Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Okkadu (2003)





చిత్రం: ఒక్కడు (2003)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: మహేష్ బాబు, భూమిక
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: యమ్.ఎస్.రాజు
విడుదల తేది: 15.01.2003



Songs List:



హరే రామ హరే రామ పాట సాహిత్యం

 
చిత్రం: ఒక్కడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహాదేవన్

గోవింద బోలోహరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే
రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా

గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే
రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా

చార్మినార్ చాటు కథకి తెలియదీ నిత్య కలహం
భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా
పద పద పద పదపద

హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామా చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా

గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే

సహనాభవతు సహనౌ గుణౌతు సహవీర్యం కరవా వహై
తేజస్వినామతీతమస్తు మావిద్వషావహై

పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం
ఆటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం
శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా
నీ విజయ దశమి రావాలంటే చెడును జయించరా
పద పద పద పదపద

హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామా చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా

గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే
రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా

గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో



నువ్వేం మాయ చేశావోగానీ పాట సాహిత్యం

 
చిత్రం: ఒక్కడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రేయ ఘోషల్

నువ్వేం మాయ చేశావోగానీ 
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి 
మరీ చిలిపిదీ వయసు బాణీ
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా 
చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా 
ఎటు పోతుందో ఏమో మరి

నువ్వేం మాయ చేశావోగానీ 
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి 
మరీ చిలిపిదీ వయసు బాణీ

ఔరా పంచ కళ్యాణి పైన 
వస్తాడంట యువరాజు ఔనా
నువ్వేమైనా చూశావ మైనా 
తెస్తున్నాడా ముత్యాల మేనా
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా 
మొగలి పువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా 
మేళ తాళాల మనువెప్పుడే

ఔరా పంచ కళ్యాణి పైన 
వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైనా చూశావ మైనా 
తెస్తున్నాడా ముత్యాల మేనా

కలా నువ్వు ఏ చాటునున్నా 
అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా 
ఎలాగైనా నిను కలుసుకోనా
హయ్య హయ్యారే హయ్యారే హయ్యా 
ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా 
అది తీరేది ఎపుడన్నది

నువ్వేం మాయ చేశావోగానీ 
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి 
మరీ చిలిపిదీ వయసు బాణీ




చెప్పవే చిరుగాలి పాట సాహిత్యం

 
చిత్రం: ఒక్కడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ... 
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి 
చూపవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి

ఎక్కడే వసంతాల కేళి ఓ... 
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ... 
చూపవే నీతో తీసుకెళ్ళి

ఆశా దీపికలై మెరిసే తారకలు 
చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో 
అడుగే అలై పొంగుతుంది
ఓ... ఓ... చుట్టూ ఇంకా రేయున్నా 
అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ 
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే 
ఆపగలవ షికార్లు

కురిసే సుగంధాల హోళి ఓ 
చూపదా వసంతాల కేళి
కురిసే సుగంధాల హోళి ఓ 
చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి

యమునా తీరాల కథ వినిపించేలా
రాధా మాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళా ఓ 
చెవిలో సన్నాయి రాగంలా
ఓ... ఓ... కలలే నిజమై అందేలా 
ఊగే ఊహల ఊయ్యాలా
లాహిరి లాహిరి లాహిరి తారంగాల 
రాతిరి ఏదని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా 
పొద్దే పలకరించాలి

ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి హో 
చూపదా వసంతాల కేళి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి హో 
చూపదా వసంతాల కేళి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ...
చూపవే నీతో తీసుకెళ్ళి



హాయ్ రే హాయ్ రే హాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఒక్కడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , కార్తీక్

అయ్యబాబోయ్ నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయేంటీ
ఏం ఐడియాలు ఆ నెలవంకను తుంచి 
నా జడలో తురమాలనుందా
దాంతో నా వీపు గోక్కోవాలనుంది

నువ్వేం మాయ చేశావో గానీ
బాగుందే మ్మ్ ఆ తర్వాతర్వాత
ఉఁ హు హు... 
ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీకు చలేస్తుందా - ఉహు
ఆ చున్నీ ఇటిస్తావా ఇవ్వు నాకు చలేస్తుంది
అవును మాయ నేన్ చేశానా

నువ్వేం మాయ చేశావో గానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ

హాయ్ రే హాయ్ రే హాయ్ ఎండనీ రేయి చాటు రాగం విని
ఎవరు తనని పిలిచారని అడిగి చూడు నీ మనసుని
హే కాలాన్నే కదలనీయనీ కనికట్టేం జరగలేదని
ఈ తీయని మాయ తగదని తెలుసా అని
మనసూ నీదే మహిమా నీదే పిలుపు నీదే బదులూ నీదే

నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ

మూగ మనసిది ఎంత గడుసిది
నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది
ఓహో ఇంత కాలమూ కంటి పాపలో
కొలువున్న కల నువ్వే అంటున్నది

హాయ్ రే హాయ్ రే హాయ్ ఎండనీ రేయి చాటు రాగం విని
ఎందుకులికి పడుతుందని అడిగి చూడు నీ మనసుని
హే నిదురించే నీలి కళ్ళలో కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కల ఏం వెతుకుతున్నదో తెలుసా అని
కనులూ నీవే కలలూ నీవే పిలుపూ నీదే బదులూ నీదే

నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ

పిచ్చి మనసిది ఆ ఎంత పిరికిది
నచ్చుతానో లేదో నీకు అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగక
అలలాగ ఎగిరెగిరి పడుతున్నది

హాయ్ రే హాయ్ రే హాయ్ ఎండనీ రేయి చాటు రాగం విని
గాలి పరుగు ఎటువైపని అడిగి చూడు నీ మనసుని
హేయ్ ఏ దారిన సాగుతున్నదో ఏ మజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుతున్నదో తెలుసా అని
పదమూ నీదే పరుగూ నీదే పిలుపూ నీదే బదులూ నీదే

నువ్వేం మాయ చేశావో గానీ ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేశావో గానీ అహా హా ఊ హు  హు హా హా



సాహసం శ్వాసగా పాట సాహిత్యం

 
చిత్రం: ఒక్కడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్ 

సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా

ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకీ
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు

సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా

కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు

సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా




అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా పాట సాహిత్యం

 
చిత్రం: ఒక్కడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్ ,  శ్రేయ ఘోషాల్  

ముత్తైదులంతా ముదమార ఈ బాలకి
మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్షణని క్షీరాబ్ది కన్యకి
ముమ్మారు దిష్టి తీసి దీవించరే

మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది
మెడిసి పడే మదిలో సందడి మేళాలై మోగింది
నీకు నాకు ముందే రాసుంది జోడి 
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా 
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా

గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం 
నీతో పంచుకోనా
ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం 
నాలో దాచగలనా
దరిచేరే నీకోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా

ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మకి
సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే
పట్టుచీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి
తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే

వగలన్నీ నిగనిగలాడవ నన్నల్లే కౌగిళ్ళో
నగలన్నీ వెలవెలబోవా చేరందే నీ ఒళ్ళో
నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి

అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా 
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా

ఒట్టేసి చెబుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనాన ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన
వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా సరేనా

ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే
ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లులుగా అక్షింతలు వేయ్యాలి
ముచ్చట తీరేలా అంతా రండీ

ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి
ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి
పగలు రేయి లేని జగమేలుకోని
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి

అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా 
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా 
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా

Most Recent

Default