చిత్రం: ప్రియమైన నీకు (2001) సంగీతం: శివశంకర్ నటీనటులు: తరుణ్ , స్నేహ, శివాజి, ప్రీతి విజయ్ కుమార్ దర్శకత్వం: బాలశేఖరన్ నిర్మాత: ఆర్. బి. చౌదరి విడుదల తేది: 11.02.2001
Songs List:
మనసున ఉన్నదీ పాట సాహిత్యం
చిత్రం: ప్రియమైన నీకు (2001) సంగీతం: శివశంకర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర మనసున ఉన్నదీ చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బైటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో తెలపక పోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా లలలా... లల లల లల లల లాలాలా... లలలా... లల లల లల లల లాలాలా... చింత నిప్పైన చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని తననే తలుచుకునే వేడిలో ప్రేమ అంటేనె తియ్యని బాధని లేత గుండెల్లొ కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత అని అడగాలనీ అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ తెలపక పోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా నీలి కన్నుల్లొ అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని నిదరే కసురుకునే రేయిలో మేలుకున్నా ఇదేం వింత కైపని వేల ఊహల్లొ ఊరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలనీ పగలేదో రేయేదో గురుతే లేదనీ తెలపక పోతే ఎలా మనసున ఉన్నదీ చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బైటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో తెలపక పోతే ఎలా... ఆ... లలలా... లల లల లల లల లాలాలా... లలలా... లల లల లల లల లాలాలా...
నచ్చెనురా నచ్చెనురా పాట సాహిత్యం
చిత్రం: ప్రియమైన నీకు (2001) సంగీతం: శివశంకర్ సాహిత్యం: వసంత్ గానం: శంకర్ మహదేవన్, హరిణి, కృష్ణ రాజ్ నచ్చెనురా నచ్చెనురా ఈ ఫిగరు నచ్చెనురా ఓ లుక్కు వేసెయ్ సోదరా... కాశ్మీరీ యాపిల్లే తలదన్నే ఈ కన్నే అందానికి అందం చూడరా బీ హ్యాపీ బీ హ్యాపీ బాయ్ బాయ్ లైఫంత చేసెయ్ రా ఎంజాయ్ టీనేజీ పవరేంటో చూపెయ్ వచ్చిందే క్యాట్ వాకింగ్ లేడీ సైయ్యంటే కట్టెయ్నా జోడీ నిను చూస్తే వేడెక్కే నాడీ ఫ్యాషన్ కే నే న్యూ ఓషన్ సృష్టించేయ్నా ఓ సెన్షేషన్ నేనంటే యూత్ కి టెంప్టేషన్ నీ చూపులు చేసే మేజిక్ నీ మాటలు లవ్ కే లాజిక్ నిను చేసిన బ్రహ్మ ఎదురైతే బ్లాంక్ చెక్ రాసిచ్చెయ్ మా మీ మాటలు హయ్యో టూ మచ్ మీ చూపులు చేసేయ్ గిమ్మిక్స్ మీ నూగు మీసాలకి నే పాస్ బుక్ రాసిచ్చెయ్నా చెంతకొస్తే ఓ సోనా చార్మినారే రాసేయ్ నా బోలో బోలో బోలో బోలో మాపటేల మస్తాన సోకులన్ని ఇచ్చెయ్ నా చెలో చెలో చెలో చెలో స్ట్రాబెర్రీ కళ్లకు ఓ ఫ్లాట్ క్యాడ్బరి కౌగిలికో ఫ్లైట్ నేను రాసేయ్ నా ఊ అంటే ఓహో నా సోనా ఒక్క స్మైలిస్తే అదిచాలు మాకది ఖాతా పదివేలే లుంబుకే పోదాం ఖండాల నువ్వుంటే చాలే హాయ్యో రామ హైరామ అని అల్లరికే పెట్టెయ్ కామా వీధుల్లో ఏంటి హంగామా హిస్టరీ కే అందని ఓ మిస్టరీ యే ఈ ప్రేమ బోలో బోలో బోలో బోలో పెను తూఫానే ఎదురైనా ప్రేమతో అది గెలిచెయ్నా బోలో బోలో బోలో బోలో శాటిలైట్ కాలంలో అయినా ఈ ప్రేమ మారదురా నాన్న ప్రేమలేకుంటే ఓ భాయి సృష్టే లేదురా ఎవరైన లవ్వే చేసుంటే అడ్డంకులేమైనా ఉంటే చేయూత నిచ్చి ఓదార్చి కలిపేద్దామురా నచ్చెనురా నచ్చెనురా ఈ ఫిగరు నచ్చెనురా ఓ లుక్కు వేసెయ్ సోదరా... కాశ్మీరీ యాపిల్లే తలదన్నే ఈ కన్నే అందానికి అందం చూడరా బీ హ్యాపీ బీ హ్యాపీ బాయ్ బాయ్ లైఫంత చేసెయ్ రా ఎంజాయ్ టీనేజీ పవరేంటో చూపెయ్ వచ్చిందే క్యాట్ వాకింగ్ లేడీ సయ్యంటే కట్టెయ్నా జోడీ నిను చూస్తే వేడెక్కే నాడి నచ్చెనురా నచ్చెనురా ఈ ప్రేమే నచ్చెనురా ప్రేమను ప్రేమించేయ్ సోదరా
