చిత్రం: రోగ్ (2017)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: వి. నాగేంద్ర ప్రసాద్
గానం: శ్రేయ గోషల్
నటీనటులు: ఇషాన్, మన్నారాచోప్రా, ఎంజెలినా
దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాత: సి.ఆర్.మనోహర్
విడుదల తేది: 31.03.2017
నీకోసం నే ఎదురు చూస్తున్నా
ఆజా సనం ఆజా సనం
నీ పేరే నే కలవరిస్తున్నా
ఆజా సనం హై ఆజా సనం
మనసిచ్చుకోనని ఏడుస్తు ఉంటది
ఇచ్చాక మనసిలా నను ఏడిపిస్తది
నీకోసం నే ఎదురు చూస్తున్నా
ఆజా సనం హై ఆజా సనం
పెదవిపైన చిరు నవ్వు లేదు
కనుపాప లోన మైమరుపులు లేవు
ఇంతలాగ దిగులెపుడు లేదుమరి
ఎందుకంటే నువు లేవుకదా
మనిషేమొ నేనిక్కడున్నా
మనసే నాతోటి లేదు
విరహాన వేధించకుండా
నువు రెక్కలు కట్టుకు ఇప్పటికిప్పుడు రా...
ఆజా సనం హై ఆజా సనం
నీకోసం నే ఎదురు చూస్తున్నా
ఆజా సనం హై ఆజా సనం
నిదురలేదు ఏం కుదురు లేదు
నీ చిలిపి చిలిపి ఆ తగువులు లేవు
నువ్వు తప్ప ఏం గురుతు లేదు
కన్నీళ్లు తప్ప కలలే లేవు
నన్నేమొ నీకిచ్చుకున్నా
నాతో నేనైన లేను
నిన్నొదిలి బతికుండగలనా
నా గుప్పెడు గుండెకు చప్పుడు పట్టుకు రా...
ఆజా సనం హై ఆజా సనం
నీకోసం నే ఎదురు చూస్తున్నా
ఆజా సనం హై ఆజా సనం
నీ పేరే నే కలవరిస్తున్నా
ఆజా సనం ఆజా సనం
మనసిచ్చుకోవని ఏడుస్తు ఉంటది
ఇచ్చాక మనసిలా నను ఏడిపిస్తది
నీకోసం నే ఎదురు చూస్తున్నా
ఆజా సనం ఓ ఆజా సనం
********* ******** *********
చిత్రం: రోగ్ (2017)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: వి. నాగేంద్ర ప్రసాద్
గానం: సునీల్ కశ్యప్
నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
క్యా కియా క్యా కియా
నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
క్యా కియా...
ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
తప్పించుకోలేక గింజుకున్నావే
ఓ ప్రేమనేది పిచ్చి అంటే
అవును పిల్లా నాకు పిచ్చే
మనసుకేమో రెక్కలొచ్చే
పట్టపగలే చుక్కలొచ్చే
ఓ ప్రేమనేది పిచ్చి అంటే
అవును పిల్లా నాకు పిచ్చే
బంగాళాఖాతంలో వాయుగుండంలా
అందంతో ముంచినావే
తళ్వారు చూపుల్తో తెల్లార్లు ఊహల్లో
ఏదేదో చేసినావే
ఏ స్వర్గలోకంలో ఇన్నాళ్లు ఉన్నావే
నా కళ్ళు కప్పేసి నువ్వేడి కెళ్లావే
నీలా నీలా నాకు ఎవరు నచ్చలేదులే
నీలా నీలా గుండెనెవరు గిచ్చలేదులే
ఆ ఖుదా సాక్షిగా మై ఫిదా హోగయా
క్యా కియా...
ఓ నవ్వు నవ్వేసి గుంజుకున్నావే
తప్పించుకోలేక గింజుకున్నావే
********* ******** *********
చిత్రం: రోగ్ (2017)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: వి. నాగేంద్ర ప్రసాద్
గానం: హేమ చంద్ర
ఆడదంటే తాట తీసే తబలా కదరా
బాబునార్లి ఎపుడో చెప్పే
నో ఉమను నో క్రై కదరా
దేవతల్లా నెత్తినెట్టి చూసుకుంటావ్ గనకే
కాలికల్లా గిత్తలేసి మొక్కుతుంటరు ఇలగే
వీరు కిల కిల కిల కిల కిల కిల నవ్వుతారే
గాజు గల గల గల గల గల గల ఉపుతారే
మన్ని పెళ పెళ పెళ పెళ పెళ పెళ దువ్వుతారే
మన ఫొటోకి దండేసి పోతారే
అమ్మా...
ఆడదంటే తాట తీసే తబలా కదరా
అడుకోవటం వాడుకోవటం
ఇళ్ళ బేసిక్ క్వాలిటీస్ కదరా
వీళ్ళ మాదిరి కోయ్ నహి హై
స్కెచ్ లేస్తే కిల్ ఖతం హై
ఓరి భయ్యా నమ్ముకుంటే
సర్వనాశనం అవుతాం అవుతాం
బొంగుకేసి కట్టనీకే కోరుకుతారు గోళ్లు
ఇన్నోసెంటు ఫేసు లెడతా
హెరాష్ మెంటే వీళ్ళు
ఓ పైకి చుస్తే మెత్త మెత్తగ
చాయి బన్నులా కనిపిస్తారే
లోపలేమో కుట్ర పన్నే
తాలిబన్లకు తాతలు వీళ్ళే
వయ్యారి కుళుకులు మూతి విరుపులు
నంగి అలకలు అన్ని
మగాళ్ల మనసుని వీళ్ళ బుట్టలో పడేయడానికి కాదా...
అమ్మా...
వీళ్ళు చాలా దేశముదురు హై
వీళ్ళ సకలకు ఫ్యుజు లెగురు హై
చూడు భయ్యా హింస పెట్టే
హంసలాంటి నడకల్ నడకల్
వీళ్ళ వల్లే లోకమంతా
బోలెడన్ని గొడవల్ గొడవల్
ఆడదంటే గొడవల్ గొడవల్
ఏ చరిత్ర చూసుకున్నా వీళ్ళదేరా న్యూసు
వివాదాలు విద్వాంశాలు వీళ్లవల్లే బాసు
ఓ హిట్ కొట్టే మగాడెనక అడదుందో లేదో కాని
మందుకొట్టే మగాడెనక కచ్చితంగా ఉండుండాలి
కన్నీళ్లు పెడతరు కాళ్ళు పడతరు
గోల పెడతరు చాలా
ఓసారి దొరికితే మడత పెడతరు
చావగొడతరు బాగా...
తాట తీసే తబలా కదరా
వీళ్ళ దెబ్బకు బుర్ర పగులు హై
దూల తీరి బేడ మిగులు హై
అవును అంటే కాదు అంటూ
నిన్ను చేస్తరు బకరా బకరా
ఎంత చేసిన చెయ్యలేదని
ఆడి పోస్తరు కదరా కదరా
ఓ ఆడదంటే తాట తీసే తబలా కదరా
అమ్మా...