చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ నటినటులు: మహేష్ బాబు, సోనాలి బింద్రే దర్శకత్వం: కృష్ణవంశీ నిర్మాతలు: యన్.దేవిప్రసాద్, రామలింగేశ్వర రావు విడుదల తేది: 17.02.2001
Songs List:
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి పాట సాహిత్యం
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: జిక్కి, సునీత, సంధ్యా ఆ... ఆ... అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ...ఆ... తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ...ఆ... చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ...ఆ... అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళ గల జంటని పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ... ఆ... దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
భామా భామా బంగారూ పాట సాహిత్యం
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, అనురాధ శ్రీరామ్ భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ముద్దు కావాలీ హత్తు కోవాలీ సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా గుట్టంతా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా యమకారంగా మమకారంగా నిను చుట్టెస్తా అధికారంగా గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా అబ్బోసీ సొగసొగ్గేసీ మహచెలరేగావే లగిలేసీ నినుచూసీ తెగ సిగ్గేసీ తలవంచేసా మనసిచ్చేసీ చుట్టేసీ పొగ పెట్టేసీ నను లాగేసావే ముగ్గేసీ వొట్టేసీ జతకట్టేసీ వగలిస్తానయ్యా వలిచేసీ ఓస్సోసీ మహముద్దేసీ మతిచెడగొట్టావే రాకాసి దోచేసీ మగమందేసీ నను కపాడయ్యా దయచేసీ భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ హోయ్ హోయ్ అరె భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ముద్దు కావాలీ - హోయ్ హోయ్ హత్తు కోవాలీ - హాయ్ హాయ్ సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ భామా భామా డడ్డడా డండడార డాడా అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ అరె భామా భామా డడ్డడా డండ డడ డండ డడ డండ డండడా
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా పాట సాహిత్యం
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా కంటికెదురు పడతావేంటి ఎటుచూసినా చంప గిల్లి పోతావేంటి గాలివేలితోనా అంత గోడవపెడతావేంటి నిద్దరోతువున్న అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా ఒంటిగా ఉండనీవే ఏంటి ఒక్క నిమిషమైనా ఇదేం అల్లరి భరిచేదెలా అంటూ నిన్నెలా కసరను నువ్వేంచేసిన బాగుంటుందని నిజం నీకెలా చెప్పనూ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించబుద్దవుతుంది ఎట్టాగైనా ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఒడిపోతూ ఉన్నా లేనిపోనీ ఉక్రోషంతో ఉడుకెత్తనా ఇదేం చూడక మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్న అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్న అయ్యో రామా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ఐ లవ్ యు చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ య
ఎక్కడ ఎక్కడ ఉందో తారకా పాట సాహిత్యం
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బి. చరణ్, హరిణి ఎక్కడ ఎక్కడ ఉందో తారకా నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నదీ ఏ వూరే అందమా ఆచూకీ అందుమా కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా ఎక్కడ ఎక్కడ ఉందో తారకా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా కులుకులో ఆ మెలికలూ మేఘాలలో మెరుపులూ పలుకులూ ఆ పెదవులూ మన తెలుగు రాచిలకలూ పదునులూ ఆ చూపులూ చురుకైన సురకత్తులూ పరుగులూ ఆ అడుగులూ గోదారిలో వరదలూ నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురీ నా కళ్ళలో కలల పందిరీ అల్లేయకోయి మహాపోకిరీ మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీ సిగ్గల్లే తాకిందీ బుగ్గల్లో పాకిందీ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ మెరుపుని తొలిచినుకునీ కలగలిపి చూడాలనీ ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియనీ ఎన్నాళ్ళిలా తనోస్తాడనీ చూడాలటా ప్రతీ దారినీ ఏ తోటలో తనుందోననీ ఎటు పంపనూ నా మనసునీ ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా అవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా ఎక్కడ ఎక్కడ ఉందో తారకా నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నదీ నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా ఏ వూరే అందమా ఆచూకీ అందుమా అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
అందానికే అద్దానివే పాట సాహిత్యం
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్ గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ పుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్ ఓ లచ్చా గుమ్మాడీ అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది హే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ నీ శ్వాసగా మారేందుకే ఆపూల గంధాల గాలున్నది మెల మెల మెల మెల ఉప్పెన నేనై వస్తా నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా గల గల గల గల మువ్వని నేనై వస్తా నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది
బంగారు కళ్ల బుచ్చెమ్మో పాట సాహిత్యం
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: ఉదిత్ నారాయణ్ బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమన్నాదే బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో చరణం: 1 నీలో చింతచిగురు పులుపున్నదే బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట కవ్వంలాగ చిలికే కులుకున్నదే తళుకుల గుట్ట మెరుపుల తట్ట నీలో చింతచిగురు పులుపున్నదే కవ్వంలాగ చిలికే కులుకున్నదే కొంటెమాట వెనుక చనువున్నదే తెలుసుకుంటే మనసు పిలుపున్నదే కళ్లుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే ముసుగే లేకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో చరణం: 2 నిన్న నేడు రేపు ఒక నిచ్చెన సిరిసిరి మువ్వ గడసరి గువ్వ మనకు మనకు చెలిమే ఒక వంతెన సొగసుల మువ్వా ముసిముసి నవ్వా నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా మురళి కాని వెదురై పోదా జన్మ చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయీ జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయమరాఠీ బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
డుం డుం డుం నటరాజు ఆడాలి పాట సాహిత్యం
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: శంకర్ మహదేవన్ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా గుండెల్లో గురి ఉంటే ఎదగాలి తారలే కళ్ళుగా నీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరీడుగా బ మాట నుంచి భా మాటదాక నాదేనురా పైఆట ఆడితప్పనేమాట అయ్యా చూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హే అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా బ్రహ్మన్న పుత్రా హే బాలచంద్ర చెయ్యెత్తి జే కొట్టరా పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా వేసంగి లోన పూసేటి మల్లి నీ మనసు కావాలిరా అరె వెలిగించరా లోని దీపం అహ తొలగించరా బుద్ధిలోపం ఓహో ఆత్మేరా నీ జన్మ తార సాటి మనిషేరా నీ పరమాత్మా డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా చూపుంటే కంట్లో ఉపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా చూపుంటే కంట్లో ఉపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా నీవు నీకు తెలిసేలా నిన్ను నీవు గెలిచేలా మార్చాలిరా మన గీత చిగురంతా వలపో చిలకమ్మా పిలుపో బులపాఠం ఉండాలిరా పెడవుల్లో చలి ఇలా పెనవేస్తే చలి గోల చెలగాటం ఆడాలిరా అహ మారిందిరా పాత కాలం నిండు మనసొక్కటే నీకు మార్గం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా బ మాట నుంచి భా మాటదాక నాదేనురా పైఆట ఆడితప్పనేమాట అయ్యా చూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా