Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rowdy Gaari Pellam (1991)




చిత్రం: రౌడీగారి పెళ్ళాం (1991)
సంగీతం: బప్పీ లహరి
నటీనటులు: యమ్. మోహన్ బాబు, శోభన
దర్శకత్వం: కె.ఎస్. ప్రకాష్ రావు
నిర్మాత: యమ్. మోహన్ బాబు
విడుదల తేది: 02.10.1991



Songs List:



యమా రంజుమీద ఉంది పుంజు పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీగారి పెళ్ళాం (1991)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: గురుచరణ్
గానం: యస్. పి. బాలు , చిత్ర

యమా రంజుమీద ఉంది పుంజు 
అరె జమాయించి దూకుతుంది రోజు
తిరుగుబోతు పెట్టని బుట్టకింద పెట్టుకో 
దుమ్మురేపి పోయాకా అమ్మమ్మో అబ్బబ్బో అనకే రంగసాని
యమా రంగు తేలివుంది పెట్టా 
దాని జమాయింపు దాచలేదు బుట్టా
దమ్ములుంటే రమ్మను మెరక ఈది మద్యకి 
కాలుబారు పుంజువని అప్పుడే చెప్పుకు గొప్పలు రౌడీ మావా

యమా రంజుమీద ఉంది పుంజు 
అరె జమాయించి దూకుతుంది రోజు

కోకో కొరుకో...

బలేబారు పుంజువని పొదల్లోకి లాగి పిచ్చివేషాలేశావంటే 
పట్టుకొని లాగుతాను రెండు జడలు రెండు
జడలుపట్టి లాగినా జారుపైట జారినా 
నిన్ను విడిచి పెట్టదురో వగల సెగల గుబులుమారి పెట్ట వడేసి పట్టా
వగలమారి పెట్టకి వాటమైన పుంజుకి 
ముచ్చటంత తీరేదాకా కచ్చి పిచ్చి రెచ్చి పోవునులే

యమా రంగు తేలివుంది పెట్టా 
దాని జమాయింపు దాచలేదు బుట్టా
య యమా రంజుమీద ఉంది పుంజు 
అరెరే జమాయించి దూకుతుంది రోజు

ఊరువాడ నాదేనని ఒళ్ళు విరుచుకుంటే 
కళ్ళముందే ముగ్గులోకి దించుతాది బలే కౌజు పిట్టా వాటేసి పట్టా
రెక్కవిప్పి కొట్టేనంటే చుక్కలు పడతాయి 
హే ముక్కు పోటు తగెలనంటే ముచ్చటంత తీరతాదే పెట్టా ఎగిగి కొట్టా
ఎగిరి దెబ్బకొట్టినా వగలముద్దు పెట్టినా 
ఈడు జోడు వేడిపుడితె హద్దు పద్దు లేదు రౌడీ మావా

యమా రంజుమీద ఉంది పుంజు 
అరె జమాయించి దూకుతుంది రోజు
తిరుగుబోతు పెట్టని బుట్టకింద పెట్టుకో 
దుమ్మురేపి పోయాకా అమ్మమ్మో అబ్బబ్బో అనకే రంగసాని
యమా రంగు తేలివుంది పెట్టా దాని జమాయింపు దాచలేదు బుట్టా
దమ్ములుంటే రమ్మను మెరక ఈది మద్యకి 
కాలుబారు పుంజువని అప్పుడే చెప్పుకు గొప్పలు రౌడీ మావా

యమా రంజుమీద ఉంది పుంజు 
అరె జమాయించి దూకుతుంది రోజు రోజు రోజు




కుంతీ కుమారి తననోరు జారి పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీగారి పెళ్ళాం (1991)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: జాలాది రాజారావు
గానం: కే. జే. యేసుదాసు

కుంతీ కుమారి తననోరు జారి రాసింది ఒక భారతం
కన్యాకుమారి తనకాలు జారి చేసింది నా జీవితం
క్షణకాల పాపం కనుమాయ చేసి తన పేగు తెంచిందిరా
లోకాలు పుట్టే ఆ మురికి తొట్టే నను కన్న కడుపాయెరా

కుంతీ కుమారి తననోరు జారి రాసింది ఒక భారతం

నీలాలు కారే నా కళ్ళనిండా నీరెండె మిగిలిందిరా
పాలరాబోసే పసిగుండెలోన పగ నిండిపోయిందిరా
లోకాలు తిరిగి ఏకాకి లాగ శోఖాన్ని దాచానురా
గతమంత మరిచే గరళాన్ని తాగి బతుకీడ్చు తున్నానురా

కుంతీ కుమారి తననోరు జారి రాసింది ఒక భారతం

నడివీధి రాళ్లే గుడిలోన పెట్టి దేవుణ్ణి చేశారురా
నను కన్న వాళ్లే నడివీధినేసి నగుబాటు చేశారురా
ఏ దేవుడైన నాలాగ పుడితే ఈ బాధ తెలిసేదిరా
దీపాల గుడికి పాపాల ఒడికి తేడాలు తెలిసేవిరా

కుంతీ కుమారి తననోరు జారి రాసింది ఒక భారతం
కన్యాకుమారి తనకాలు జారి చేసింది నా జీవితం



అ ఆ లే రానట్టు పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీగారి పెళ్ళాం (1991)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు , చిత్ర

అ ఆ లే రానట్టు  అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు
ఇట్టే అందేటట్టు ఇచ్చానే నా గుట్టు నటనెందుకు అర్ధం కానట్టు
హే ఉలుకు దేనికి ఉఁ అనమంటే జగడమాడకు జతకమ్మంటే
తగునా మగడా రగడా హ హా
నసపెట్టకు నా చుట్టూ పనియేమి లేనట్టు ఓపిగ్గా ఉండను ఈ పట్టు
మొనగత్తెవు అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరత్తు
చెప్పలేదని అనుకోవద్దు చుప్పనాతి చెడిపోవద్దు 
మెడతా పెడతా మడతా హ హా