వేయి జన్మాల పాట సాహిత్యం
చిత్రం: ప్రియమైన నీకు (2001) సంగీతం: శివశంకర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి నిను దాచే ఈ నిషి నిలిచేనా ప్రేయసి నలువైపుల నల్లని చీకట్లే ఎదురొస్తూవున్నా పరుగాపని పాదం దూరంతో పోరాడుతువున్నా కనుపాపకి ఉప్పని కన్నీరే తెర వేస్తూ ఉన్నా ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి గాలితో నువ్వు పంపిన వలపు ఊసేమిటో పూలలో నువ్వు పంపిన తీపి తలపేమిటో నిన్నదాక నను చేరలేదని నమ్మదా చెలి నీ మౌనం నా శ్వాసలో రగిలే గాలులతో నిను వెతికేస్తున్నా నా ప్రేమను పూల సువాసనతో నీకందిస్తున్నా ఎద సవ్వడులే ఆ గువ్వలుగా ఎగరేస్తూవున్నా అవి నిన్నే చూడాలి నువ్వెక్కడ ఉన్నా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి ఆశగా ఉంది నెచ్చెలి కలుసుకోవాలని కోవెలై ఉంది కౌగిలి దేవి రావాలని నీవు కలవని కలవు కాదని రుజువు చేయని అనురాగం నను నేనే శిలగా మోస్తున్నా ఎద బరువైపోగా చిరునవ్వుల్నే వెలివేస్తున్నా నిను చూసే దాకా ప్రతి రక్త కణం వెలిగిస్తున్నా పెనుజ్వాలైపోగా ఏడబాటు పొరబాటు కరిగించేదాక వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి నిను దాచే ఈ నిషి నిలిచేనా ప్రేయసి నలువైపుల నల్లని చీకట్లే ఎదురొస్తూవున్నా పరుగాపని పాదం దూరంతో పోరాడుతువున్నా కనుపాపకి ఉప్పని కన్నీరే తెర వేస్తూ ఉన్నా ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నాగుండెకి
మస్తు మస్తు పాట సాహిత్యం
చిత్రం: ప్రియమైన నీకు (2001) సంగీతం: శివశంకర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిణి, శంకర్ మహదేవన్ You are a Man I'am your Woman Look into my eyes Look deep into my eyes You are Loving me You are Entering Love Common...Common... Love me.. Love me... మస్తు మస్తుగున్న యవ్వనాల పవరు చూపెయ్ మగధీర రారా రారా అందాల ప్యార్ వీర రారా రారా రతి నీదే రాకుమారా హేయ్ ఏంటే మీ హంగామా Y2K భామా రేపగలు ముద్దుల్లో ముంచేస్తానమ్మా కల నిజమైన కథ మొదలైన హేయ్ మళ్ళి మళ్ళీ ఎందీ మాంగీమో రారా రారా అందాల ప్యార్ వీర రారా రారా రతి నీదే రాకుమారా మస్తు మస్తుగున్న యవ్వనాల పవరు చూపెయ్ మగధీర హే వేసెయ్నా వయుసులు కోరే మంత్రం నా కసి కసి గువ్వా జుం అ జుం జుం జుమకు జుమకు జుం జుం అ జుం జుం జుమకు జుమకు జుం జుం హో చేసెయ్ నా టమకము తీరే తంత్రం నా మగసిరి నువ్వా జుం అ జుం జుం జుమకు జుమకు జుం జుం అ జుం జుం జుమకు జుమకు జుం జుం ఓ... వయ్యారాల వీణను పట్టి శృతించేయ్న అంగాంగాలు అందాలన్నీ అందించేయ నా నచ్చావే చిన్నారి చుపించెయ్ దారి చేద్దాం చలో ఖుషీ పదరా మగడా సొగసైన చిలక నీదే యమహో చెలియా ఎదురీదు వయసు నాదే మస్తు మస్తుగున్న యవ్వనాల పవరు చూపెయ్ మగధీర జారింది జివు జివు లాడే పైట పద పద పదమంటు జుం అ జుం జుం జుమకు జుమకు జుం జుం అ జుం జుం జుమకు జుమకు జుం జుం ఓ సాగిస్తా మధువతి కోరే వేట సుఖమస్తు అని అంటూ జుం అ జుం జుం జుమకు జుమకు జుం జుం అ జుం జుం జుమకు జుమకు జుం జుం నయాగరా జలపాతంలా నన్నే కమ్ముకో వసంతాల ఉల్లాసాలే చెలి నింపుకో వారేవా కిల్లాడి నువ్వేలే నా జోడి అందం రెడీ రెడీ ఆజా ఆజా అందాల రాణి ఆజా లేజా లేజా ఈ సోకు నీదే లేజా మస్తు మస్తుగున్న యవ్వనాల పవరు చూపెయ్ నా చెలియా రారా రారా అందాల ప్యార్ వీర రారా రారా రతి నీదే రాకుమారా హేయ్ ఏంటే మీ హంగామా Y2K భామా రేపగలు ముద్దుల్లో ముంచేస్తానమ్మా కల నిజమైన కథ మొదలైన హేయ్ మళ్ళి మళ్ళీ ఎందీ మాంగీమో ఆజా ఆజా అందాల రాణి ఆజా లేజా లేజా ఈ సోకు నీదే లేజా ఆజా...
