చిత్రం: పెద్దన్నయ్య (1997) సంగీతం: కోటి నాటినటులు: బాలక్రిష్ణ, రోజా, ఇంద్రజ దర్శకత్వం: శరత్ నిర్మాత: నందమూరి రామకృష్ణ విడుదల తేది: 10.01.1997
Songs List:
ఓ ముస్తఫా నీ ముద్దబంతి పాట సాహిత్యం
చిత్రం: పెద్దన్నయ్య (1997) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, చిత్ర ఓ ముస్తఫా నీ ముద్దబంతి బుగ్గ మీద ముద్దుపెట్టనా దిల్ దిల్రుబా నీ కన్నె లేత మొగ్గలన్ని రాలగొట్టనా ఓయమ్మో ఒళ్ళంతా వయ్యారాలు వద్దన్నా కవ్వించే సింగారాలు బోలెడంత అందమున్న వేలేడంత వెన్నెలాక్షి ఓ ముస్తఫా నీ ముద్దబంతి బుగ్గ మీద ముద్దుపెట్టనా దిల్ దిల్రుబా నీ కన్నె లేత మొగ్గలన్ని రాలగొట్టనా కొత్త రాధ కోక చేదా నిన్ను చూడబోతే కంటికెంతో బాధ ఓసి పిల్లా నత్తగూళ్ల నిన్ను వత్తబోతే ఉన్న బొడ్డు గుల్ల సిగ్గే డైవర్స్ ఇచ్చే అమ్మడు నీతో రొమాన్స్ ఆడేదెవ్వడు తిక్కలాడి చక్కనోడ్ని ఆపేదెట్టా ముక్కుతాడు వేసేది ఎట్టా వీడి ఒంగోలు వరసలు కొమ్ము విరిసితే దుమ్ము దులుపుడులే ఓ ముస్తఫా నీ ముద్దబంతి బుగ్గ మీద ముద్దుపెట్టనా దిల్ దిల్రుబా నీ కన్నె లేత మొగ్గలన్ని రాలగొట్టనా ఓసి పాప పాల పీపా తోడుపెట్టుకోవే నాకు జోడి కట్టి ఓసి గుంట తగ్గమంట నువ్వు కొట్టుకోకు డాబులమ్మ గంట గుడ్బై టాటా చెప్పేటప్పుడు ముద్దే నీకు ఇచ్చేదెవ్వరు ఆకతాయి పిల్లగాడ్ని ఆపే దెట్టా వాడి జోరు దించే దెట్టా వాడి వేసంగి పరువపు వేడి ముదిరితే వీపు పగులునులే ఓ ముస్తఫా నీ ముద్దబంతు లాటలింక కట్టిపెట్టవా కిస్ కిస్తఫా నీ కుర్రకారు కిర్రుదించి కిందపెట్టనా ఓయమ్మో ఒళ్ళంతా వయ్యారాలు హే వద్దన్నా కవ్వించే సింగరాలు బోలెడంత అందమున్న వేలేడంత వెన్నెలాక్షి
నీ అందమంత చిందగొట్టి పాట సాహిత్యం
చిత్రం: పెద్దన్నయ్య (1997) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, చిత్ర నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నిస రిరి స నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ అధరం మందారం మధురం తాంబూలం అందం ఆనందం మాపటి మకరందం పరువాల తొణికిస పాడే పదనిస జంట గుసగుసలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో ప రిపరినిస స నినిసనిప పరిసరి పరిసరి పరి సరిప పరి సనిప పరి సనిప పరిరి రిరి రిరి సనిప సస సస సస సని పని రిసరిమ సరిపమ రిమపని మపనిస అమ్మో పైటప్ప కొండ ఆపై కోకమ్మ కోన కన్నె చెట్టు తేనేపట్టు నాది తేనేటీగ కుట్టినంత తీపి తోటమాలి చూపు ఎక్కడుందో తోరణాల కాపు అక్కడుంది నడుమెక్కడో వెతకాలి నడిబొడ్డునే అడగాలి తొడిమెక్కడో తెలియాలి తొలిసిగ్గునే దులపాలి అదిరింది చెలీ... ఓ ఓ ఓ ఓ ఓ... నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో ఆ... ఆ...ఆ...ఆ... అమ్మో నీ ముద్దు మోత అసలే నా బుగ్గలేత రాజుకుంది అగ్గిపూల వోణి రానిపోని చుంబనాల బోణి నిన్ను చూడకుండ నీలవేణి నిద్దరైన పోనే కోడెగాడ్ని గువ్వెప్పుడో కూసింది గుట్టప్పుడే తెలిసింది పొయ్యెప్పుడో రగిలింది పొంగిప్పుడే తగిలింది అదిరింది చలి... ఓ ఓ ఓ ఓ ఓ... నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ అధరం మందారం మధురం తాంబూలం అందం ఆనందం మాపటి మకరందం పరువాల తొణికిస పాడే పదనిస జంట గుసగుసలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ
చక్కిలాల చుక్కా చక్కగుందిరో పాట సాహిత్యం
చిత్రం: పెద్దన్నయ్య (1997) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, చిత్ర హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా చక్కిలాల చుక్కా చక్కగుందిరో పిక్కలావు చుస్తే తిక్కగుందిరో చక్కిలాల చుక్కా చక్కగుందిరో పిక్కలావు చుస్తే తిక్కగుందిరో ఈడు జున్నుముక్క తోడుపూల పక్క రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో చక్కనోడు ఎంతో టక్కరోడురో దిక్కులాగ నాకు దక్కినాడురో ఆకు లేని వక్క అందగాడి తిక్క మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా (2) హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా పాలబుగ్గ మీగడా పంచదార జల్లెడా నే పట్టబోతే జారిపోయి పక్కకొస్తే పారిపోయే కొత్త ఈడు కోమలాంగి అత్తలోరి అల్లుడా మల్లెపూల మల్లుడా నీ జట్టు నాకు జాతరాయే గుట్టుకాడ అల్లరాయే సూది కళ్ళ సుందరయ్యా తునా బొడ్డు తూనీగ వేస్తానమ్మ నా పాగ పూతరేకు పొత్తిళ్లలో గొబ్బిళ్ళమ్మ నీ పాగ కుచ్చిళ్ళమ్మ జారాక గొబ్బిళ్ళన్ని దోసిళ్ళలో భలిరా బస భలిరా దాని ఎటవాలు చూపు ఏందిరా చక్కనోడు ఎంతో టక్కరోడురో దిక్కులాగ నాకు దక్కినాడురో ఈడు జున్నుముక్క తోడుపూల పక్క రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా అల్లరింటి పిల్లడు గిల్లమంటే గిల్లడు నా కొత్తలన్ని పాతచేసి సిగ్గులన్ని పాతరేసి కోన సీమ కోడెగాడు ఇవ్వమంది ఇవ్వదు అవ్వ బువ్వ పెట్టదు నా ముద్దునాకు ఇవ్వదాయె ముద్దబంతు లాడదాయె పావు చీర పంకజాక్షి వయ్యారాల ఉయ్యాల ఒళ్ళో వేస్తా ఇయ్యాల నింగి నేల నీ నీడగా సంసారాల సందెల్లో సింగారాల చిందుల్లో నీకు నాకు గాలాడదు బిగిసే కసి గిలిలో కౌగిలింత పట్టు బాగనాడరా చక్కిలాల చుక్కా చక్కగుందిరో పిక్కలావు చుస్తే తిక్కగుందిరో ఆకు లేని వక్క అందగాడి తిక్క మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా (2)
కుటుంభం అన్నగారి కుటుంభ పాట సాహిత్యం
చిత్రం: పెద్దన్నయ్య (1997) సంగీతం: కోటి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, చిత్ర కుటుంభం అన్నగారి కుటుంభం (4) విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంభం అన్నగారి కుటుంభం (2) చరణం: 1 తీపి తీపి దరహసాలు హా చేదు చేదు పరిహాసాలు పులుపు పులుపు భులపాటాలు వగరు వగరు గుణపాఠాలు ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై నిలిచిన ఆనంద మందిరం నిలిచిన ఆనంద మందిరం కుటుంభం అన్నగారి కుటుంభం (2) చరణం: 2 అమ్మంటే ఎవరో కాదు అనురాగ మణిదీపమే అన్నంటే ఎవరో తెలుసా ఆ రాముని మరో రూపమే తమ్ముల్లే తోడుగా నిత్యం కళ కళ లాడగా తమ్ముల్లే తోడుగా నిత్యం కళ కళ లాడగా ఈ ఇల్లే పూర్ణకుంభం ఈ ఇల్లే పూర్ణకుంభం కుటుంభం అన్నగారి కుటుంభం (2) విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంభం అన్నగారి కుటుంభం (2)
కల్లో కల్యాణమాల పాట సాహిత్యం
చిత్రం: పెద్దన్నయ్య (1997) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, చిత్ర కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువక రసలీల పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగణము విడిచెను తారక కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ సిరికోయిలా చిలిపి వలపే పాడేనమ్మ యదలోయల కనులే కలలై పండేనమ్మ నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మ నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మ మనసే మనువాడగా జతగా పెనవేయగా ఊర్వసే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ సిరిమల్లిక సిగలో వగలే చిలికేనమ్మ వరమల్లిక వలపై వగలే విసెరేనమ్మ మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ సుముహూర్తమే శుభమై సుఖమై కుదెరేనమ్మ జరిగే మన పెళ్ళికి జగమే విరి పల్లకి ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగ కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువక రసలీల పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగణము విడిచెను తారక కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువక రసలీల
చిక్కింది చామంతి పువ్వు పాట సాహిత్యం
చిత్రం: పెద్దన్నయ్య (1997) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్. పి. బాలు, చిత్ర చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు వచ్చింది పచ్చిసు వయసు పిల్లకెట్టాగ తెలిపేది మనసూ నీ ఆశ ఇందాకే తెలుసు పైట పెట్టేసి చూసేయి సొగసు చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు అరె ఈ కొండ కోనల్లో పచ్చి నీరెండ ఛాయాల్లో నీలి చెలయేటి తరగల్లో ఒళ్లు తడిమేసుకుందామా హే నన్ను ఇట్టగా ఊరిస్తే ఒళ్ళు తడిమేసి కవ్విస్తే నేను ఉయ్యాలనైపోనా నీ ఒళ్లోన పడిపోనా అరె పిల్ల ఒళ్లోన పడితే వయ్యారమంతా వత్తేసి పట్టేయనా ఓసి నాజూకు తనమా నడుమొంపులోన నాట్యాలు చేసేయనా నువ్వు కొంగులు పట్టే కృష్ణుడు వైతే నీ రాధ నేనవ్వనా... చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు అరెరరె పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు వచ్చింది పచ్చిసు వయసు పిల్లకెట్టాగ తెలిపేది మనసూ చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు సోకు మందార పువ్విచ్చి మోజు ముద్దుల్లో కరువచ్చే కోటి కల్యాణ రాగాలే నా ఎదలోన వినిపించే కన్నే గోదారి పొంగొచ్చే వెన్ను వనికేటి వయసొచ్చే మల్లే తీగల్లే కౌగిట్లో నువ్వు కులికేటి వేలొచ్చే నువ్వు అవునంటే చాలు చూస్తాను వీలు అందాల బావయ్యో నా పగడాల పెదవి పొగరంత కాస్తా చూసేయి ఓరయ్యో నిన్ను చుట్టేసి కట్టేసి వెన్నెల్లోనా ఏలేలో పాడేయనా చిక్కింది చామంతి పువ్వు దాని బుగ్గల్లో దాక్కుంది నవ్వు అమ్మోయమ్మ పుట్టింది గుండెల్లో జివ్వు చూపు గాళాలు గుప్పించి రువ్వు వచ్చింది పచ్చిసు వయసు పిల్లకెట్టాగ తెలిపేది మనసూ నీ ఆశ ఇందాకే తెలుసు పైట పెట్టేసి చూసేయి సొగసు