అ ఆ లే రానట్టు  అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు హా

అరెరె రరె రెరె నీకు నాకు లింకేశాడు పైవాడు
నూరారైనా నూరేళ్లయిన తెగనీడు
ఆఁ హహా హే హేహే చాలదూరం వెళ్లిందమ్మా యవహారం
చాలించమ్మ ఎర్రెక్కించే ఎటకారం
హే వేస్తాను చూడు నీ ముక్కుతాడు నా గుండెల్లో ఉంది నీ గూడూ
చూడు నీ జోడు సయ్యాడు హో

నసపెట్టకు నా చుట్టూ పనియేమి లేనట్టు ఓపిగ్గా ఉండను ఈ పట్టు
ఓ అ ఆ లే రానట్టు  అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు

హో హో ప్రేమా గీమా అంటే నాకు పడవమ్మా
వద్దే మొర్రో అంటే మాట వినవమ్మా
ఓ హోహో  ఓ హోహో రాసేశాడే ఎట్టా మరి ఆ బ్రహ్మ
రాజీకొచ్చి లాగించేద్దాం ఈ జన్మా
హే రెచ్చిపోకే ఆడ బొమ్మ రేగానంటే ఆగవులేమ్మా
చిలకా గిలకా పలకా...

అ ఆ లే రానట్టు  అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు
ఆ మొనగత్తెవు అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరత్తు
ఓ ఉలుకు దేనికి ఉఁ అనమంటే జగడమాడకు జతకమ్మంటే
హే... ఓ... హ...





బోయవాని వేటుకు పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీగారి పెళ్ళాం (1991)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: గురుచరణ్
గానం: కే. జే. యేసుదాసు

బోయవాని వేటుకు గాయపడిన కోయిల
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండె కోత కోసిన చేసినావు ఊయల

బోయవాని వేటుకు గాయపడిన కోయిల

తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది 
ఆడతోడు ఉంటానని మూడుముళ్ళు వేయమంది
రాయికన్న రాయిచేత రాగాలు పలికించి 
రాక్షషుణ్ణి మనిషి చేసి తన దైవం అన్నది 
ఏనాటిదో ఈ బంధం

బోయవాని వేటుకు గాయపడిన కోయిల

చేరువైన చెలిమికి చుక్క బొట్టు పెట్టని
కరుణ చిందు కనులకు కాటుకైన దిద్దని
మెట్టెనింటి లక్ష్మికి మెట్టె నన్ను తొడగని
కాబోయే తల్లికి గాజులైన వేయని
ఇల్లాలికిదే సీమంతం

బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండె కోత కోసిన చేసినావు ఊయల
బోయవాని వేటుకు గాయపడిన కోయిల




ఆకుందా ఒక్కిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీగారి పెళ్ళాం (1991)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: రసరాజు
గానం: యస్. పి. బాలు , చిత్ర

జినకు జిన ఆకుందా ఒక్కిస్తా అరె సున్నంతో పొక్కిస్తా 
ఆ తడిపొడి పెదవులు తళుక్కు మంటే తలుపులు మూసేనా ఓ...
దినకు దిన ఆకుంది ఒక్కుంది అందాల చుక్కుంది
ఆ వలపుల తలుపులు తడిమేసేందుకు గడువింకా ఉంది ఓ...

అరరెెరరె  ఐసా పైసా తేలందే ఆగదు సన్నాయి - అమ్మో
అమ్మో గిమ్మో అంటున్నా ఆగదు బుజ్జాయి
జమహా పందిరి మల్లెమొగ్గనురో పదిలం కుర్రోడా
హే చిందరవందర చేశావో చందను చిన్నోడా
ఆ మొగ్గను పువ్వుగ నవ్విస్తా జామే జాతరా
హహ ఓ ఏ ఊఁ అరెర్రే...

జినకు జిన ఆకుందా ఒక్కిస్తా అరె సున్నంతో పొక్కిస్తా 
ఆ వలపుల తలుపులు తడిమేసేందుకు గడువింకా ఉంది
అరెరె రరెరె రెరెరె రెరెరే

అరె చకుముఖిరాయి చంపకురాయి సెగలే పుడతాయి
ఇక కలికితురాయి కామునిరేయి కధలే చెబుతాయి
యమహా లకుముఖి పిట్టా చెక్కిలి పట్టా చెంతకు వస్తావా
అరె అవతలి గట్టు ఆ తొలిమెట్టు అంచులు చూస్తావా
ఆ అంచుల హద్దులు చెరిపేస్తే ఒకటే మోతరా
ఓయ్ - ఓ, ఓయ్ - ఓ

జిన్నా జిన్నకు జిన్న ఆకుందా ఒక్కిస్తా అరె సున్నంతో పొక్కిస్తా 
ఆ తడిపొడి పెదవులు తళుక్కు మంటే తలుపులు మూసేనా
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
దినకు దిన ఆకుంది ఒక్కుంది అందాల చుక్కుంది
ఆ వలపుల తలుపులు తడిమేసేందుకు గడువింకా ఉంది
అరెరెరెరెరె రేయ్

చంపకు చంపకు చంపకు తకదిమి చంపకు చంపకు  చా
ఆ చంపకు చంపకు చంపకు తకదిమి చంపకు చంపకు  చా
అరెరె రరె డంటకు డంటకు డంటకు తకదిమి డంటకు డంటకు

Most Recent

Default