Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sampangi (2001)




చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
నటీనటులు: దీపక్, కాంచి కౌల్
దర్శకత్వం: సానా యాది రెడ్డి
నిర్మాత: శ్రీమతి కళ్యాణి వెంకటేష్
విడుదల తేది: 13.07.2001



Songs List:



పేంటేస్తేగాని తెలియలేదురా మామా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: వరికుప్పల యాదగిరి , ఘటికాచలం

పేంటేస్తేగాని తెలియలేదురా మామా 




గుండె నెందుకిచ్చావురా దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: యస్.పి.బాలు 

గుండె నెందుకిచ్చావురా దేవుడా 
ఎండమావి చేసావురా దేవుడా
అమృతమంటి ప్రేమను కురిపిస్తావు
మరు నిముషంలో విషముగా మరిగిస్తావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా 

మనసు మనసుతో ముడివేసి మౌన ప్రేమతో పెనవేసి
ఒకరినొకరిగా తోడును చేస్తావు
ఒకరి నీడలో ఒకరిని చూస్తావు
వలపు దీపాలు వెలిగించి
వేళా వెన్నెలలు కురిపించి
కళల కాలాన్ని కరిగించేస్తావు
శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు

ఆడినంతసేపడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు
ఊహ తెలియని పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు
ఏమాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరికొడతావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా 

ఎదను గుడిలాగా మార్చేసి
ఎదుట దేవతను చూపించి
ప్రేమ పూజలే జరిపించేస్తావు
వింత మాయలో పడదోసేస్తావు
బ్రతుకు హారతిగా వెలిగించి
వెతల పాత్రలో కరిగించి
వెలుగు రేఖలను నిలువునా కోస్తావు
విలువ చీకటిగా మిగిలించేస్తావు

నిండు ప్రాణాలు కదిలిపోతుంటే కన్నె నీటితో కాల్చేవు
బండరాయిలా నువ్వుంటావు కనుకనే బాధపడలేవు
ఈ మాయలన్ని ఇక నీకే తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా 
ఎండమావి చేసావురా దేవుడా
అమృతమంటి ప్రేమను కురిపిస్తావు
మరు నిముషంలో విషముగా మరిగిస్తావు

గుండె నెందుకిచ్చావురా దేవుడా  



అందమైన కుందనాల బొమ్మరా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: వరికుప్పల యాదగిరి

కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే
ఓపెనర్ జారిపోయే
వీడి గుండె ఓపెనైపోయే
మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే
అంతలోనే మాయమాయె
వాడి మనసు దాటి వెళ్లిపోయే
అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా
బైక్ వాడు స్టార్ట్ చేస్తే
రైల్ ఉ గేట్ దాటి వెళ్లిపోయే
వీడి గుండె గిల్లి వెళ్లిపోయే

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఏ ఇంటి వనితో మరీ
నా ఎద మీటి పోయే చెలీ
ఏచోట ఉందొ మరీ
నా ప్రియమైన ఆ సుందరీ

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

అనుకోకుండానే నేను చూసాను ఆమెనూ
ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు నా మనసునూ
అనుకోకుండానే నేను చూసాను ఆమెనూ
ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు నా మనసునూ

ఎక్కడని వెతకాలి ఆ ప్రేమనూ
చూడకుండా ఉండలేను ఏం చెయ్యనూ
ఏమో ఏ మెడల్లో దాగి ఉందొరా

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడీ
చూపుల వలా వేసి తీసుకెళుతుంది తన వెంబడీ
ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడీ
చూపుల వలా వేసి తీసుకెళుతుంది తన వెంబడీ

ఒక్కసారి చేరాలి ఆ నీడనూ
విన్నవించుకోవాలి ఈ బాధనూ
ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

ఏ ఇంటి వనితో మరీ
నా ఎద మీటి పోయే చెలీ
ఏచోట ఉందొ మరీ
నా ప్రియమైన ఆ సుందరీ

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా




చెలియా నిను చూడకుండా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరాం 

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పొయ్యవే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా

నేచ్ఛేలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలినై
నా చెలి నుదుటికి అందానిచ్ఛే సిందూరమై
కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై
హక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై

గున్నమావి తోటల్లోనా నే ఎదురు చుస్తాలే
గుప్పెడంత గుండెల్లోనా చోటిస్తా రావయ్యో
నా ప్రేమ రాశివి నువ్వే హా
నా ఊపిరి చిరునామా నువ్వే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా

మానస వాచా నీ మదిలోన కొలువుండానా
నా నిలువెల్లా దాసోహాలే చేసేయనా
ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా
ఏడడుగులతో కొంగు ముడేస్తా ఏదేమైనా

నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా
నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా
నా రెండు కన్నులు నువ్వే హా
నా చంటి పాపవు నువ్వే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

నా అడుగుల్లో అడుగేస్తూ నా మది లోయల్లో చూస్తూ
నా అడుగుల్లో అడుగేస్తూ నా మాది లోయల్లో చూస్తూ
నా గుండెల్లో చొరబడి పొయ్యవే

చెలియా నిను చూడకుండా ఉండలేనమ్మా




నచ్చావే భామా పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సుఖ్విందర్ సింగ్ 

నచ్చావే భామా 




సంపంగి రెమ్మ పూబంతి వమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: సంపంగి (2001)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: ఉన్ని కృష్ణన్

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా
ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే
ఓ… నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోందే
పరిసరి పసనిస నినిపమరిస రిపమప
మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే
ఓ…యదను తాకగనే ఏదో హాయి రగిలేనే
చాటుమాటుగా నిన్నే నే చూస్తున్నానే
గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే
ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే

సంపంగి రెమ్మా... పూబంతి వమ్మా...
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా

రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే
ఓ… కలలో నిన్నే చూసి మురిసిపోతానే
ఆ ఆ ఆ ఆ ఉదయమే ఐనా మేల్కొన మనసు పడనీదే
ఓ… కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని
ఏకాంతానా నీ ఊహలో జీవిస్తానే
ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే
నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా

సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా

Most Recent

Default