Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sreeram (2002)





చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్, అనిత
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: బురుగపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 21.06.2002



Songs List:



మామారే మజారే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఆర్.పి. పట్నాగరుక్, కౌసల్య

పల్లవి:
మామారే మజారే మామారే మజారే
మామారే మజారే మజ్జా
మామారే మజారే మామారే మజారే
మామారే మజారే మజ్జా
అరె ఊరంతా వినేలా పాడు
అహా కొండంతా ఖుషీగా ఆడు
మన శ్రీరాముడు మరో జన్మెత్తాడు
మళ్ళీ వచ్చాడు ఈనాడు

చరణం: 1
మనసుల జత వయసుల జత కలిసేవేళ
మనగడ కథ మధురం కద చాలాచాలా
అందాల నీ ప్రేమ రాజ్యానికి అధికారి నేనే సుమా
సందేళ సరిలేని సరసానికి దొరసాని నువ్వే సుమా
ఇలా రెండింతలై అలా మూడింతలై
భలేగుంది పెరిగింది కేరింత ఇంత అంతకంత

చరణం: 2
కాదననిక లేదననిక ఏదేమైనా
రేపననిక మాపననిక ఏకంకానా
వయ్యారి నీమేని ఉయ్యాలలో 
వెయ్యేళ్ళు వూగేయనా
వెన్నంటి నువ్వుంటే నా బాటలో 
స్వర్గాలు పాలించనా
ఇది తారంగమో మరీ వీరంగమో
ఈ వంక చూడంగ వేగంగా నింగివంగిపోయె



మోనాలిసా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.చరణ్

పల్లవి:
మోనాలిసా మోనాలిసా మోనాలిసా మోనాలిసా
నా మనసునే చేశావులే నీ బానిసా
నీ ప్రేమకై వూగిందిలే ఎదవూగిసా


చరణం: 1
అవతరించింది భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీ వైపే చూడగా
శిరసు నూపింది పువ్వు నీ సిగలో చేరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెత్తానులే నీ ప్రేమ పొందగా
ధన్య మయ్యానులే నీ చూపు సోకగా
జంటగా చేరగా మారిందిలే నా దశ

చరణం: 2
మెరిసిపోవాలనుంది పెదవింట్లో నవ్వునై
మోగిపోవాలనుంది మది గుడిలో నాదమై
ఒదిగి పోవాలనుంది కౌగిట్లో కాలమై
నిలిచి పోవాలనుంది పాపిట్లో తిలకమై
బిగిసి పోతానులే నీ ఆత్మబంధమై
కరిగిపోలేనులే నీ కంటి బిందువై
నిత్యమూ చేయనా నీ గుండెలోనే బస



బుల్లి బుల్లి నా బొండు మల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష

పల్లవి :
బుల్లి బుల్లి నా బొండు మల్లీ
బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ హాయ్ 
పాడరట్టి కుంకుమెట్టి ముస్తాబయ్యేస్తే 
ఆడుదామే కొక్కో కోలాటం
చీరకట్టి సెంటుకొట్టి నా చెంత కొస్తే
చూపుతాలె కుర్రాడి వాటం

మల్లీ మల్లీ నా మావా మళ్లీ 
మళ్లీ మళ్లీ నా మావా మళ్లీ హాయ్
డాబు చాలు గాని బాబూ నీ చెంత కొస్తే
ముగ్గులాగ ముడిచేసుకుంటావ్
గడ్డి వాము చాటు కొచ్చి నే సైగ చేస్తే 
సిగ్గుతోటి లగెత్తు కుంటా

చరణం: 1
ఆ పంచ కట్టేసి ఓ పింఛమెడితే
కిట్టయ్య లాగా మా బాగా వున్నావే
అందాల రాధమ్మ నువుగాని అయితే
నీ పక్క నేను కిట్టయ్య నౌతాలే
అమ్మదొంగ ఎటకారం వద్దు
ఇంక నాతో చెలగాటం వద్దు 
ఒక్కటయ్యే వీలే లేదా
ఓ వెన్నదొంగా ఈ కన్నెబెంగ తీరేది ఎట్టాగా
నా సామిరంగా బంగారు జింకా పట్టింది నేనేగా

చరణం: 2
నీ నవ్వు ముత్యాలు నే తీసుకెళ్ళి
ముత్యాల హారం చేయించి ఇస్తాలే
నీ సూపు వజ్రాలు నేనేరుకెళ్ళి 
అద్దాలమేడ కట్టించి ఇస్తాలే...
అయ్య బాబాయ్ గాలే కొట్టొద్దు
నువ్వు కూడ అట్టే మొయ్యెద్దు 
నేనంటేను ప్రేమేలేదా
వయ్యారి బాలా ఓ మేఘమాలా 
పండిందే నా పంట
ఓ చందమామా నా మేనమామా 
నేనేగా నీ జంటా



చిన్న చిరునవ్వుతోటి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్.పి.చరణ్, ఉష

పల్లవి:
చిన్న చిరునవ్వుతోటి కాలి సిరి మువ్వతోటి
కొత్తగా చెప్పెనమ్మా కన్నె ప్రేమా
నీలి మేఘాలలోనా నీటి ముత్యాలలాగా
గుండెలో చేరేనేమో ఇంత ప్రేమా
నువ్వే నువ్వే నాలో ఇలా సాగే మనోభావనా
నువ్వే నువ్వే నాలో ఇలా పాడే ప్రియాలాపనా

చరణం: 1
ప్రేమలో తేలితే ఈడుకి మాటలే వుండవా
ఇద్దరూ ఒక్కటై ఉండగ మాటలే దండగ
తీపి రాగాల ప్రేమగీతాలు పాడగా పల్లవి
పంచ భూతాలు చెంతకే చేరి మోయవా పల్లకీ
ఈ ప్రేమే ఇక నడుపునులే బంగారులోకాలకీ

చరణం: 2
ముందుగా చూడనే లేదుగ ప్రేమలో తీపినీ
అందరూ చేదనే మాటలు ప్రేమలో లేవనీ
ప్రేమనే ప్రేమ కానుకిచ్చాక నమ్మనే లేదుగా
ప్రేమ ప్రేమించి నన్ను మార్చాక నేను నే కాదుగా
ఆ నువ్వే నా జత కలిసి నా నువ్వు అయ్యావుగా



తీయ తీయని పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: ఆర్పీ పట్నాయక్, కులశేఖర్
గానం: బోంబే జయశ్రీ

పల్లవి:
తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను
నీ కౌగిళ్ళలో
నేనెవరన్నది నే మరచిపోగలను
చూస్తూ నీ కళ్ళలో

తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో

తందారె నరె నరె నరె నరె నారే
తందారె నరె నరె నారే
తందారె నరె నరె నరె నరె నారే
తందారె నరె నరె నారే

చరణం: 1
చల చల్లని మంచుకు అర్ధమే కాదు
ప్రేమ చలవేమిటో
నును వెచ్చని మంటలు ఎరగవేనాడు
ప్రేమ సెగలేమిటో
వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు
ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు
ఈడు బాధేమిటో

తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో

చరణం: 2
మురిపెంతో సరసం తీర్చమంటోంది
ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది
తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది
ఆవిరై గాలిలో
కలిసుండే కాలం నిలిచిపోతుంది
ప్రేమ సంకెళ్లలో

తీయ తీయని కలలను కనడమే తెలుసు
కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు
ప్రేమనే మత్తులో



పెదవుల్లో పెప్సీకోలా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ్ (2002)
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి. పట్నాయక్

పల్లవి:
పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకోకోలా
పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకోకోలా
ఒక్కోలా వుందిర బాలా దిల్ ధడక్ ధడక్ లా
ఎథే.... హోళీలా... ఉంటుందే... మీవల్లా....

చరణం: 1
హంస నడకలు సిగ్గుపడేలా పిల్లినడకల స్టైలా
హింస పెట్టి చంపేసేలా కొంపముంచే స్మైలా
వానవిల్లే ఖంగుతినేలా ఇన్ని రంగులు చూపాలా
మేల్ జాతికి కీడొచ్చేలా వుంది మీ వల్లా

చరణం: 2
పడుచు పాపలు నవ్వితే ఇలా ఫాంటసీ ఫౌంటెన్లా
నైటు మొత్తం నాటి కలలే శాటిలైట్ ఛానెల్లో
ఎగిరిపోదా గాలి పటంలా వయసుమీ వెలకాలా
గుండె నమిలేలా నడవాలా నెమలి పింఛంలా

Most Recent

Default