Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Prema Katha (1999)




చిత్రం: ప్రేమ కథ (1999)
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: సుమంత్ , ఆంత్ర మాలి
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్ గోపాల్ వర్మ
విడుదల తేది: 04.10.1996



Songs List:



దేవుడు కరుణిస్తాడని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కథ (1999)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాధా శ్రీరామ్, రాజేశ్

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని 
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని 
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో 
మనసున మనసై బంధము వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈ పైన
కడదాకా సాగనా

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని 
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని 
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ

నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగా నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది 
ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నా కోసం
ఎవరేమి అనుకున్నా

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని 
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని 
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ

ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకూ
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకూ
ఎటేళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే
నేనంటూ ఉంటానా...

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని 
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని 
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో 
మనసున మనసై బంధము వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈ పైన...
కడదాకా సాగనా...

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని 
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని 
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ





ఛాంగురే హంగామా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కథ (1999)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్యారావు

ఛాంగురే హంగామా అందరూ రండమ్మా 
పందిట్లో పెళ్లంట పండగలే మా ఇంట 
సంగతే చూద్దామా సందడే చేద్దామా 
ముద్దొచ్చే ఈ జంట సిద్దంగా ఉందంట 
హే మహారాజునే చూస్తూ దిష్టి తీయరేమి 
గోల గోల చేసే అందరు ఇంట 
మహారాణిని దీవిస్తూ తెగ మోగిందే 
ఆనందంతో కోవెల గంట 
ఛాంగురే హంగామా అందరూ రండమ్మా 

చరణం: 1 
పందిట్లో పెళ్లంట పండగలే మా ఇంట 
సంగతే చూద్దామా సందడే చేద్దామా 
ముద్దొచ్చే ఈ జంట సిద్దంగా ఉందంట 
హే మహారాజునే చూస్తూ దిష్టి తీయరేమి 
గోల గోల చేసే అందరు ఇంట 
హే మహారాణిని దీవిస్తూ తెగ మోగిందే 
ఆనందంతో కోవెల గంట 
ఛాంగురే హంగామా అందరూ రండమ్మా 
పందిట్లో పెళ్లంట పండగలే మా ఇంట 

చరణం: 2 
హోరు హోరుమంది మైకులో కచేరి 
హే వైభవంగా ఉంది ఊరువాడ చేరి 
గానా బజానా ఊపందుకుంది 
ఖానా ఖజనా ఊరించుతుంది 
మహా జోరు మీదుంది పేకాట పార్టీ 
కదలదులెండి వదిలెయ్యండి 
కాఫీలు టీలంటూ కలబడుతుంటే 
వంట ఆగుతుంది విందు సాగదండి 
ఛాంగురే హంగామా అందరూ రండమ్మా 
పందిట్లో పెళ్లంట పండగలే మా ఇంట 
సంగతే చూద్దామా సందడే చేద్దామా 
ముద్దొచ్చే ఈ జంట సిద్దంగా ఉందంట 

చరణం: 3 
మూడు ముళ్ళు వేసే ముచ్చటైన వేళ 
వీడియోలు తీసే వేడుకైన వేళ 
ఆకాశమంతా రంగేళి హోలి 
ఆ తారలంతా ఈ నేల వాలి 
వారెవా ఏం పెళ్ళి అని అంటుంటే 
అది మేం వింటే పదివేలండీ 
మా ఇంట్లో కళ్యాణం పదుగురి ఎదలో 
పదికాలాలు నిలవాలండి 

ఛాంగురే హంగామా అందరూ రండమ్మా 
పందిట్లో పెళ్లంట పండగలే మా ఇంట 
సంగతే చూద్దామా సందడే చేద్దామా 
ముద్దొచ్చే ఈ జంట సిద్దంగా ఉందంట 
మహారాజునే చూస్తూ దిష్టి తీయరేమి 
గోల గోల చేసే అందరు ఇంట 
మహారాణిని దీవిస్తూ తెగ మోగిందే 
ఆనందంతో కోవెల గంట




నీ కోసం నిరీక్షణ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కథ (1999)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్

నీ కోసం నిరీక్షణ నాలోని ఈ వీక్షణ 
నిజము చెబుతున్నా చెలియా 
ప్రతి క్షణమున నీ ఆలోచన 
ప్రతి స్వరమున నీ ఆలాపన 
నీ కోసం నిరీక్షణ నాలోని ఈ వీక్షణ 
నిజము చెబుతున్నా చెలియా 
ప్రతి క్షణమున నీ ఆలోచన 

చరణం:1 
ఈ రాగం స్వరం లేని ఈ భావం ఏదో గానీ 
నిన్ను ఇంతలా అల్లేసిందని రహస్యాన్ని దాచే కలా 
నాతో పంచుకో తప్పేం లేదుగా జతై ఆదుకుంటానుగా 
ఇదే ప్రేమని నువ్వు తెలుసుకో ఏమవుతామని భయం మానుకో 
నీ కోసం నిరీక్షణ నాలోని ఈ వీక్షణ 

చరణం:2 
ఐ లవ్ యు అనే మాట నే నీతో అనే ఉంటా 
నువ్వా మాటని వినే లేదని సందేహించకే అంతగా 
నువ్వుండేది నా గుండెల్లో అని ఇంకా నీకు అనుమానమా 
అహో ప్రేమికా నిజం తెలియదా 
అదో మాయగా అలా చూడక 

నీ కోసం నిరీక్షణ నాలోని ఈ వీక్షణ 
నిజము చెబుతున్నా చెలియా 
ప్రతి క్షణమున నీ ఆలోచన 
ప్రతి స్వరమున నీ ఆలాపన




కొక్కొరొకో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కథ (1999)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్

కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే 
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే 
మీది నుంచి సూదులోచ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే 
ఎల్లయ్యో మల్లయ్యో కళ్ళు తెరిచి చూడండయ్యో 
రామయ్యో కృష్ణయ్యో అల్లరల్లరి చేయండయ్యో 
ఊరుకుంటే ఊరు కాస్తా ఉషారు తెలీక ఉసూరుమంటది 
హే కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే 
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే 
మీది నుంచి సూదులోచ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే 

చరణం: 1 
సెటప్పులుంటవి సిగ్గు పడతవి తప్పుకోరా 
అవస్థ పడతవి వద్దు మనకవి తప్పు కదరా 
ఆరా తీస్తూ ఆరోగ్యం చెడిపోతే కష్టం 
ఎక్కడి దొంగలు అక్కడనే గుప్ చుప్ అనుకుందాం 
అటు చూస్తూ చిటికేస్తూ నువ్వు ఎరక్క ఇరక్కురా 

కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే 
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే 
మీది నుంచి సూదులోచ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే 

చరణం: 2 
ఒక్కొక్క కడవకి ఒక్క తడవకి ఒక్క రాయే 
సరిగ్గా తగలక తప్పు జరిగితే తెగ లడాయే 
బాగా ప్రాక్టీస్ ఉంటేనే వేళాకోళం చెయ్ 
చాలా ఈజీ అనుకుంటే బోల్తా పడతవురోయ్ 
ఎరవేస్తే గురి చేస్తే మరి వెనక్కు తిరక్కురో శభాష్ 

కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే 
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే 
మీది నుంచి సూదులోచ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే 
ఎల్లయ్యో మల్లయ్యో కళ్ళు తెరిచి చూడండయ్యో 
రామయ్యో కృష్ణయ్యో అల్లరల్లరి చేయండయ్యో 
ఊరుకుంటే ఊరు కాస్తా ఉషారు తెలీక ఉసూరుమంటది




సండే మండే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కథ (1999)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర

సండే మండే వదిలేయ్ నేన్ బీజీ మై రోజీ 
ట్యూస్ డే ఫిల్మ్ ప్రోగ్రామ్ ఈ రోజే ఫిక్స్ చేద్దాం 
ట్యూస్ డే వెరీ సారీ.. హాలీ డే డాడీకి 
వెడ్ నెస్ డేకి మన ప్రోగ్రామ్ మారిస్తే నో ప్రాబ్లమ్ 
నాకు వీలైనదే నీకు జైలైనదే 
నాకు వీలెప్పుడో నీకు పనులప్పుడే 
అయితే మరేం చేద్దాం నీతో మహా కష్టం 
రానన్నానా బుధవారం కాదన్నానా నీ ఇష్టం 

చరణం: 1 
థర్స్ డే మార్నింగ్ ఓకే కదా 
పొద్దున్న ఇంట్లో పనుండదా 
ఆ రోజు ఈవినింగ్ బాగుండదా 
బాబా గుడికి వెళ్ళాలి కదా 
మర్నాడు ఐనా సరే 
మనకారోజు చుక్కెదురే 
అరెరెరె ఏంకొంప మునిగిందట 
అ రోజు రాఖీ కదా 
ఐతే మరేం చేద్దాం నీతో మహా కష్టం 
నననన రానన్నానా బుధవారం 

సండే మండే వదిలేయ్ నేన్ బీజీ మై రోజీ 
ట్యూస్ డే ఫిల్మ్ ప్రోగ్రామ్ ఈ రోజే ఫిక్స్ చేద్దాం 
ట్యూస్ డే వెరీ సారీ.. హాలీ డే డాడీకి 
వెడ్ నెస్ డేకి మన ప్రోగ్రామ్ మారిస్తే నో ప్రాబ్లమ్ 

చరణం: 2 
శనివారం నీకు హాఫ్ డే కదా 
సగం రోజుతో ఏం సరదా 
ఆదివారమంతా మనదే కదా 
నో చాన్స్ ముందే చెప్పాకదా 
శనివారం నీకు హాఫ్ డే కదా 
సగం రోజుతో ఏం సరదా 
ఆదివారమంతా మనదే కదా 
నో చాన్స్ ముందే చెప్పాకదా 
ఏముద్దరిస్తారంట 
చెబితే అదో తంటా 
ఏం పాడు సీక్రెట్టదీ 
క్రికెట్ మ్యాచు ఉంది 
క్రికెట్ ని లవ్ చేసుకో నీ ముఖాన్ని చూడనుపో 
అరెరెరె నూరేళ్ళ లవ్ అనుక్కో వన్ డే ఇస్తే ఏం రిస్కో 

సండే మండే వదిలేయ్ నేన్ బీజీ మై రోజీ 
ట్యూస్ డే ఫిల్మ్ ప్రోగ్రామ్ ఈ రోజే ఫిక్స్ చేద్దాం 
ట్యూస్ డే వెరీ సారీ.. హాలీ డే డాడీకి 
వెడ్ నెస్ డేకి మన ప్రోగ్రామ్ మారిస్తే నో ప్రాబ్లమ్ 
నాకు వీలైనదే నీకు జైలైనదే 
నాకు వీలెప్పుడో నీకు పనులప్పుడే 
అయితే మరేం చేద్దాం నీతో మహా కష్టం 
రానన్నానా బుధవారం కాదన్నానా నీ ఇష్టం




ప్రేమ సంగతి ఏంటో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ కథ (1999)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్యారావ్

ప్రేమ సంగతి ఏంటో


Most Recent

Default