Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pavitra Bandham (1996)




చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నటీనటులు: వెంకటేష్ , సౌందర్య, షెర్రీ (తొలిపరిచయం)
మాటలు: పోసాని కృష్ణ మురళి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: సి. వెంకటరాజు, జి. శివరాజు
విడుదల తేది: 17.10.1996



Songs List:



మాయదారి మాయదారి అందమా పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుజాత మోహన్

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా
హయ్య హయ్య హయ్
మాటకారి మాటకారి బంధమా
మహా మాయ చేయ వద్దమ్మా
హయ్య హయ్య హయ్
మదిలోన మొదటి ప్రేమా మితిమీరి పోయె భామా
మది మాటలు మానమ్మా ...
మల్లె గాలి పైన తేలి రామ్మా

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా
హయ్య హయ్య హయ్

మరిగే జాబిలీ కరిగే కౌగిలీ
మదనపడే మదనుడికే విందు చెయ్యాలీ
పెరిగే ఆకలీ కొరికే చెక్కిలీ
మైమరిచే మురిపెముతో కంది పోవాలీ
అందించనీ  అధరాంజలీ
శృతిమించనీ  జతజావళీ
చలిగాలి పైనతేలి చెలరేగు ఈ ఖవాళీ
ప్రతి పూటా కావాలీ
తాళ లేని వేళ లేని కేళీ

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా
హయ్య హయ్య హయ్

కుదురే లేదనీ ముదిరే బాధనీ
తెలుసుకుని అలుసుకుని ముళ్ళు పడి పోనీ
నిదరే రాదనీ అదిరే రాధనీ
అదుముకొని చిదుముకొని చల్లబడి పోనీ
కసిరేపనీ కొసరే పనీ
నిశి కైపునీ నస ఆపనీ
రస రాజధానిలోని రతిరాజుతో జవానీ
సయ్యాటకు సయ్యననీ
మోయలేని మోజు తీరిపోనీ

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్ధమా 
హయ్య హయ్య హయ్
మాటకారి మాటకారి బంధమా
మహా మాయ చేయ వద్దమ్మా
హయ్య హయ్య హయ్





చలి కొడతంది పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర 

చలి కొడతంది



పాటంటే పాటే కాదు పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: సురేష్ పీటర్స్, అనురాధ శ్రీరాం 

పాటంటే  పాటే కాదు 




ఐసలకడి పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు,, ఆశా భోస్లే

ఐసలకడి 



ఓ మై డాడీ పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు,, మనో , చిత్ర 

ఓ మై డాడీ 




అపురూపమైనదమ్మ ఆడజన్మ పాట సాహిత్యం

 
చిత్రం: పవిత్రబంధం (1996)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జె. యేసుదాస్

కార్యేషుదాసి  కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా...
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
బ్రతుకుతుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆర్తిలో
సతిని మించగలరా మరే ఆప్తులు
ఏ పూజ చేసినా ఏ నోము నోచినా
ఏ స్వార్దము లేని త్యాగం
భార్యగా రూపమే పొందగా...

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

కలిమిలేములన్నీ ఒకే తీరుగా
కలిసి పంచుకోగా సదా తోడుగా
కలిసి రాని కాలం వెలే వేసినా
విడిచి పోని బంధం తనై ఉండగా
సహధర్మచారిణి సరిలేని వరమణి
సత్యాన్ని కనలేని నాడు
మోడుగా మిగలడా పురుషుడు...

అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
జీవితం అంకితం చేయగా..

కార్యేషుదాసి  కరణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభ

Most Recent

Default