలిచలిగా మెచ్చి మెలిపెడతా గిచ్చి గిలిపెడతా పచ్చి పడుచుల వలపుల చిలకలా పిలపిల పలుకుల బుడిబుడి కులుకుల బుడిబుడి నడకలు వెంటాడు వేళల్లో చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా నా మల్లె మరియాద మడిచిన సొగసుల విడిచిన ఘడియలలో నీ కన్నె సిరి మీద చిలకల పలుకుల అలికిడి తళుకులలో పసిమొగ్గ కసిబుగ్గ చలి చెడుగులలో చెరి సగమై అడిగెనులే అది ప్రేమో మరి ఏమో యమ గిలగిలగా సలసలగా తొలిచెనులే చేత చేపడతా చెంగు ముడిపెడతా చెంప తళుకులు కలిసిన మెరుపులు దులిపిన ఒడుపున తడిమిన సొగసుల తొడిమల తొణికిన అందాల వేటల్లో చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా చిలకల చిట్టెమ్మా చిదిమిన సిగ్గమ్మా చినుకుల శ్రీరంగ వణుకుతూ వాటేస్తా ఎగబడి దిగబడి మగసిరి కలబడి ఆలిగిన అందాలిక నీవే పదమంట చిటపట చిటపట కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తరిగిట తళకుల బుగ్గచూసి లగ్గమెట్టనా
జై జై మహాకాయ పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల ప్రియుడు (1994) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: బాలు, చిత్ర జై జై మహాకాయ
వసంతంలా పాట సాహిత్యం
చిత్రం: ముద్దుల ప్రియుడు (1994) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, చిత్ర పల్లవి: వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలా కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలా చరణం: 1 హాయిలో మురళి కోయిల అరకులోయలా పలుకగా వేణువై తనువు గానమై మనసు రాధనై పెదవి కలిపాలే మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసా నడిచే బృందావని నీవని తెలిసే కలిశా పూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలా చరణం: 2 మౌనమో ప్రణయ గానమో మౌనమో ప్రణయ గానమో మనసు దానమో తెలుసుకో నీవులో కలిసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచే నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలా కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా వచ్చిపోవా ఇలా