నేలనడిగా పాట సాహిత్యం
చిత్రం: ప్రియమైన నీకు (2001) సంగీతం: శివశంకర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు పల్లవి: నేలనడిగా పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి యేదని గాలినడిగా మబ్బులనడిగా రామచిలుక రెక్కలనడిగా క్షేమంగా ఉందా అని అయినా ఇంతవరకు ఆచూకీలేక తెగిన గాలిపటమై తిరిగా ఎటూ దారి తోచక ఆగలేక నా మనసు దోచిన ఆ ప్రేమ ఏనాటికి చూపునో చిరునామా నేలనడిగా పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి యేదని చరణం: 1 ఇపుడే ఇటు వెళ్లిందంటు చిరుగాలి చెప్పింది నిజమే ఇంకా గాలుల్లో చెలి పరిమళముంది ఇందాక చూశానంటు సిరిమల్లే చెప్పింది ఇదిగో అంటూ తనలో చెలి చిరునవ్వే చూపింది ఈ గుడి గంటల్లో తన జాజుల సడి వింటుంటే తను ఈ కోవెల్లో ఇప్పటివరకు ఉన్నట్టే ఎటుచూసినా తన జాడలే ఎటు వెళ్లిందో ఈ లోపునే నేలనడిగా పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి యేదని చరణం: 2 నడయాడే దీపంలాంటి ఆ రూపం చూస్తుంటే కనుపాపల్లో కలకాలం కొలువుండి పోతుంది నడకైన నాట్యంలాగే అనిపించే తనవెంటే దివిలోవుండే మెరుపే దిగివచ్చిందనిపిస్తుంది ఎందరు చూశారో కలగన్నామనుకున్నారో అందుకనే ఏమో తను నిజం కాదనుకున్నారో బతిమాలినా బదులివ్వదే తను ఉందంటే నను నమ్మరే నేలనడిగా పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి యేదని గాలినడిగా మబ్బులనడిగా రామచిలుక రెక్కలనడిగా క్షేమంగా ఉందా అని అయినా ఇంతవరకు ఆచూకీలేక తెగిన గాలిపటమై తిరిగా ఎటూ దారి తోచక ఆగలేక నా మనసు దోచిన ఆ ప్రేమ ఏనాటికి చూపునో చిరునామా నేలనడిగా పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి యేదని
మనసున ఉన్నది పాట సాహిత్యం
చిత్రం: ప్రియమైన నీకు (2001) సంగీతం: శివశంకర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు చిత్రం: ప్రియమైన నీకు (2001) సంగీతం: శివశంకర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా మనదను కున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా మరి మరి తలచి ఊహలలోనే దాచి చాటుగ చూసేదెలా తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా ఇకనైన చెరగాలి నల్లని నీడలా నను వెంటాడే కలా మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా నేలకందించి ఆకాశ గంగని నింగి గుండెల్లో నలుపు కడగని కురిసే చల్లని వాన జల్లుతో కళ్ళు ముందున్న సత్యాన్ని చూపని రెప్ప చాటున్న నిదుర కరగని ఉబికే వెచ్చని కన్నీళ్ళతో అందిస్తున్నా నా ప్రియమైన నీకు అక్షింతలుగా నా ప్రతి ఆశని కలకాలం నీ నవ్వే నిను నడిపించనీ నను వెంటాడే కలా మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా నను రమ్మన్న చెలిమి వెన్నెల దాటి రానంది చీకటి కాపలా ఇకపై తెరలను తీసేదెలా నిన్ను నిన్నల్లో ఆపిన నిజమిల జ్ఞాప కాలతో అల్లింది సంకెల గతమే సిలువగ మోసేదెలా ఇచ్చేస్తున్నా నా ప్రియమైన నీకు నీకై వెతికిన నా ప్రతి శ్వాసనే నిను చేరి సిగ పువ్వై కొలువై ఉండనీ నను వెంటాడే కలా మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదెలా మనదను కున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా మరి మరి తలచి ఊహలలోనే దాచి చాటుగ చూసేదెలా తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా ఇకనైన చెరగాలి నల్లని నీడలా నను వెంటాడే కలా...