Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Subha Sankalpam (1995)





చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: కమల్ హాసన్, ఆమని, ప్రియా రామన్
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
విడుదల తేది: 13.07.1995



Songs List:



సీతమ్మ అందాలూ పాట సాహిత్యం

 
చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర, యస్.పి.శైలజ & కోరస్

సీతమ్మ అందాలూ  రామయ్య గోత్రాలు 
రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు 
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలు 
రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు 
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు 
ఏకమైన చోట వేద మంత్రాలు 
ఏకమైన చోట వేద మంత్రాలు

సీతమ్మ అందాలూ  రామయ్య గోత్రాలు 
రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు 

హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ
హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
ఓంపులెన్నో కొయి రంపమేయంగా
చినికు చినుకు గరాలే చిత్ర వర్ణాలు
సొంపులన్ని గుండె గంపకెత్తంగా
సిగ్గులలోనే పుట్టేనమ్మా చిలక పాపాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
ఉల్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు

సీతమ్మ అందాలూ  రామయ్య గోత్రాలు 
రఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు

తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్

మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా
అరె మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా
అబ్బో ఆశ...
శృంగార పెళ్ళికొడకా... ఇది బంగారు వన్నె చిలకా
శృంగార పెళ్ళికొడకా బంగారు వన్నె చిలకా మువ్వకులిస్తే రాదు మోజుపడక
మువ్వకులిస్తే రాదు మోజుపడక

తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్

హేయ్ రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తీర్చుకోనే దీప కాళికా
రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తీర్చుకోనే దీప కాళికా
రాయంటి చిన్నవాడా... మా రాయుడోరి చిన్నవాడా...
మనసిచ్చి పుచ్చుకోర మామ కొడకా
మనసిచ్చి పుచ్చుకోర మామ కొడకా
మనువాడతాను గాని మాను అలకా

తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్




మూడు ముళ్ళు వేసినాక పాట సాహిత్యం

 
చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్.పి.శైలజ & కోరస్

మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు 
గూటి బయటే గుట్టులాట 
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంట ఎంకి పాట 

ఆకుపచ్చ కొండల్లో....ఓఓ...గోరు వెచ్చ గుండెల్లో 
ఆకుపచ్చ కొండల్లో,గోరు వెచ్చ గుండెల్లో 
ముక్కు పచ్చలారబెట్టి ముద్దులంట

చరణం:1 
ఆహహహా
ఓయ్ పుష్య మాసమొచ్చింది భోగి మంటలేసింది 
కొత్త వేడి పుట్టింది గుండెలోన...హ హ... 
రేగు మంట పూలకే రెచ్చిపోకు తుమ్మెద 
కాచుకున్న ఈడునే దోచుకుంటే తుమ్మెద 
మంచు దేవతొచ్చిందా మంచమెక్కి కూకుందా... 
ఆహ ఆహ
వణుకులమ్మ తిరణాల్లే ఓరి నాయనో... 
సీతమ్మోరి సిటికిన ఏలు సిలక తొడిగితే సిగ్గులెర్రన 
రాములోరు ఆ సిలక కొరికితే సీతమ్మోరి బుగ్గలెర్రన

చరణం: 2 
వయసు చేదు తెలిసింది మనసు పులుపు కోరింది 
చింత చెట్టు వెతికింది చీకటింట 
హ హ
కొత్త కోరికేమిటో చెప్పుకోవే కోయిల 
ఉత్త మాటలెందుకు తెచ్చుకోర ఊయల 
హ హ
ముద్దు వాన వెలిసింది పొద్దు పొడుపు తెలిసింది 
వయసు వరస మారింది ఓరి మన్మధా
మూడు ముళ్ళ జతలోన ముగ్గురైన ఇంటిలోనా
జోరు కాస్త తగ్గనీర జో జో జో 




హైలెస్సో హైలెస్సో పాట సాహిత్యం

 
చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి. బాలు, చిత్ర , పల్లవి & కోరస్

హైలెస్సో హైలెస్సో హైలెస్సో..హైలెస్స 
హైలెస్సో హైలెస్సో హైలెస్సో...హైలెస్స.. 

సూర్యుడైనా చలవ చంద్రుడైనా కోటి చుక్కలైనా అష్ట దిక్కులైనా 
నువ్వైనా అహ నేనైనా అహ రేవైనా...అహ నావైనా 
సంద్రాన మీనాల సందమే 
హైలెస్సో హైలెస్సో హైలెస్సో..హైలెస్స.. 

నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో...హైలెస్సా.. 
నింగి నీలమంతా సంద్రమే హైలెస్సో...హైలెస్స 
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే 
నేల కరిగిపోతే సంద్రమే..నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే 


చరణం: 1 
life is a holiday jolly day...హైలో హైలెస్స 
spend it away in a fabulous way..హైలో హైలెస్స 
you...need a break boy, dont you thank me 
eat a piece of cake...హైలో హైలెస్స...హైలో హైలెస్స 
you..need a break boy, dont you thank me? 
eat a piece of cake...హైలో హైలెస్స...హైలో హైలెస్స 
twinkle little star I know what you are 
జానే బీదో యార్ గోలితో మార్ 
twinkle little star I know what you are 
జానే బీదో యార్ గోలితో మార్ 
హైలెస్స...హైలెస్స...life is a తమాషా.. 
you sing it హమేషా...I dont know సపస 
నీలాల కన్నుల్లో సంద్రమే..నింగి నీలమంతా సంద్రమే 

చరణం: 2 
ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల 
ఆపకండి ఈ వేళ కూనలాల కొత్త వానలాల 
కోటి సంబరాల కొత్త వానలాల 
చెంగుమంటు గంగ పొంగులెత్తు వేళ 
ఒళ్ళు మరిచిపోవాలి నింగి నేల 
నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే 





చిరంజీవి.. సౌభాగ్యవతి.. పాట సాహిత్యం

 
చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర , పల్లవి

చిరంజీవి.. సౌభాగ్యవతి.. గంగా మహాలక్ష్మికి.. 
ఊరు.. మమతలూరు.. 
తాలూకా.. ఊహాపురం.. 
జిల్లా.. అనంతగిరి.. 

చరణం: 1 
ఎవరు ఇచ్చారమ్మా ఇన్నక్షరాలు.. 
అక్షరాల యెనక ఎన్ని అర్ధాలు.. 
ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలూ.. 
విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు.. 

చరణం: 2 
అక్షరాలా కావవి ఆమ్మోరి అక్షితలూ.. 
మరు జన్మకివి నీకు మాలక్ష్మి సేజలు.. 
గుడిలోని దేవత నడచి పోతావుంటే.. 
గుడిలోని దేవత నడచి పోతావుంటే.. 
అడుగడుగూ దండాలు పాదాలకీ..... 
పసిడి పాదాలకి.. పసుపు వేదాలకీ..... 



శ్రీశైలంలో మల్లన్న పాట సాహిత్యం

 
చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నలకంటి 
గానం: యస్. పి. బాలు & కోరస్

శ్రీశైలంలో మల్లన్న 
సింహాద్రిలో అప్పన్న 
తిరపతిలో ఎంకన్న 
బధ్రగిరిలో రామన్న 
ఆ దేవుళ్ళందరి కలబోత 
అయ్యా సామీ నువ్వేనంటా 

చరణం: 1 
దండాలయ్య సామికి 
దండలు వేయరా సామికి 
దాసుల గాచే సామికి దండకాలు
దండాలయ్య సామికి 
దండలు వేయరా సామికి 
దాసుల గాచే సామికి దండకాలు
కొండంతా అండల్లే కొలువైన 
మా రేడు కొంగు బంగారైనాడు 
ఈ దొర....ఓ...మా దొర....ఓ... 

చరణం:2 
సిరులిచ్చే సంద్రమంటే 
దైవం మా దొరకి 
సెమటొచ్చే వాడంటే ప్రాణం 
మా సామికి 
మచ్చలేని మనిషిరా 
మచ్చరమే లేదురా 
ఎదురు లేని నేతరా ఎదురులేని నేతరా 
చేతికెముకలేని దాతరా 
ఎదలో నిలుపుకుంటే 
ఒదిగిపోవు దేవరా 




నరుడు బ్రతుకు పాట సాహిత్యం

 
చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు


నరుడు బ్రతుకు 



చుక్కలన్నీ కలిసి పాట సాహిత్యం

 
చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్.పి.శైలజ & కోరస్


చుక్కలన్నీ కలిసి



హరి పాదాన పుట్టావంటే పాట సాహిత్యం

 
చిత్రం: శుభసంకల్పం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్.పి.శైలజ & కోరస్

హరి పాదాన పుట్టావంటే గంగమ్మ.. శ్రీ హరి పాదాన పుట్టావంటే గంగమ్మ.. 
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా.. 
కడలే కౌగిలిని.. కరిగావంటే గంగమ్మా.. 
నీ రూపేదమ్మా.. నీ రంగేదమ్మా.. 
నీ రూపేదమ్మా.. నీ రంగేదమ్మా.. 
నడి సంద్రంలో నీ గడపేదమ్మా గంగమ్మా.. 
నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో.. నింగి నీలమంతా సంద్రమే హైలెస్సో.. 
నీలాల కన్నుల్లో సంద్రమే.. నింగి నీలమంతా సంద్రమే.. 

Most Recent

Default