చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి నటీనటులు: తరుణ్ , రిచా, సాయి కిరణ్ దర్శకత్వం: కె.విజయభాస్కర్ నిర్మాతలు: రామోజీ రావు, స్రవంతి రవికిశోర్ విడుదల తేది: 13.10.2000
Songs List:
అనగనగా ఆకాశం ఉంది పాట సాహిత్యం
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: పి. జయచంద్రన్, చిత్ర అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా... ఆ... ఆ....ఆ... ఆ... ఆ... ఆ... ఆ...ఆ... ఆ... ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నాకోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా... ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి
సుక్రియ సుక్రియ పాట సాహిత్యం
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువన చంద్ర గానం: కోటి, సుజాత సుక్రియ సుక్రియ
అమ్మమ్మలు తాతయ్యల పాట సాహిత్యం
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువన చంద్ర గానం: దేవన్, అనురాధ శ్రీరాం అమ్మమ్మలు తాతయ్యలు
ఎక్కడ ఉన్నా పాట సాహిత్యం
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: శ్రీరాం పార్ధసారధి, గోపిక పూర్ణిమ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయ్యానా పేరుకైన నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన లాలా లాల లా లాలా లాల లా లాలా లాల లా లాలా లాల లా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి లాలా లాలా లాలా హేహే లాలాలా చరణం: 1 నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తాననెవరుంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం వెన్నెలకన్నా చల్లగా వున్నా చిరునవ్వేదో తాకుతువుంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచి నట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటౌతుందో ఇలా నా ఎద మాటున ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేం అల్లరి లాలా లాల లా లాలా లాల లా లాల లాల లాల లాల (3) చరణం: 2 కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంతా ఉలికి ఉలికి పడలేదుకదా మనకు తెలియనది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన నా నీడైన అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడా నువ్వయ్యానా పేరుకైన నేను లేనా దీని పేరేన ప్రేమానే ప్రియ భావన ఓ... దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన లాలా లాల లా లాలా లాల లా లాల లాల లా హుఁ హుఁ హుఁ
ఒలె ఒలె ఒలె ఓల ఓలా పాట సాహిత్యం
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: రాధిక ఒలె ఒలె ఒలె ఓల ఓలా
కళ్ళలోకి కళ్ళు పెట్టి పాట సాహిత్యం
చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు ఓ..ఓ.. ఓ..ఓ.. ఓ..ఓ..ఓ.. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు ఈనాడె సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకొని ఏం లాభం కలైపొదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయానం ప్రతి క్షణం ఎదురయ్యె నన్నే దాటగలదా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు గాలిపటం గగనానిదా ఎగరెసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్నా మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువు ఎటు వున్నా చినుకులా కరగక శిలై ఉండగలవా... కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పొల్చుటెందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు ఓ..ఓ.. ఓ..ఓ.. ఓ..ఓ..ఓ..