Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sathruvu (1990)




చిత్రం: శత్రువు (1990)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: వెంకటేష్ , విజయశాంతి
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: యమ్.ఎస్.రాజు
విడుదల తేది: 28.12.1990



Songs List:



అమ్మ సంపంగి రేకు పాట సాహిత్యం

 
చిత్రం: శత్రువు (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
అమ్మ సంపంగి రేకు...అల్లాడే పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు...అందాలు అంటుకోకు
పుచ్చుకుంటాలే నీ పూతరేకు...
విచ్చుకుంటా గానీ వీడిపోకు...
జై మదనకామ నా ప్రేమ ఈ భామా సై అంటే మోతరో...
నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంతలేతరో...

చరణం: 1
కలే కలై కలయికే సెగై చలి గిలా గిలా ముగిసే
సరే సరే గడు సరే జతై మగసిరి పురి తెలిసే
శ్రీరాగం చిందులు వేసే నాపాటకు నీ పైట జారిందిలే
శ్రీవారే చిత్తైపోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే
సైఅంటే నీకళ్ళు సందిల్లే పందిళ్ళు
ముద్దంటే చెక్కిళ్ళు సన్నాయి మద్దేళ్ళు
మాపటేలా దీపమేల చందమామ లాంటిపిల్ల చందనాలు చల్లిపోతే

చరణం: 2
యమో యమో చలి ఉపాయమో కసి కధాకళీ తెలిపే
నమో నమో మరునిబాణమో విరి దుకాణమో తెలిసే
నీ చూపుల ధీమంత్రాలే సాయంత్రాలాపాలు కోరేనులే
నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే
ఇంకేమి ఇవ్వాలో తమకేమీ అవ్వాలో
ఒకటైతే మనసివ్వు రెండైతే ఒకటవ్వు
మంచిరోజు పొంచివుంది మావిడాకు తోరణాల మల్లెపూల శోభనాలలో




చెయ్ చెయ్ పాట సాహిత్యం

 
చిత్రం: శత్రువు (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

చెయ్ చెయ్



మాట వింటారా పాట సాహిత్యం

 
చిత్రం: శత్రువు (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, చిత్ర

మాట వింటారా





పొద్దున్నే పుట్టింది చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: శత్రువు (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగ పుట్టావ గీతికా హోయ్
స్నేహంతో మీటావ మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈ నాడు నిద్దరలేచీ 
ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

చరణం: 1
ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మా 
ఓ రబ్బరు బొమ్మా లాలించేదెట్టా చెప్పమ్మా
మొగ్గంటి బుగ్గలో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో 
ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జో కొట్టాలయ్యో
నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాలా ఈ కొంటె పాపాయికీ
ముందూ ముడుపూలేనీ ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో 
ముద్దు మురిపాలన్ని పండించేదెట్టాగో
ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరుగని 
ఈ కొంటె చక్కిలిగింతల ఉకిరిబిక్కిరికి

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

చరణం: 2
నీ కోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లే గూడే కట్టాను 
నా బంగరు గువ్వ గుమ్మంలో చూపులు పెట్టాను
నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురముంటాను 
నా పచ్చని కొమ్మా పొమ్మన్నా పక్కకి పోలేను
శృంగార స్నేహాల సంకెళ్ళు వెయ్యాల చింగారి చిందాటతో
ఉరికే గోదారంటి నా ఉడుకూదుడుకూ 
తగ్గించీ కొంగునకట్టేసేది కిటుకేదో చెప్పమ్మా
పసి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో 
పగలేదో రేయేదో తేలియదు లేవయ్యో

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగ పుట్టావ గీతికా హోయ్
స్నేహంతో మీటావ మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈ నాడు నిద్దరలేచీ 
ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో




యమ తాకిడి పాట సాహిత్యం

 
చిత్రం: శత్రువు (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

యమ తాకిడి

Most Recent

Default