చిత్రం: రామయ్య వస్తావయ్యా (2013)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రంజిత్
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, శృతిహాసన్, సమంత
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 11.10.2013
సగమప మప మపగరె రెగరె
సగమప మప మపగరె రెగరె
గరెసారె సరెనిస సరెస
గరెసారె సరెనిస సరెస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
కోరస్: నువ్వే చెప్పమ్మ
ఈ పిల్లే వినడం లేదమ్మా
కోరస్: అబ్బే వినదమ్మ
ఓ చుక్కా నువ్వే చూడమ్మా
కోరస్: నువ్వే చూడమ్మ
నీ అక్కని మాట్లాడించమ్మా
మేఘాల పైనుండి వస్తార ఓసారి
రాగాలె తీయంగ తియ్యగా
చిరుగాలే అమ్మాయి ఉయ్యలే ఈ రేయి
జోలాలి పాడాలి హాయిగా
సగమప మప మపగరె రెగరె
సగమప మప మపగరె రెగరె
గరెసారె సరెనిస సరెస
గరెసారె సరెనిస సరెస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
కోరస్: నువ్వే చెప్పమ్మ
ఈ పిల్లే వినడం లేదమ్మా
కోరస్: అబ్బే వినదమ్మ
చరణం: 1
నలుపెక్కిన మబ్బుల్లోన
నలుదిక్కుల ఓ మూలైన
కళ్ళె మెరుపల్లె తుల్లె తుల్లే
వడగాలుల వేసవిలోన
చల చల్లగ ఓ నాడైన చల్లె
చినుకుల్నె చల్లె చెల్లే...
ప్రాణం కన్నా ప్రేమించె నీవాళ్ళున్నారే
ఆనందం అందించి అందాలె చిందాలే...
ఆ పైన ఉన్నోల్లు తీపైన మనవాళ్ళు
అడిగేది నీ నవ్వులే...
చరణం: 2
చిరునవ్వు నవ్వావంటె
పొరపాటని ఎవరంటారె
పిట్టా నవ్వే వద్దంటె ఎట్టా...
సరదాగ కాసేపుంటె
సరికాదని దెప్పేదెవరే
ఇట్టా యిస్తావ వారి చిట్టా...
కొమ్మా రెమ్మా రమ్మంటె నీతో వచ్చెయవా
గారంగా మారంగా కోరిందే ఇచ్చెయవా...
నీతోటి లేనోల్లు నీ చుట్టు ఉన్నారు
కల్లార ఓసారి చూడవే...
సగమప మప మపగరె రెగరె
సగమప మప మపగరె రెగరె
గరెసారె సరెనిస సరెస
గరెసారె సరెనిస సరెస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
కోరస్: నువ్వే చెప్పమ్మ
ఈ పిల్లే వినడం లేదమ్మా
కోరస్: అబ్బే వినదమ్మ
******** ******* ********
చిత్రం: రామయ్య వస్తావయ్యా (2013)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సాహితి
గానం: శంకర్ మహదేవన్, శ్రేయ గోషల్
నేనెప్పుడైన అనుకున్ననా
కనురెప్ప మూసి కలగన్నాన
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
గోరంత గుండెలో ఇన్నాళ్ళు
రవ్వంత సవ్వడే రాలేదు
మువ్వంత సవ్వడిగ అలజడి రేగె ఎందుకో
కనులు కనులు కలిసే కలలే అలలై ఎగసే
మనసు మనసు మురిసే మదువై పెదవే తడిసే
తెరలె తొలిగె సొగసే కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్ననా
కనురెప్ప మూసి కలగన్నాన
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
కన్నె కస్తూరినంత నేనై
వన్నె ముస్తాబు చెసుకోన
చెలి నీకు కష్మిరాల చలె పంచన
ఇంతికెంపయ్న రూపు నువ్వె
కంటి రెప్పయ్న వెయనీవె
నిండు కౌగిల్లలో రెండు నా కల్లలో
నిన్ను నూరేళ్ళు బంధించనా...
కనులు కనులు కలిసే కలలే అలలై ఎగసే
మనసు మనసు మురిసే మదువై పెదవే తడిసే
తెరలె తొలిగె సొగసే కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్ననా
కనురెప్ప మూసి కలగన్నాన
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
మల్లె పూదారులన్ని నీవై
మంచు పనీరులన్ని నేనై
వసంతల వలసే పొదాం సుఖాంతాలకే
జంట సందేళలన్ని నేనై
కొంటె సయ్యాటలన్ని నీవై
నువ్వు నా లోకమై నేను నీ మైకమై
ఏకమవుదాము ఈ నాడిలా...
కనులు కనులు కలిసే కలలే అలలై ఎగసే
మనసు మనసు మురిసే మదువై పెదవే తడిసే
తెరలె తొలిగె సొగసే కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్ననా
కనురెప్ప మూసి కలగన్నాన
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో