చిత్రం: ఓ పాపా లాలీ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ (All) నటీనటులు: యస్.పి.బాలు, రాధిక దర్శకత్వం: వసంత్ నిర్మాత: వై.సురేందర్ రెడ్డి విడుదల తేది: 27.07.1990
Songs List:
ఏమి పాడేది పాట సాహిత్యం
చిత్రం: ఓ పాపా లాలీ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: మనో ఏమి పాడేది
కర్పూర బొమ్మ పాట సాహిత్యం
చిత్రం: ఓ పాపా లాలీ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: పి. సుశీల కర్పూర బొమ్మ
మాటే రాని చిన్నదాని పాట సాహిత్యం
చిత్రం: ఓ పాపా లాలీ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా!! చరణం: 1 వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!! కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు చరణం: 2 ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు సందెవేళ పలికే నాలో పల్లవి సంతసాల సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు
నీవేగా నా ప్రాణం అంటా పాట సాహిత్యం
చిత్రం: ఓ పాపాలాలి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: కె.జె.యేసుదాస్, చిత్ర నీవేగా నా ప్రాణం అంటా నేడు నీతోడే నా లోకం అంటా నీవేగా నా ప్రాణం అంటా నేడు నీతోడే నా లోకం అంటా నీ నీడగా నే సాగేనులే నీ వెంటా నీవేగా నా ప్రాణం అంటా నేడు నీతోడే నా లోకం అంటా వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నేడు కాదే ఆలపించే పాటలోని తేనె పలుకే నీవు కావే పలికించే నే దిద్దుకొన్న బొట్టుకొక అర్థముంది అంటానే పల్లవించే నీ బంధనాల చందనాలు నాకు తెలుసు విన్నానే కలిసేనులే నే కరిగేనులే నీలోన నీవేగా నా ప్రాణం అంట నేడు నీ తోడే నా లోకం అంట నీవేగా నా ప్రాణం అంట నేడు నీ తోడే నా లోకం అంట కంటి వెలుగై నిలిచిపోనా మనసులోన నిండిపోనా కలలలోని కథను నేనై చివరి వరకు తోడు రానా స్వర్గమేల నా గుండెలోన ఊపిరల్లె నువ్వు ఉంటే అంతేగా నన్ను పిలిచే నీ పాటలోని మాటలోని శృతి నేనే అంతేలే నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడు నీవేగా నా ప్రాణం అంట నేడు నీ తోడే నా లోకం అంట నీ నీడగా నే సాగేనులే నీ వెంట నీవేగా నా ప్రాణం అంట నేడు నీ తోడే నా లోకం అంట
సాగాలి సందెల పాట సాహిత్యం
చిత్రం: ఓ పాపాలాలి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: కె.జె.యేసుదాస్, చిత్ర సాగాలి సందెల
జీవన మంగళ పాట సాహిత్యం
చిత్రం: ఓ పాపాలాలి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: చిత్ర జీవన మంగళ